డాక్టర్స్ కాపురంలో రీల్స్ చిచ్చు
‘బుట్ట బొమ్మ’పరిచయంతో కుటుంబంలో కలహాలు
మనస్థాపంతో భార్య ప్రత్యూష ఆత్మహత్య
నలుగురిపై కేసు నమోదు
వరంగల్ వాయిస్, హసన్ పర్తి : ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న డాక్టర్స్ కాపురంలోకి బుట్ట బొమ్మ పేరుతో మరో వ్యక్తి ఎంట్రీ ఇవ్వడంతో.. పచ్చని కాపురంలో కలహాలు రేగాయి. భర్త ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేసే అమ్మాయితో ప్రేమలో పడ్డాడని అనుమానించి భార్య.. అతనితో వాదనలకు దిగింది. అయిన ఆయనలో మార్పు కనిపించకపోవడంతో ఆత్మహత్యతో తనువు చాలించింది. ఈ దారుణం ఘటన హనుమకొండ జిల్లా హసన్ పర్తిలో చోటుచేసుకుంది. డాక్టర్ ప్రత్యూష బందువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు డెంటిస్ట్ డాక్టర్ ప్రత్యూషకు కార్డియాలజిస్ట్ డాక్టర్ అల్లాడి సుజన్ తో 2017లో వివాహమైంది. వీరికి ఏడు సంవత్సరాల జానుషా సృజన్, ఏడు నెలల జెస్వికాస్ సృజన్ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. డాక్టర్ ప్రత్యూష ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ లో డెంటింస్ట్ గా పనిచేస్తున్నారు. డాక్టర్ సృజన్ ...


