Warangalvoice

Telangana

సాయంలోనూ తగ్గేదేలే..
District News, Telangana, Viral News

సాయంలోనూ తగ్గేదేలే..

ఐకాన్ స్టార్ ఔదార్యం.. డ్రైవర్ ఇంటి నిర్మాణానికి రూ.15లక్షల సాయం కమలాపూర్ వాసి, డ్రైవర్ మహిపాల్ ఇంట విరిసిన ఆనందం వరంగల్ వాయిస్, హనుమకొండ: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ .. పాన్ ఇండియా లెవల్ లో తగ్గేదేలే.. అనే నటనతో ఉర్రూతలూగిస్తున్న విషయం తెలిసిందే. మెగా కంపౌండ్ నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నటన, డాన్స్ , డైలాగ్ డెలివరీలో తనదైన మార్క్ చూపించుకుంటున్నాడు. సినిమా సినిమాకు తన కెరీర్ ను ఉన్నతంగా మలుచుకుంటున్నాడు. ఐకాన్ స్టార్ గా వరల్డ్ వైడ్ అభిమానులను సంపాదించుకుంటున్నాడు. అయితే ఈ అల్లు వారి అబ్బాయి.. నటుడిగానే కాకుండా రియల్ లైఫ్ తన మంచి మనస్సుతో అందరినీ హృదయాలను ఆకట్టుకుంటున్నాడు. అభిమానులతో పాటు తన దగ్గర పనిచేసే వ్యక్తులను కూడా సొంతింటి వారిలాగా చూసుకోవడం ఆయనకే చెల్లింది. తాను మాత్రమే బాగుండడం కాదు.. తన దగ్గర పనిచేసేవాళ్లు కూడా బాగుండాలని కోరుకునే వ్యక్త...
సాంకేతిక ప్రపంచంలో దూసుకెళ్లండి
Telangana, Today_banner, Top Stories

సాంకేతిక ప్రపంచంలో దూసుకెళ్లండి

ఆత్మన్యూనతా భావాన్ని విడనాడాలి.. ఎలాంటి ఆకర్షణలకు లోను కావొద్దు.. లక్ష్యాన్ని ప్రేమించి నిరంతరం శ్రమించాలి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఆర్జీయూకేటీ బాసరలో విద్యార్థులకు ఉద్బోధ ప్రస్తుత సాంకేతిక యుగంలో తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదని, నిరంతరం శ్రమించిన వాడే విజేత అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ప్రేరణ కలిగించారు. శనివారం ఆర్జీయూకేటీ బాసరలో ‘ఇంజినీరింగ్ విద్య, నైపుణ్యం – భవిష్యత్తు’ అనే అంశంపై విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. తన జీవితంలో జరిగిన ఘటనలను ఉదహరిస్తూ.. విద్యార్థులకు స్ఫూర్తివంతమైన ప్రసంగం చేశారు. పేద విద్యార్థులు కుటుంబ పరిస్థితులను తలుచుకుని కుమిలిపోవద్దని, లక్ష్యాన్ని ప్రేమించి కసితో, పట్టుదలతో చదివి గెలుపు బావుటా ఎగురవేయాలని సూచించారు. ప్రస్తుత సాంకేతిక యుగంలో ప్రతీ ఇంజినీరింగ్ విద్యార్థి ఒక సృష్టికర్త, ఒక ఆవిష్...
ఆర్థిక శక్తిగా తెలంగాణ
Telangana

ఆర్థిక శక్తిగా తెలంగాణ

అన్నిరంగాల్లో రాష్ట్రం పురోగమనం దేశంలోనే అద్భత విజయం.. 24 గంటల విద్యుత్‌ అత్యధిక ధాన్యం ఉత్పత్తితో దేశానికి అన్నపూర్ణ 11.6 శాతం రికార్డు స్థాయి వ్యవసాయ వృద్ధిరేటు మిషన్‌ భగీరథతలో వందశాతం గ్రామాలకు తాగునీటి సౌకర్యం గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్‌ 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సోమవారం అంగరంగ వైభవంగా జరిగాయి. మువ్వెన్నెల జెండా సగర్వంగా ఎగిరింది. వాడవాడనా సంబురాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్ గోల్కొండలో సీఎం కేసీఆర్ జెండా ఆవిష్కరించి, అనంతరం రాష్ట్ర ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, సకల జనులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహనీయుల త్యాగాలను స్మరించుకున్...
మూడు తరాల ముచ్చటైన రాఖీ వేడుక
Telangana

