Warangalvoice

Tag: Re-survey to Resolve Land Issues in Ramachandrapuram

రామచంద్రపురం భూ సమస్యల పరిష్కారానికి రీ-సర్వే
Mulugu

రామచంద్రపురం భూ సమస్యల పరిష్కారానికి రీ-సర్వే

జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ 10,500 ఎకరాల సర్వేకు 9 బృందాల ఏర్పాటు.. రైతులు సహకరించాలని వినతి వరంగల్ వాయిస్, మల్లంపల్లి (ములుగు జిల్లా) : మల్లంపల్లి మండల పరిధిలోని రామచంద్రపురం గ్రామంలో దశాబ్దాలుగా నెలకొన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ప్రకటించారు. బుధవారం రామచంద్రపురం గ్రామ రైతు వేదికలో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొని, 10,500 ఎకరాల వ్యవసాయ భూమి రీ-సర్వే, హద్దుల గుర్తింపుపై రైతులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గతంలో సాంకేతిక, ఇతర కారణాల వల్ల చాలా మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. ఈ సమస్యలను అధిగమించేందుకు భూములను రీ-సర్వే చేసి, పక్కాగా హద్దులు నిర్ణయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. మొత్తం 10,500 ఎకరాల భూమిని 9 బ్లాకులుగా విభజించారు. సర్వే ప్...