Warangalvoice

Top Stories

MLA KP Vivekananda | ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎగిరేది గులాబీ జెండానే : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
Top Stories

MLA KP Vivekananda | ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎగిరేది గులాబీ జెండానే : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

వరంగల్ వాయిస్, దుండిగల్ : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్నారు. ఇవాళ దుండిగల్ మున్సిపాలిటీ పరిధి గండి మైసమ్మలోని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఛలో వరంగల్ సభ సన్నాహక సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఛలో వరంగల్ సభ విజయవంతంపై ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతోపాటు అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని బంగారుమయంగా మార్చారని అన్నారు. స్వల్ప ఓటు...
CM Revanth Reddy | సీఎం ఎక్కిన లిఫ్ట్‌లో స్వ‌ల్ప అంత‌రాయం.. రేవంత్ రెడ్డికి త‌ప్పిన ప్ర‌మాదం..
Top Stories

CM Revanth Reddy | సీఎం ఎక్కిన లిఫ్ట్‌లో స్వ‌ల్ప అంత‌రాయం.. రేవంత్ రెడ్డికి త‌ప్పిన ప్ర‌మాదం..

వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నారు. ఆయ‌న ఎక్కిన లిఫ్ట్‌లో స్వ‌ల్ప అంత‌రాయం ఏర్ప‌డింది. దీంతో సీఎం సెక్యూరిటీ సిబ్బంది, మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. ఈ ఘ‌ట‌న‌ హైదరాబాద్‌ శివారు శంషాబాద్‌ నోవాటెల్ హోట‌ల్‌లో మంగళ‌వారం మ‌ధ్యాహ్నం చోటు చేసుకుంది. శంషాబాద్ నోవాటెల్ హాట‌ల్‌లో కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్ర‌మంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. మొద‌టి అంత‌స్తు నుంచి రెండో అంత‌స్తులోకి వెళ్లేందుకు సీఎం రేవంత్ లిఫ్ట్ ఎక్కారు. అయితే ప‌రిమితికి మించి ఆ లిఫ్ట్‌లో ఎక్క‌డంతో అది ఒక్క‌సారిగా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. దీంతో హోట‌ల్ సిబ్బంది, సీఎం సెక్యూరిటీ అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. సెక్యూరిటీ సిబ్బంది లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసి వేరే లిఫ్ట్‌లో రేవంత్ రెడ్డిని సెకండ్ ఫ్లోర్‌కి పంపారు. రేవంత్ ఉక్కిర...
HCU | వెనక్కి తగ్గిన సర్కారు.. హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులు వాపస్‌
Top Stories

HCU | వెనక్కి తగ్గిన సర్కారు.. హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులు వాపస్‌

హెచ్‌సీయూ నుంచి పోలీసు బలగాల ఉపసంహరణ మంత్రుల సబ్‌ కమిటీ సమావేశంలో నిర్ణయం వీసీకి డిప్యూటీ సీఎం భట్టి లేఖ వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటానికి ప్రభుత్వం దిగివచ్చింది. హెచ్‌సీయూ క్యాంపస్‌ నుంచి పోలీసు బలగాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. విద్యార్థులపై నమోదు చేసిన కేసులను కూడా ఉపసంహరించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు హెచ్‌సీయూ వీసీ బీజేరావు కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార సోమవారం లేఖ రాశారు. హెచ్‌సీయూలోని కంచ గచ్చిబౌలి భూ సమస్యపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన మంత్రుల సబ్‌ కమిటీ సోమవారం సచివాలయంలో సమావేశమైంది. సబ్‌కమిటీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార అధ్యక్షతన జరిగిన సమావేశానికి కమిటీ సభ్యు లు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవ...
KTR | పెట్రోల్ ధ‌రల పెంపు.. మండిప‌డ్డ కేటీఆర్
Top Stories

