నేడు ఖమ్మం వేదికగా బిఆర్‌ఎస్ యుద్దభేరీ
బిజెపి లక్ష్యంగా సమరశంఖం పూరించనున్న కెసిఆర్
బిజెపికి ప్రత్యామ్నాయం చూపే దిశగా బిఆర్‌ఎస్ అడుగు
వరంగల్ వాయిస్,హైదరాబాద్: ఖమ్మం వేదికగా బిఆర్‌ఎస్ తొలి బహిరంగసభకు రంగం సిద్దం అయ్యింది. ఈనెల 18న బుధవారం సాయంత్రం జరిగే సభతో బిజెపికి సవాల్ విసిరేందుకు తెలంగాణ సిఎం కెసిఆర్ రంగం సిద్దం చేసుకున్నారు. 9 రాష్టాల్ల్రో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న బిజెపి తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. కెసిఆర్ అవినీతి పాలన అంటూ విమర్శలు చేస్తోంది. తెలంగాణలో అధికారం తమదే అని ప్రకటించుకుంది. ఈ క్రమంలో కేంద్రంలోని బిజెపిని చెండాడడమే లక్ష్యంగా బిఆర్‌ఎస్ తొలి అడుగు ఖమ్మం నుంచి వేయబోతోంది. బిజెపికి కెసిఆర్ సవాల్ విసరబోతున్నారు. అలాగే దేశంలో బిజెపిని ఎదుర్కొనేందుకు వివిధ ప్రాంతీయపార్టీలతో కలసి కెసిఆర్ బిఆర్‌ఎస్‌ను ముందుకు తీసుకుని వెల్లేందుకు పక్కా వ్యూహం సిద్దం చేసుకున్నారు. తెలంగాణలో బిజెపిని చా...