మూడు తరాల ముచ్చటైన రాఖీ వేడుక

కేసీఆర్, కేటీఆర్, హిమాన్ష్ లకు రాఖీలు కట్టిన ఆడపడుచులు వరంగల్ వాయిస్, ప్రగతిభవన్ : హైదరాబాద్ ప్రగతిభవన్ లో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, హిమాన్ష్ లకు వారి ఇంటి ఆడపడుచులు రాఖీలు కట్టారు. సీఎం కేసీఆర్ కు అతని సోదరిమణులు రాఖీ కట్టగా, కేటీఆర్ కు తన చెల్లి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాఖీ కట్టారు. హిమాన్ష్ కు అతని సోదరి రాఖీ కట్టి వేడుకలు జరుపుకున్నారు. ఇలా ముగ్గురికి మూడతరాల ఆడపడుచులు రాఖీ కట్టారు. ఆడపడుచులు అన్నల వద్ద ఆశీర్వచనాలు తీసుకొనడంతో ప్రగతిభన్ సందడిగా మారింది....
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా అల్లం నారాయణ
District News, Telangana

తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా అల్లం నారాయణ

వరంగల్ వాయిస్, హనుమకొండ టౌన్: తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా అల్లం నారాయణ పదవి కాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం సోమ‌వారం ఉత్తర్వులు జారీ చేసింది. మీడియా అకాడ‌మి శాశ్వ‌త భ‌వ‌న నిర్మాణంతోపాటు జర్నలిస్టుల సంక్షేమానికి నిరంత‌రం శ్ర‌మిస్తున్న ఉద్య‌మ కారుడు అల్లం నారాయణకు ప‌లువురు జర్నలిస్టులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు....
నిరంతర సాధనే – విజయమార్గం
Telangana, Today_banner, Top Stories

నిరంతర సాధనే – విజయమార్గం

ప్రణాళికతో చదివి విజేతగా నిలువండిపట్టుదలతో ఇష్టపడి చదవాలిచదువుతోనే ఉజ్వల భవిష్యత్తురాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథికామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉద్యోగార్థులకు అవగాహన సదస్సు ‘‘సిలబస్ పై పట్టు.. ప్రామాణిక పుస్తకాల అధ్యయనం.. నిరంతర సాధన..’’ ఇవే పోటీపరీక్షల్లో విజేతగా నిలువడానికి విజయ సూత్రాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి ఉద్బోధించారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోటీపరీక్షలపై ఉద్యోగార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మార్గనిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ.. పక్కా ప్రణాళికతో చదవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సమయాన్ని వృథా చేసుకోవద్దన్నారు. ప్రతీ నిమిషం కీలకమేనని, సోషల్ మీడియాకు దూరంగా ఉంటేనే విజయానికి దగ్గరవుతారని సూచించారు. అంకిత భావంతో చదివి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని అభ్యర్థులను ఉత్సాహపరిచారు. వ...
తెలివితేటలు ఏ ఒక్కరి సొంతం కాదు
Telangana, Today_banner, Top Stories

తెలివితేటలు ఏ ఒక్కరి సొంతం కాదు

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పార్థసారథిఎస్సెస్సీ టాపర్లకు అవార్డుల ప్రదానం వరంగల్ వాయిస్, నిజామాబాద్ : తెలివితేటలు ఏ ఒక్కరికే సొంతం కాదని, ప్రతిభావంతులుగా మారేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరికి అర్హత, అవకాశాలు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.పార్థసారథి పేర్కొన్నారు. తెలివితేటలకు కుల, మతం, పేద, ధనిక అనే తారతమ్యాలు ఉండవని స్పష్టం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో గురువారం చిట్ల ప్రమీల, జీవన్ రాజ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు వీలుగా ప్రతి యేటా నిర్వహిస్తున్న ఆనవాయితీని పాటిస్తూ ‘ విద్యా స్ఫూర్తి’ కార్యక్రమం నిర్వహించారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన ఆర్మూర్ పట్టణంలోకి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి,...
‘సంగ్రామ’ భేరి.. గెలుపుపై గురి
District News, Political, Telangana, Top Stories

