Warangalvoice

Author: Sahith Gaddam

HARISH RAO: మా పోరాటం ఆగదు.. రేవంత్ ప్రభుత్వానికి హరీష్‌రావు మాస్ వార్నింగ్
Political

HARISH RAO: మా పోరాటం ఆగదు.. రేవంత్ ప్రభుత్వానికి హరీష్‌రావు మాస్ వార్నింగ్

HARISH RAO: కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించడం వల్లే ఇప్పుడు పంట పొలాలకు గోదావరి జలాలు అందుతున్నాయని మాజీ మంత్రి హరీష్‌రావు చెప్పారు. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతులకు గిట్టుబాటు ధర అందించాలని అన్నారు. వరంగల్ వాయిస్, సిద్దిపేట: రైతుల సమస్యలు పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. రైతుల కోసం తాము నిరంతర పోరాటం కొనసాగిస్తామని, రైతుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. ఇవాళ(మంగళవారం) సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం సలేంద్రి గ్రామంలో రంగనాయక సాగర్ కాలువను పరిశీలించారు. కాలువలో ప్రవహిస్తున్న గోదావరి జలాలను చూసి సంతోషించారు. రైతులకు సాగునీరు అందడంపై హర్షం వ్యక్తం చేస్తూ, కాలువ పక్కన ఆగ...
Election Commission: స్థానిక ఎన్నికల నగరా.. స్వీడ్ పెంచిన ఎన్నికల సంఘం
Political

Election Commission: స్థానిక ఎన్నికల నగరా.. స్వీడ్ పెంచిన ఎన్నికల సంఘం

Telangana State Election Commission: స్థానిక ఎన్నికలపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర స్టేట్ ఎలక్షన్ కమిషన్, కీలక ఆదేశాలు జారీ చేసింది. వరంగల్ వాయిస్ హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాకు పది మంది చొప్పున మాస్టర్ ఆఫ్ ట్రైనర్స్ , స్టేట్ రిసోర్స్ పర్సన్‌లను ఎంపిక చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనే అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం శిక్షణ ఇవ్వనుంది. ఇప్పటికే మాస్టర్ ఆఫ్ ట్రైనర్స్, స్టేట్ రిసోర్స్ పర్సన్‌లకు ఎంసీహెచ్ఆర్డీలో ఎన్నికల సంఘం ట్రైనింగ్ ఇచ్చింది. జిల్లా కలెక్టర్లకు తెలంగాణ ఎలక్షన్ కమిషన్, కీలక ఆదేశాలు జారీ చేసింది. మండల, జిల్లా పరిషత్, పంచాయతీ రిటర్నింగ్ అధికారులను ఫిబ్రవరి 10వ తేదీ లోపు ఎంపిక పూర్తి చేయాలని ఆదేశించింది. పంచాయితీలు, మండల పరి...
HarishRao: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఇలాంటి ఘటనలు.. సీఎం రేవంత్‌పై హరీష్‌రావు ధ్వజం
Political

HarishRao: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఇలాంటి ఘటనలు.. సీఎం రేవంత్‌పై హరీష్‌రావు ధ్వజం

HarishRao:రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి పాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, ఫుడ్ పాయిజన్ కేసులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హరీష్‌రావు డిమాండ్ చేశారు. వరంగల్ వాయిస్ హైదరాబాద్: గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు బాధాకరమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా దామరవంచ గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగి, విద్యార్థులు ఆస్పత్రి పాలు కావడం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని చెప్పారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో రేవంత్ ప్రభుత్వంపై హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో ఒకటి కాదు రెండు కాదు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు వందల్లో నమోదయ్యాయని అన్నారు. వందల మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు కాగా, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశార...
తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ
Political

తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ

తీన్మార్ మల్లన్నకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నోటీసులు జారీ చేసింది. ఆయన ఇటీవల పార్టీ వ్యతిరేక విధానాలు, నాయకత్వంపై చేసిన వ్యాఖ్యల కారణంగా జారీ అయ్యాయి. తీన్మార్ మల్లన్న (Teenmaar Mallanna) ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తన అభిప్రాయాలను పలు సందర్భాల్లో వెల్లడించారు. ప్రభుత్వ కులగణన సర్వేపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. దీంతో పాటు కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలపై కూడా పలు రకాల వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తాజాగా ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అలాంటి వ్యాఖ్యలు పార్టీలో విభేదాలు తేవడంతోపాటు ఆందోళనలు కలిగిస్తాయని భావించి నిర్ణయం తీసుకుంది.అంతేకాదు మల్లన్నకు అధికారికంగా నోటీసులు జారీ చేయకముందే కాంగ్రెస్ పార్టీ నోటీసుల గురించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఏమైనా మీ సొంతమా, కాంగ్రెస్ పార్టీ బీసీలదంటూ వ్యాఖ్యానించారు. పార్టీ పేరుతో తనను బెదిరించాలని చూస్తే కుదరదని హె...
Minister Konda Surekha: ఏఐసీసీ అగ్రనేతలకు మంత్రి కొండా సురేఖ లేఖ .. ఎందుకంటే..
Political

Minister Konda Surekha: ఏఐసీసీ అగ్రనేతలకు మంత్రి కొండా సురేఖ లేఖ .. ఎందుకంటే..

Minister Konda Surekha: ఏఐసీసీ అగ్రనేతలకు మంత్రి కొండా సేరేఖ ఇవాళ ఓ లేఖ రాశారు. ఈ లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు. వరంగల్ వాయిస్ హైదరాబాద్: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలకు సోనియా, రాహుల్ గాంధీలకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ మంత్రి కొండా సురేఖ గురువారం లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో బీసీ కులగణనను కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిందని స్పష్టం చేశారు. ఇందుకోసం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా శ్రమించారని వెల్లడించారు. ఈ సర్వే ద్వారా రాష్ట్రంలోని బీసీలకు మరింత న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేష‌న్‌లో పేర్కొన్న...
సెన్సార్ ముగించుకున్న ‘తండేల్’
Top Stories

సెన్సార్ ముగించుకున్న ‘తండేల్’

అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’ వచ్చే వారం రిలీజ్‌కు రానుంది. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి పీరియాడిక్ నేపథ్యంలో ఓ చక్కటి లవ్ స్టోరీ మూవీగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ కావడంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా కథ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. కాగా ఈ చిత్రానికి టైటిల్ కార్డ్స్, యాడ్స్ కలుపుకుని 2 గంటల 32 నిమిషాల నిడివి ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చ...
రాజ్యాధికారం లేకనే బీసీ డాక్టర్లకు అన్యాయం
District News

రాజ్యాధికారం లేకనే బీసీ డాక్టర్లకు అన్యాయం

కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ వరంగల్ వాయిస్, హనుమకొండ : తెలంగాణ రాష్ట్రంలో బీసీల డాక్టర్లకు అనేక అన్యాయాలు జరుగుతున్నాయని, ఒక్క మంచి పోస్టులో కూడా డాక్టర్లు లేని పరిస్థితి ఉందని, దీనికంతటికి కారణం బీసీ రాజ్యాధికారం లేకపోవడమే అని, బీసీ నేత, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి, కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. గురువారం హనుమకొండలోని ఆఫీసర్స్ క్లబ్ లో జరిగిన సమావేశం ఉమ్మడి వరంగల్ జిల్లా డాక్టర్స్ అసోసియేషన్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజు యాదవ్ హాజరై మాట్లాడారు. 76 సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఇప్పటికి బీసీలకు అధికారం రావడం లేదంటే విభజించి పాలించిన రాజకీయ నాయకులేనన్నారు. ఇప్పటికీ బీసీలందరూ ఒకటయ్యాం. ప్రతి గల్లీ గల్లీలో వాడవాడలో మండల మండలంలో గ్రామ గ్రామాన బీసీలకు జరుగుతున్న అన్యాయం, ప్రత్యేకంగా ఈడబ్ల్యూఎస్ పైన జరుగుతున్...
Political
ఈ క్రమంలో వీలైనంత వరకు అందరికీ పబ్లిక్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. దీని ద్వారా ట్రాఫిక్‌ జామ్‌, రద్దీని తగ్గించేందుకు అవకాశం ఉంటుంది.ఈసారి మహా కుంభమేళాలో ఇతర రాష్టాల్ర నుంచి వచ్చే వాహనాలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారు. ప్రత్యేకంగా ఇతర రాష్టాల్ర నుంచి వచ్చే వాహనాలు ఆ ప్రాంతంలో ప్రవేశించకుండా ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో భక్తులు ఆన్‌లైన్‌లో ముందుగా తమ వాహనాన్ని నమోదు చేసుకుని మాత్రమే పర్యటనకు రావాల్సి ఉంటుంది. ఈ చర్యకు అనుగుణంగా, వాహనాల సంఖ్యను కూడా నియంత్రించేందుకు ఇది సహాయపడుతుంది. భక్తుల రవాణా సరళతను పెంచేందుకు, ప్రయాగ్‌ రాజ్‌ నగరంలో వన్‌ వే రూట్‌ వ్యవస్థ అమలు చేయాలని నిర్ణయించారు. ముఖ్యమైన ప్రాంతాలకు, ఘాట్ల దగ్గరకు వెళ్లే దారులను ఒకవైపుగా మార్చి, మరో వైపు నుంచి రాకపోకలను పూర్తిగా వేరే రూట్లతో నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ...
తొక్కిసలాట ఘటనతో ప్రభుత్వం అప్రమత్తం
Top Stories

