Jogulamba Temple | మసకబారుతున్న జోగులాంబ ఆలయ ప్రతిష్ఠ.. ఇంతకీ ఏమైందంటే..?
Jogulamba Temple | దేశంలో ప్రసిద్ధిగాంచిన శక్తి పీఠాలలో ఒకటైన అలంపూర్ జోగులాంబ మాత ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారంటూ ఆలయ ఈవో, ప్రధాన అర్చకునిపై పలువురు ఫిర్యాదులు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
వరంగల్ వాయిస్, జోగులాంబ గద్వాల : దేశంలో ప్రసిద్ధిగాంచిన శక్తి పీఠాలలో ఒకటైన అలంపూర్ జోగులాంబ మాత ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారంటూ ఆలయ ఈవో, ప్రధాన అర్చకునిపై పలువురు ఫిర్యాదులు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆలయ భూముల అన్యాక్రాంతం, భక్తుల నుంచి వచ్చే కానుకలు, నగదును మాయం చేస్తున్నారని గత కొన్ని నెలలుగా జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదులు అందాయి.
ఆలయ ఈవో బాగోతం ఇదీ..
ఆలయ ఈవో పురేందర్ అలంపూర్ జోగులాంబ ఆలయంతో పాటు, గద్వాల జమ్ములమ్మ ఆలయ ఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈయన గత కొన్ని సంవత్సరాలుగా ఆలయ ఆదాయానికి సంబంధించి ఆడి...








