Warangalvoice

Warangal_TriCites

Tech, Warangal_TriCites

నింగిలోకి దూసుకెళ్లిన ‘రుద్రమ’

ఓరుగల్లు గడ్డపై మోడల్ రాకెట్ ప్రయోగం సక్సెస్ వరంగల్ వాయిస్, హనుమకొండ : చారిత్రక వరంగల్ నగరం మరో అద్భుత ఘట్టానికి వేదికైంది. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం భద్రకాళి బండ్ వద్ద నిర్వహించిన 'రుద్రమ' మోడల్ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఏటీడీఆర్ఎల్, కుడా, వరంగల్ ఎన్ఐటీ సంయుక్త సమన్వయంతో చేపట్టిన ఈ ప్రయోగం విద్యార్థులలో, నగరవాసులలో నూతనోత్సాహాన్ని నింపింది. శనివారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో శశాంక్ భూపతి నాయకత్వంలోని ఏటీడీఆర్ఎల్ బృందం రాకెట్ ప్రయోగాన్ని చేపట్టింది. కౌంట్‌డౌన్ ముగియగానే 'రుద్రమ' రాకెట్ నిప్పులు చిమ్ముతూ ఆకాశం వైపు దూసుకెళ్లింది. ఒకటి, రెండు దశల్లో అద్భుతంగా సాగిన ఈ ప్రయోగం, మూడో దశలో గాలి దుమారం కారణంగా చిన్నపాటి సాంకేతిక ఇబ్బంది తలెత్తినప్పటికీ, ఓవరాల్‌గా నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుని విజయవంతమైంది. ఈ చారిత్రక ఘట్టాన్ని గ్యాలరీ నుంచి వరంగల్ ఎంపీ డాక్టర్ కడ...
చరిత్ర, సంస్కృతిపై అవగాహన పెంచుకోవాలి
Hanamkonda, Warangal_TriCites

చరిత్ర, సంస్కృతిపై అవగాహన పెంచుకోవాలి

రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు వికాస్ హైస్కూల్‌లో ‘ఇంటాక్’ డ్రాయింగ్ పోటీలు ‘లైఫ్ ఆఫ్ ట్రీ’ అంశంపై విద్యార్థుల ప్రతిభ విజేతలకు బహుమతుల ప్రదానం వరంగల్ వాయిస్, హనుమకొండ : హనుమకొండ రెడ్డి కాలనీలోని వికాస్ హైస్కూల్‌లో గురువారం ఇంటాక్ (INTACH) హనుమకొండ చాప్టర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు ఘనంగా నిర్వహించారు. “లైఫ్ ఆఫ్ ట్రీ” అనే అంశంపై నిర్వహించిన ఈ పోటీల్లో నగరంలోని వివిధ పాఠశాలల నుంచి సుమారు 57 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ కుంచెతో అద్భుతమైన చిత్రాలను గీశారు. పోటీలలో ప్రతిభ కనబరిచిన కింది విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతి ఆర్. సుస్మిత (9వ తరగతి, సెయింట్ జోసెఫ్ హైస్కూల్), ద్వితీయ బహుమతి ఈ.శ్రీ వైష్ణవి (7వ తరగతి, వికాస్ హైస్కూల్), తృతీయ బహుమతి జి.ధన్యశ్రీ (8వ తరగతి, మాస్టర్జీ హైస్కూల్, కిషన్ పుర),కన్సోలేషన్ బహుమతి జె.వరుణ్ (8వ తరగతి, సెయింట్ జోసె...
మహిళా భవన మంజూరుకు కృషి చేస్తా
Warangal_TriCites