‘సంగ్రామ’ భేరి.. గెలుపుపై గురి

ఓరుగల్లుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీపార్టీ బలోపేతమే లక్ష్యంఆగ‌స్టు 2నుంచి బండి సంజ‌య్ మూడో విడ‌త పాద‌యాత్ర‌యాదాద్రి లక్ష్మీన‌ర్సింహ‌స్వామి స‌న్నిధినుంచి ప్రారంభం26న వ‌రంగ‌ల్‌లో భారీ ముగింపు స‌భ‌హాజ‌రుకానున్న బీజేపీ చీఫ్ న‌డ్డా ఓరుగల్లుపై భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టింది. అధికార‌మే ల‌క్ష్యంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేప‌ట్ట‌నున్న‌ మూడో విడ‌త పాద‌యాత్ర‌ను మొద‌ట వ‌రంగ‌ల్ భ‌ద్ర‌కాళి అమ్మ‌వారి స‌న్నిధినుంచే ప్రారంభించి యాదాద్రి ల‌క్ష్మీన‌ర్సింహ‌స్వామి స‌న్నిధిలో ముగించాల‌ని భావించినా చివ‌రి నిమిషంతో షెడ్యూల్ మారింది. పాద‌యాత్ర‌ను యాదాద్రి ల‌క్ష్మీన‌ర్సింహ‌స్వామి స‌న్నిధిలో ఆగ‌స్టు 2వ‌ తేదీన ప్రారంభించి అదే నెల 26న వ‌రంగ‌ల్ భ‌ద్ర‌కాళి అమ్మ‌వారి స‌న్నిధిలో ముగించేలా ప్లాన్ చేశారు. ముగింపు సంద‌ర్భంగా క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో భ...
కాలంతో పోటీపడు.. కొలువుతో నిలబడు
Telangana, Today_banner

కాలంతో పోటీపడు.. కొలువుతో నిలబడు

కష్టంతో కాదు.. ఇష్టపడి చదవాలిసమయ పాలన, పక్కా ప్రణాళిక అవసరంఅలుపెరుగని శ్రమతో విజయం సాధ్యంగ్రూప్‌ -1 సాధిస్తే జీవితమే మారిపోతుందిరాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి. పార్థసారథిఖమ్మంలో ఉద్యోగార్థులకు ప్రేరణ తరగతులు ‘‘ప్రతీ ఒక్కరిలో తనకు తెలియని శక్తి సామర్థ్యాలు ఎన్నో ఉంటాయి.. వాటిని బయటకు తీసి సరైన సమయంలో వినియోగించుకున్నప్పుడే మనిషి జీవితానికి సార్థకత.. నిరాశ, నిస్పృహలు వద్దు.. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా చదివితే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కష్టం కాదు..’’ అని ఉద్యోగార్థులకు విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి. పార్థసారథి సూచించారు. మంగళవారం ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో గ్రూప్స్‌ పోటీపరీక్షలకు ప్రభుత్వ శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఆయన సూచనలు, సలహాలు అందించారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించేలా వారిలో ప్రేరణ కలిగించారు. కష్టపడి కాదు.. ఇష్టపడి చదవాలని.. కొలువు సాధించేదాక విశ్రమించొద్దని పిల...
రాగి దామోదర్ కు మిమిక్రీలో అవార్డు ప్రదానం
Cultural, Telangana

రాగి దామోదర్ కు మిమిక్రీలో అవార్డు ప్రదానం

వరంగల్ వాయిస్, హైదరాబాద్ : మయూరి ఆర్ట్స్ , తెలంగాణ అర్ట్స్ కల్చరల్ అకాడమీ, (భవిరి అర్ట్స్ )అధినేత మిమిక్రీ శివ ఆధ్వర్యంలో సోమవారము రాత్రి 8 గంటలకు హైదరాబాద్ చిక్కడపల్లి లో శ్రీ త్యాగరాయ గానసభ మెయిన్ హాలులో విశ్వ సంస్కృతి నంది పురస్కారాలు 2022 నిర్వహించారు. ప్రతిభ కల్గిన కొంతమంది మిమిక్రీ ఆర్టిస్టులకు ఈ నంది అవార్డులను అందజేశారు. ఇందులో భాగంగా మన వరంగల్ జిల్లాలోని 35 డివిజన్ శివనగర్ ప్రాంతానికి చెందిన మిమిక్రీ ఆర్టిస్ట్ రాగి దామోదర్ మిమిక్రీ ఆర్టిస్ట్ ప్రతిభకు గుర్తింపుగా ఈ నంది పురస్కారం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన సినీ నటులు కోటేశ్వరరావు, కిషోర్ దాస్, మిమిక్రీ ఆర్టిస్ట్ శివ, ఆర్గనైజేషన్ మునుకోటి డేవిడ్ రాజు, డాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ చేతుల మీదుగా ఈ నంది అవార్డ్స్ రాగి దామోదర్ అందుకున్నారు. మిమిక్రీలో ఎన్నో అద్భుతాలు సృష్టించాలని, ఎన్నో ఉన్నత శిఖరాలు చేరు...