KTR | అమ్మ పెట్టదు.. అడుక్క తిననివ్వదు.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ధ్వజం
KTR | కాంగ్రెస్ పాలనలో పల్లెలన్నీ ధ్వంసమవుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పారిశుధ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ధ్వజమెత్తారు. పల్లెలను పట్టించుకునే నాథుడు లేడు అని విమర్శించారు కేటీఆర్
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో పల్లెలన్నీ ధ్వంసమవుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పారిశుధ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ధ్వజమెత్తారు. పల్లెలను పట్టించుకునే నాథుడు లేడు అని విమర్శించారు కేటీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో నెలకొన్న సమస్యలపై కేటీఆర్ స్పందించారు.
అమ్మ పెట్టదు.. అడుక్క తిననివ్వదు.. అన్న చందంగా కాంగ్రెస్ పాలన ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. పల్లెలు నాడు కేసీఆర్ పాలనలో ప్రగతి బాట పడితే.. నేడు 15 నెలల కాంగ్రెస్ పాలనలో అధోగతి బాట పట్టాయన్నారు. 14 నెలలుగా సర్పం...