మహిళా భవన మంజూరుకు కృషి చేస్తా

వరంగల్ వాయిస్, దామెర : మండలంలోని తక్కళ్లపాడు గ్రామంలో మహిళా భవన నిర్మాణ మంజూరు కోసం తన వంతు కృషి చేస్తానని ఎంపీడీవో గుమ్మడి కల్పన హామీ ఇచ్చారు. బుధవారం తక్కళ్లపాడు గ్రామస్తులు ఎంపీడీవోను కలిసి, గ్రామంలో మహిళా భవనం లేకపోవడం వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ఈ మేరకు ఆమెకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. మహిళా భవన నిర్మాణానికి సంబంధించి గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లారు. భవనం లేక మహిళలు వివిధ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వినతిపత్రం స్వీకరించిన అనంతరం ఎంపీడీవో స్పందిస్తూ.. ఐకేపీ ఏపీఎం, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌లతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుంటానని చెప్పారు. వెంటనే పంచాయతీ తీర్మానం ఇచ్చేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆమె గ్రామస్తులకు హామ...
ఫర్టిలైజర్స్ రాష్ట్ర అధ్యక్షుడు నాగూర్లకు ఘన సన్మానం
Agriculture, Warangal_TriCites

ఫర్టిలైజర్స్ రాష్ట్ర అధ్యక్షుడు నాగూర్లకు ఘన సన్మానం

గజమాలతో సత్కారం వరంగల్ వాయిస్, పరకాల : తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్ డీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన నాగూర్ల వెంకటేశ్వర్లకు పరకాల ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. నాగూర్ల వెంకటేశ్వర్లను గజమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పరకాల ఫర్టిలైజర్స్ ఫెస్టిసైడ్స్ సీడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించడంలో ఫర్టిలైజర్ షాపు వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. అలాంటి బాధ్యతాయుతమైన పదవికి నాగూర్ల వెంకటేశ్వర్లు ఎన్నిక కావడం రైతు సమాజానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలను గుర్తించి పరిష్కార దిశగా ఆయన సమర్థవంతంగా పనిచేస్తారని, ఫర్టిలైజర్ రంగంలో ఉన్న అనుభవం సేవాభావం నాయకత్వ లక్షణాలతో నాగూర్ల వ...
మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలి
Political, Telangana, Warangal_TriCites

మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలి

🔴 కేంద్ర మంత్రికి సీఎం రేవంత్, ఎంపీ కావ్య విజ్ఞప్తివరంగల్ వాయిస్, ఢిల్లీ: తెలంగాణలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ అభివృద్ధిలో కీలకం కానున్న మామునూరు విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో కలిసి ఆమె కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడును పార్లమెంట్‌లోని ఆయన ఛాంబర్‌లో కలిశారు. మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని, కాబట్టి వెంటనే పనులు ప్రారంభించాలని ఎంపీ కడియం కావ్య కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు పలు కీలక అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మామునూరు ఎయిర్‌పోర్ట్‌లో విమాన ప్రయాణాలతో పాటు కార్గో (సరుకు రవాణా) సేవలు, మెయింటెనెన్స్, ఓవర్ హాల్ రిపేర్ సదుపాయాలు ఉండేలా చూడాలని కోరారు. వరంగల్ నగర...
వెలుగుల మేడారంగా తీర్చిదిద్దాం
District News, Hanamkonda, Warangal_TriCites

వెలుగుల మేడారంగా తీర్చిదిద్దాం

🎯 విద్యుత్ శాఖ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి🎯 జాతరలో అత్యుత్తమ పనితీరు..🎯 సిబ్బందికి ప్రశంసా పత్రాల అందజేత🎯 గోదావరి పుష్కరాలకు కూడా సిద్ధం 🎯 హనుమకొండలో 'విద్యుత్ విజయోత్సవం'వరంగల్ వాయిస్, హనుమకొండ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో అన్ని శాఖల కంటే విద్యుత్ శాఖ అత్యుత్తమ పనితీరు కనబరిచిందని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి సగర్వంగా ప్రకటించారు. శనివారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన 'మేడారం జాతర విద్యుత్ విజయోత్సవ' కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కోట్లాది మంది భక్తులకు కన్నుల విందుగా, ఎక్కడా అంతరాయం లేకుండా వెలుగుల మేడారాన్ని అందించామని సీఎండీ కొనియాడారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలగకుండా తొలిసారిగా 33 కేవీ లైన్లలో కవర్ కండక్టర్లను వాడామని, భవిష్యత్తులో అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థను మరింత విస్తరి...
జ్వాలా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు బహుమతులు అందజేత
Sports, Warangal_TriCites

