
ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు
వరంగల్ వాయిస్, కరీమాబాద్ : అండర్ రైల్వే గేటు ప్రాంతంలోని ఉర్సు 40వ డివిజన్ లో శనివారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తమ ఇంటికోసం ముగ్గులు పోసుకున్నారు. కాంగ్రెస్ పాలనలోనే నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆ పార్టీ సీనియర్ నాయకుడు దాసి రాందేవ్ వెల్లడించారు. ఎంపికైన లబ్ధిదారులు వెంటనే ముగ్గు పోసి తమ నిర్మాణాలు ప్రారంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మరుపల్ల రవి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, స్థానికులు బి.అకిల్, జి.యుగంధర్,…