Warangalvoice

Tag: The founder of the beginning of the progressive era

అభ్యుదయ యుగానికి నాంది ప్రస్థాపకుడు
Cultural, Telangana

అభ్యుదయ యుగానికి నాంది ప్రస్థాపకుడు

శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ జయంతి ఏప్రిల్ 30న వరంగల్ వాయిస్, ప్రత్యేకం: జీవితాన్ని కవిత్వంలోనూ వడబోస్తూ, తెగిన గాలి పటంలా గడిపానని శ్రీ శ్రీ అనేవారు. 1936లో ‘వీణ’ పత్రిక సంపాదక వర్గంలో కొంత కాలం పనిచేశారు. 1938లో ఆంధ్రప్రభలో సహాయ సంపాదకునిగా పనిచేశారు. శ్రీ శ్రీ తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా, కవితా వ్యాసంగం మాత్రం వదలలేదు. ఆనాటి రోజుల్లో అధికంగా వాడుకలో ఉన్న సంప్రదాయ, భావ కవిత ధోరణులు ఆకర్షించిన వాడైనా, కొన్ని కొత్త ధోరణులు తన కవితలో శ్రీ శ్రీ ప్రదర్శించే వారని, ప్రముఖ కవులు మల్లంపల్లి సోమశేఖర శర్మ తదితరులు పేర్కొన్నారు. శ్రీ శ్రీ రాసిన ‘మహాప్రస్థానం’ అఖిలాంధ్ర కీర్తి తెచ్చి పెట్టింది. ఆంధ్ర సాహిత్య చరిత్రలో ఒక కొత్త మలుపును సృష్టించిన నవ్య సాహిత్య పరిషత్తును 1936లో ప్రారంభించడంలో శ్రీ శ్రీ కూడా ప్రముఖ పాత్ర వహించాడు. అయితే 1937లో తన ఆప్తమిత్రుడు కొంపెల్లి జనార్ధనరావు మరణించ...