టెండర్ విధానంతో చేనేత కార్మికుల పొట్ట కొట్టొద్దు
బచ్చు ఆనందం ఆగ్రహంప్రభుత్వ నిర్ణయంతో రోడ్డున పడనున్న వేలాది కుటుంబాలు టెండర్లు రద్దు చేయకుంటే భారీ ఎత్తున ఉద్యమిస్తాంహనుమకొండ జిల్లా పద్మశాలి సంఘం
వరంగల్ వాయిస్, హనుమకొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త టెండర్ విధానం చేనేత కార్మికుల పాలిట శాపంగా మారబోతోందని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం మండిపడ్డారు. మంగళవారం హనుమకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వాల హయాంలో చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను టెస్కో ద్వారా నేరుగా కొనుగోలు చేసి ఉపాధి కల్పించేవారని ఆనందం గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం టెండర్ల పేరుతో ఈ రంగాన్ని ప్రైవేటు పరం చేయాలని చూడటం సిగ్గుచేటన్నారు. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే ప్రమాదం ఉందని ...