జ్వాలా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు బహుమతులు అందజేత

వరంగల్ వాయిస్, ఆరేపల్లి : ఆరేపల్లి గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు వివిధ ఆటల పోటీలను నిర్వహించి, మొత్తం 140 బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, లోక్సత్తా ఉద్యమ సంస్థ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సుంకరి ప్రశాంత్  హాజరై విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా సుంకరి ప్రశాంత్ మాట్లాడుతూ,“ఈనాటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు. గణతంత్ర దినోత్సవం అనేది మన దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన పవిత్ర దినం. రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించింది. ప్రతి విద్యార్థి మంచిగా చదివి దేశానికి, రాష్ట్రానికి, తన గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి” ప్రభ...
కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలివ్వాలి
Warangal_TriCites

కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలివ్వాలి

రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ వరంగల్ వాయిస్, కాజీపేట : కాజీపేటలో నిర్మిస్తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక నిరుద్యోగ యువతీ యువకులతోపాటు భూములిచ్చిన అయోధ్యపురం గ్రామస్థులకు 65 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ రైల్వే డిమాండ్ చేసింది. బుధవారం అసోసియేషన్ ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఈ డిమాండ్‌పై తెలంగాణ రైల్వే జేఏసీ, రాజకీయ జేఏసీ సాగిస్తున్న పోరాటానికి తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. నియామకాల్లో ప్రత్యేక విధానం ఉండాలి.. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడిన తెలంగాణలో విభజన చట్టం ప్రకారం దక్కిన కోచ్ ఫ్యాక్టరీని కాజీపేటలో నిర్మించడం హర్షణీయమని అసోసియేషన్ పేర్కొంది. అయితే, ఇందులో నియామకాలను సాధారణ ఆర్ఆర్ బీ, ఆర్ఆర్ సీ పద్ధతిలో కాకుండా, ఈ ప్రాంత నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక జీవో ద్వారా చేపట్టాలని ...
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు
Warangal_TriCites

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు

దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రూ.4.10 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. వరంగల్ వాయిస్, వరంగల్ : అర్హులైన ప్రతి ఒక్కరికీ త్వరలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. మంగళవారం వరంగల్ (తూర్పు) నియోజక వర్గ పరిధిలోని 32,41 డివిజన్ లలో రూ.4.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైన్ లు, సైడ్ వాల్ లు, బాక్స్ డ్రైన్ ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజక అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని గతంలో తాను శాసన సభ్యురాలుగా ఉన్నపుడు వేసిన రోడ్లు అని ప్రస్తుతం దెబ్బతిని పనికి రాకుండా పోయిన నేపథ్యంలో మేయర్, కమిషనర్ స్థానిక కార్పొరేటర్లు స్థానిక నాయకుల సహకారంతో ఏక్కడ ఏ అవసరాలు ఉన్నాయో గుర్తించి వారి అవసరం మేరకు అంచనాలు తయారు చేసి వరంగల్ తూర్పు నియోజక వర్గం లో ప్రతి డివిజన్ లలో నెలకొ...
స్థానిక ఎన్నికలకు బ్రేక్ | Local Elections Stay
Political, Warangal_TriCites

స్థానిక ఎన్నికలకు బ్రేక్ | Local Elections Stay

ఉదయం నోటిఫికేషన్.. మధ్యాహ్నం స్టే బీసీ రిజర్వేషన్ల జీవో 9పై వాదోపవాదనలు నిలుపుదల చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు నాలుగు వారాల్లో కౌంటర్ ధాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశంవరంగల్ వాయిస్ ప్రతినిధి : హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9తో పాటు లోకల్‌ బాడీ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలపై స్టే విధించింది. బీసీ రిజర్వేషన్లపై రెండు రోజులపాటు సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం ఎట్టకేలకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ ధాఖలు చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే విధంగా పిటిషనర్లకు రెండు వారాల సమయం ఇచ్చింది. బీసీ రిజర్వేషన్లపై తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.ఉదయం నోటిఫికేషన్..రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వ...