KTR | పెట్రోల్ ధ‌రల పెంపు.. మండిప‌డ్డ కేటీఆర్

వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరల పెంపుపైన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప‌డ్డారు. అమెరికా అడ్డగోలుగా పెంచిన నూతన టారిఫ్ వలన తెలంగాణకు భారీ నష్టం వాటిల్లుతుంద‌ని పేర్కొన్నారు. నిన్న పెంచిన ధరలు అసాధారణం అని కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు తగ్గుతున్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రమే గ్యాస్ పెట్రోల్ ధరలు పెంచింది. మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు.. ధరలు తగ్గాల్సింది పోయి పెరుగుతున్నాయి. పెట్రోల్ ధరల పెంపు వలన నిత్యావసర సరుకుల ధరలు రవాణా చార్యులు భారీగా పెరుగుతాయి. సామాన్యుడి జీవితం అతలాకుతలమవుతుంది. బీజేపీ చెప్పిన అచ్చే దిన్ తీసుకురావడం ఇదేనా..? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. ట్రంప్ తీసుకువచ్చిన నూతన టారిఫ్ విధానంపైన కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా మాట్లాడలేదు. పార్లమె...
KTR | ఏడాది పాటు బీఆర్ఎస్ సిల్వ‌ర్ జూబ్లీ ఉత్స‌వాలు చేస్తాం : కేటీఆర్
Top Stories

KTR | ఏడాది పాటు బీఆర్ఎస్ సిల్వ‌ర్ జూబ్లీ ఉత్స‌వాలు చేస్తాం : కేటీఆర్

వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : తెలుగునాట విజ‌య‌వంతంగా 25 ఏండ్లు పూర్తి చేసుకున్న రెండు పార్టీలు బీఆర్ఎస్, టీడీపీ మాత్ర‌మే అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అందుకే ఏడాది పాటు సిల్వ‌ర్ జూబ్లీ ఉత్స‌వాలు నిర్వ‌హిస్తామ‌ని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు. వరంగల్ ఎల్కతుర్తిలో ఎలాంటి ట్రాఫిక్ లేకుండా.. ప్రజలకు ఇబ్బంది కాని ప్రాంతంలో సభ నిర్వహణ జరుగుతుంది. 1200 ఎకరాల్లో పార్కింగ్‌తో పాటు సభ ఏర్పాట్లు అన్ని ఘనంగా జరుగుతున్నాయి. ఆర్టీసీ ద్వారా 3000 బస్సుల కోసం విజ్ఞప్తి చేశాను.. ఆర్టీసీ సూత్రప్రాయంగా అంగీకరించింది. 27వ తేదీ ఆదివారం కావడం విద్యార్థులకు సెలవులు ఉండటం ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగవు అని కేటీఆర్ పేర్కొన్నారు. మా పార్టీ చరిత్రలో ఈ సమావేశం ఒక పెద్ద మీటింగ్ అవుతుంది. బహిరంగ సభ తర్వాత విద్యార్థి , కార్యకర్తల సభ్యత్వ నమోద...
Dilsukhnagar blast | దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు.. ఆ ఐదుగురికి ఉరి శిక్ష ఖరారు
Top Stories

Dilsukhnagar blast | దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు.. ఆ ఐదుగురికి ఉరి శిక్ష ఖరారు

వరంగల్ వాయిస్, దిల్‌సుఖ్‌నగర్‌ : దిల్‌సుఖ్‌నగర్‌  బాంబు పేలుళ్ల  కేసులో గతంలో ఎన్‌ఐఏ కోర్టు  ఇచ్చిన తీర్పునే తెలంగాణ హైకోర్టు  ఖరారు చేసింది. పేలుళ్ల కేసులో దోషులుగా ఉన్న ఆ ఐదుగురికి ఎన్‌ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను సమర్థించింది. బాంబు పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన ఐదుగురికి ఎన్‌ఐఏ కోర్టు 2016లో ఉరిశిక్ష విధించింది. ఆ శిక్షను రద్దు చేయాలని కోరుతూ దోషులు తెలంగాణ హైకోర్టులో అప్పీల్ పిటిషన్‌ దాఖలు చేశారు. దోషుల అప్పీల్‌ పిటిషన్‌పై ఇప్పటికే విచారణ జరిపిన హైకోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. దోషుల పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తున్నట్లు తెలిపింది. కాగా దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాప్‌లో, మిర్చిపాయింట్‌ వద్ద జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మరణించారు. 131 మంది గాయపడ్డారు. ఐదుగురు నిందితులకు ఎన్‌ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ ...
MLA Madhavaram Krishna Rao | భవిష్యత్తులో అన్ని ఆలయాలు అభివృద్ధి : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
Top Stories

