- కేసీఆర్, కేటీఆర్, హిమాన్ష్ లకు రాఖీలు కట్టిన ఆడపడుచులు
వరంగల్ వాయిస్, ప్రగతిభవన్ : హైదరాబాద్ ప్రగతిభవన్ లో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, హిమాన్ష్ లకు వారి ఇంటి ఆడపడుచులు రాఖీలు కట్టారు. సీఎం కేసీఆర్ కు అతని సోదరిమణులు రాఖీ కట్టగా, కేటీఆర్ కు తన చెల్లి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాఖీ కట్టారు. హిమాన్ష్ కు అతని సోదరి రాఖీ కట్టి వేడుకలు జరుపుకున్నారు. ఇలా ముగ్గురికి మూడతరాల ఆడపడుచులు రాఖీ కట్టారు. ఆడపడుచులు అన్నల వద్ద ఆశీర్వచనాలు

తీసుకొనడంతో ప్రగతిభన్ సందడిగా మారింది.