
District News

ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరం
మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ వరంగల్ వాయిస్, హనుమకొండ:జమ్మూ కశ్మీర్ పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో అమాయక పర్యాటకుల ప్రాణనష్టం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని భారతమాత బిడ్డలైన 28 మంది పర్యాటకులు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరమని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.ఈ దారుణ ఘటనపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, హనుమకొండ జిల్లా భారత రాష్ట్ర సమితి యువజన…

KGBV | ఇంగ్లీష్ టీచర్ వేధిస్తోంది.. మండుటెండలో కేజీబీవీ విద్యార్థినుల ధర్నా
వరంగల్ వాయిస్, నాగర్‌కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా నాగనూలులో పది రోజుల క్రితం ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి వేధింపులు భరించలేక 9వ తరగతి విద్యార్థిని తన చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. పది రోజులైనా టీచర్‌పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంగ్లీష్ టీచర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అధికారుల తీరును నిరసిస్తూ.. విద్యార్థినులు మరోసారి మండుటెండలో ధర్నా చేశారు. మేడమ్ మమ్మల్ని టార్చర్ చేస్తుంది, స్నానం చేస్తుంటే ఫోటోలు తీసి ఎవరెవరికో పెడుతుంది,…

MLC Kavitha | బెదిరింపులకు పాల్పడేవారిని వదిలిపెట్టేదే లేదు.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
వరంగల్ వాయిస్, కామారెడ్డి : ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ల పేర్లను బరాబర్ పింక్ బుక్కులో రాసుకుంటాం.. బెదిరింపులకు పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకులపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. బాన్సువాడలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో కవిత పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లవద్దని కొంత మంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిసింది. కేసులు పెట్టించే పోలీస్ స్టేషన్లకు…

Madhira : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి : పాగి బాలస్వామి
వరంగల్ వాయిస్, మధిర : అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ ప్రభుత్వం ఇల్లు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు ఇవ్వాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు పాగి బాలస్వామి, రామోజీ యోగేశ్ అన్నారు. మంగళవారం నియోజకవర్గ కేంద్రంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సభ్యత్వ నమోదు కార్యక్రమం స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల్లో, రాజీవ్ యువ వికాసంలో జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో జర్నలిస్టు…

Harish Rao | నమ్మినందుకు రైతుల గొంతు కోస్తారా..? రేవంత్‌ను సూటిగా ప్రశ్నించిన హరీశ్ రావు
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజర గ్రామానికి చెందిన రైతు దంపతులు బొల్లం రామయ్య, చంద్రకళ ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతున్నది అని మాజీ మంత్రి, సిద్దిపేట హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మి ఓటేసినందుకు.. రైతుల గొంతు కోస్తున్న.. కాంగ్రెస్ సర్కారు దుర్మార్గ వైఖరిని యావత్ తెలంగాణ గమనిస్తున్నది అని హరీశ్‌రావు పేర్కొన్నారు. మొద్దు నిద్రలో ఉన్న కాంగ్రెస్ పాలకులారా రైతన్న గోస ఇకనైనా పట్టించుకోండి. వారి కన్నీటి కష్టాలు…

Warangal | జాబ్ మేళాలో తొక్కిసలాట.. ముగ్గురు యువతులకు గాయాలు
వరంగల్ వాయిస్, వరంగల్ చౌరస్తా : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన జాబ్ మేళాలో తొక్కిసలాట జరిగింది. శనివారం వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గరలోని ఎం.కె.నాయుడు హోటల్‌లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు నిరుద్యోగ యువత భారీగా తరలిరావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. మంత్రి రాక కోసం కార్యక్రమాన్ని కొంత సమయం వేచి ఉంటారు. అలాగే ప్రారంభ కార్యక్రమం, మంత్రులు ప్రసంగించి వెళ్లే వరకు నిలిపివేయడంతో ఈ క్రమంలో భారీగా చేరుకున్న నిరుద్యోగ యువతముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు….

కోతి ఎల్లయ్య సేవలు విశిష్టమైనవి
అధ్యాపక వృత్తికి వన్నెతెచ్చిన వ్యక్తి ఆయన జీవన విధానం ఆదర్శప్రాయం వరంగల్ వాయిస్, హసన్ పర్తి : మూడు దశాబ్దాలు ఉత్తమ సేవలు అందించిన గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు కోతి ఎల్లయ అధ్యాపక వృత్తికి వన్నెతెచ్చాడని హసన్ పర్తి బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఇన్నంశెట్టి సుమాదేవి అన్నారు. ఆయన జీవన విధానం అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా వివిధ ప్రాంతాల్లో 30 ఏళ్లు పనిచేసి హసన్ పర్తి బాలికల హైస్కూల్లో ఉద్యోగ విరమణ…

Grain Purchasing Centers : కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలి : ఎమ్మెల్యే వేముల వీరేశం
వరంగల్ వాయిస్, కట్టంగూర్ : రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం కట్టంగూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అలాగే పలుచోట్ల సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు తన ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో…

MEO | ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య : ఎంఈఓ సత్యనారాయణ శెట్టి
వరంగల్ వాయిస్, తిమ్మాజిపేట : ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని ఎంఈఓ సత్యనారాయణ శెట్టి అన్నారు. సోమవారం మండల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో నాలుగు, ఐదు తరగతులు చదువుతున్న విద్యార్థులకు ట్వినింగ్ కార్యక్రమంలో ద్వారా ఉన్నత పాఠశాలలో అందిస్తున్న నాణ్యమైన విద్య ప్రమాణాలు, సౌకర్యాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వృత్తి నైపుణ్యం కల అత్యున్నతమైన ఉపాధ్యాయుల ద్వారా విద్యాబోధన ఉంటుందన్నారు. విద్యార్థుల్లో జీవన ప్రమాణాలు పెంపొందించుట, సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగపడే విధంగా విద్యార్థులను…

Kodad | మద్యం మత్తులో సిగరెట్ తాగుతూ నిద్రలోకి జారుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. నిప్పంటుకొని మృతి
వరంగల్ వాయిస్, కోదాడ : మద్యం మత్తులో సిగరెట్ వెలిగించుకుని.. దానిని ఆర్పివేయకుండా నిద్రలోకి జారుకున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మంటలు చెలరేగడంతో మరణించిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ (Kodad) మండలంలో చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మంగలి తండాకు చెందిన ధరావత్ బాలాజీ (52) నడిగూడెం మండలం చెన్నకేశవాపురం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు.