Warangalvoice

Tag: Jobs at the Coach Factory must be given exclusively to locals.

కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలివ్వాలి
Telangana, Warangal, Warangal_TriCites

కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలివ్వాలి

భూములు కోల్పోయిన రైతులకు ఉపాధి కల్పించాలి కేయూ లైబ్రరీ వద్ద నిరుద్యోగ జేఏసీ నాయకుల ధర్నా వరంగల్ వాయిస్, హనుమకొండ/ కేయూ క్యాంపస్ : కాజీపేట (అయోధ్యపురం)లో నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువతకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కేయూ జేఏసీ అధ్యక్షులు డి. తిరుపతి డిమాండ్ చేశారు. మంగళవారం కాకతీయ యూనివర్సిటీ లైబ్రరీ వద్ద జేఏసీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై వారు నిప్పులు చెరిగారు. కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం అయోధ్యపురం గ్రామ రైతులు తమ జీవనోపాధి అయిన భూములను త్యాగం చేశారని తిరుపతి గుర్తు చేశారు. భూసేకరణ సమయంలో ప్రతి రైతు కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కలెక్టర్ ద్వారా 114 మంది రైతుల పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు. రెండుసార్లు కేంద్ర మంత్రులు పర్యటించినా, ఉ...