తొక్కిసలాట ఘటనతో ప్రభుత్వం అప్రమత్తం

కుంభమేళాలలో పలు మార్పులకు శ్రీకారం మరింత పకడ్బందీగా భద్రతా చర్యలు వరంగల్ వాయిస్, ప్రయాగరాజ్‌ : ప్రపంచంలో అతిపెద్ద మత సంస్కృతి పండుగ అయిన మహా కుంభమేళా 2025 ఉత్సవం ఈసారి కీలక మార్పులతో జరుగుతోంది. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌ రాజ్‌లో జరుగుతున్న ఈ మహా కుంభమేళాలో భక్తుల రద్దీ, రవాణా వ్యవస్థ పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో యూపి ప్రభుత్వం మరింత పక్కాగా ఏర్పాట్లు చేసింది. అందుకు అనుగుణంగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇవి ఉత్సవం సక్రమంగా నిర్వహించేందుకు తోడ్పడనున్నాయి. ఈ మార్పులు భక్తులు సురక్షితంగా ఆయా ప్రాంతాలను చేరుకోవడానికి సహాయపడతాయి....
Trump’s focus on student visas
Top Stories

Trump’s focus on student visas

గడువు ముగిసిన వారి జాబితా సిద్దం 7వేలమంది భారతీయ విద్యార్థులు ఉన్నట్లు గుర్తింపు వాషింగ్టన్‌,జనవరి30(వరంగల్ వాయిస్): అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఏ రోజు ఎవరిని టార్గెట్‌ చేస్తాడో తెలియడం లేదు. ఒక్కో నిర్ణయంతో బాధితులు వణుకుతున్నారు. తాజాగా విద్యార్థి వీసాల గడువు ముగిసినా అమెరికాలోనే అక్రమంగా ఉంటున్నవారిపై ఇప్పుడా దేశం దృష్టి పెట్టింది. తాజాగా అమెరికాలో వలస చట్టాల అమలును పునరుద్ధరించడంపై హౌస్‌ కమిటీ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా చట్టసభ సభ్యులు పలు సూచనలు చేశారు. 2023లో వీసా గడువు ముగిసినా.. 7,000 మంది భారతీయ విద్యార్థులు, ఎక్స్‌ఛేంజ్‌ విజిటర్లు చాలాకాలం అమెరికాలోనే ఉండిపోయారని సెంటర్‌ ఫర్‌ ఇమిగ్రేషన్‌ స్టడీస్‌కు చెందిన జెస్సీకా ఎం.వాఘన్‌ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. కనీసం 32 దేశాలకు చెందిన విద్యార్థులు, స్టూడెంట్‌ ఎక్స్‌ఛేంజి విజిటర్లలో 20శాతానికి పైగా వీసా గడువు దాటినా అమెరికాలోనే ఉంటున...