వరంగల్ వాయిస్, ములుగు: న్యాయవాది మల్లారెడ్డి హత్య కేసులో నిందితులకు ఈనెల 18 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. మల్లారెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితులను ములుగు పోలీసులు శనివారం ఇన్ చార్జి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, మరో 11 మంది నిందితులు పరారీలో ఉన్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కోర్టు ముందు ఏ1 గోనెల రవీందర్, ఏ2 పిండి రవి యాదవ్, ఏ3 వంచ రామ్మోహన్ రెడ్డి, ఏ4 తడక రమేష్ లను ప్రవేశపెట్టారు. హత్య నేరం అభియోగంపై రిమాండ్ రిపోర్టును పరిశీలించిన న్యాయమూర్తి, నిందితులకు ఈనెల 18 వరకు రిమాండ్ విధించి ఖమ్మం జైలుకు తరలించారు.
