ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి
మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక
అయిదు దశల్లో 99 రోజుల యాక్షన్ ప్లాన్
ఏప్రిల్ 2న గ్రామ స్థాయిలో గ్రామ సభల నిర్వహణ
ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమం
మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమం
మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమం
జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
వరంగల్ వాయిస్, ములుగు: మార్చి 6వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు. బుధవారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాపాలన... ప్రగతి ప్రణాళికలు కార్యాచరణ అమలుపై రెవెన్యూ, పంచాయతీరాజ్, ప్రణాళిక, ఇరిగేషన్, హోం, రవాణా, వ్యవసాయం, ఉద్యానవన, విద్య, వైద్య, మహిళా శిశు సంక్షేమ, హౌసింగ్, తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అయిద...