MLA Madhavaram Krishna Rao | భవిష్యత్తులో అన్ని ఆలయాలు అభివృద్ధి : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

వరంగల్ వాయిస్, కేపీహెచ్‌బీ కాలనీ : కూకట్‌పల్లి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన దాసాంజనేయ స్వామి దేవాలయంలో ముందు భాగంలో ఏర్పాటు చేసిన రేకుల షెడ్డును ఇవాళ కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కురుమయ్య గారి నవీన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూకట్‌పల్లి ప్రాంతంలోని పురాతన ఆలయాలను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే రామాలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశామని భవిష్యత్తులో అన్ని ఆలయాలు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కురుమయ్య గారి కొండలరావు, గొట్టిముక్కల వెంగళరావు, వడ్డేపల్లి రాజేశ్వరరావు, ఆలయ కమిటీ చైర్మన్ తులసి రావు, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, దేవస్థాన కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు....
HCU Land Dispute: హెచ్‌సీయూ భూములపై హైకోర్టు ఏం తేల్చిందంటే
Top Stories

HCU Land Dispute: హెచ్‌సీయూ భూములపై హైకోర్టు ఏం తేల్చిందంటే

హెచ్‌సీయూ భూములపై హైకోర్టులో విచారణ జరుగగా.. కొన్ని అంశాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు న్యాయవాదులు. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 24కు వాయిదా వేసింది. వరంగల్ వాయిస్, హైదరాబాద్ : హెచ్‌సీయూ భూ వివాదంపై  ఈరోజు (సోమవారం) హైకోర్టులో  విచారణ వాయిదా పడింది. ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం. ఈ అంశం సుప్రీంకోర్టు  పరిధిలో ఉందని డివిజన్ బెంచ్ పేర్కొంది. ఈ కేసులో కౌంటర్, రిపోర్ట్ ఈనెల 24లోగా సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. హెచ్‌సీయూ భూముల వివాదంపై సుప్రీం కోర్టు, హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో హైకోర్టులో హెచ్‌సీయూ భూములపై విచారణ జరుగగా.. పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీం కోర్టులో కేసు విచారణ దశలో ఉన్నందున ఈనెల 24కు వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. 24 లోపు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించారు. అలాగే ...
BRS | తెలంగాణ భవన్‌లో ఘనంగా బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు..
Top Stories

BRS | తెలంగాణ భవన్‌లో ఘనంగా బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు..

మాజీ ఉపప్రధాని, దివంగత బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు బీఆర్ఎస్  పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. బీజేఆర్ చిత్రపటానికి శాసన మండలిలో ప్రతిపక్షనేత ఎస్.మధుసుదానా చారి సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ఘనంగా నివాళులర్పించారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : మాజీ ఉపప్రధాని, దివంగత బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు బీఆర్ఎస్  పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. బీజేఆర్ చిత్రపటానికి శాసన మండలిలో ప్రతిపక్షనేత ఎస్.మధుసుదానా చారి సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ఘనంగా నివాళులర్పించారు. జగ్జీవన్ రామ్‌కు భారత రత్న ఇవ్వాలని మధుసూదనా చారి డిమాండ్ చేశారు. రాష్ట్రం లోని కాంగ్రెస్ ప్రభుత్వం బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలకు విరుద్ధంగా పని చేస్తున్నదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎర్రోళ్ల శ్రీనివాస్‌, గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, పార్టీ నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు....
KCR | ఉమ్మ‌డి ఖ‌మ్మం, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, న‌ల్ల‌గొండ జిల్లాల ముఖ్య నేత‌ల‌తో కేసీఆర్ స‌మావేశం
Top Stories

KCR | ఉమ్మ‌డి ఖ‌మ్మం, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, న‌ల్ల‌గొండ జిల్లాల ముఖ్య నేత‌ల‌తో కేసీఆర్ స‌మావేశం

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల ముఖ్య నేతలతో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల ముఖ్య నేతలతో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన శనివారం ఎర్రవెల్లి నివాసంలో నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు సిహెచ్ లక్ష్మారెడ్డి, ఎస్ నిరంజన్ రెడ్డి, వీ శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే విజయ్ భాస్కర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డ...