ప్రజలను కలువరు.. సమస్యలపై అడుగరు
పట్టణ ప్రగతిలో గోప్యమెందుకో?ఫొటో ఫోజులకే నాయకులు పరిమితంమేయర్, కమిషనర్‌లకు ప్రత్యేక షెడ్యూలే లేదుమొక్కు బడిగా ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకంమహానగరంలో సమస్యలు బోలెడు
మహా నగరంలో ఈనెల 3నుంచి ప్రారంభమైన పట్టణ ప్రగతి మొక్కుబడిగా సాగుతోంది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రోజువారీగా నిర్వహించే పనులకే పట్టణ ప్రగతి బిల్డప్ ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. పట్టణ ప్రగతిలో ప్రముఖంగా పాల్గొనాల్సిన మేయర్, కమిషనర్‌లకు ప్రత్యేక షెడ్యూలు లేకపోవడం, వారు ఏరోజు ఏ డివిజన్‌లో పర్యటిస్తారో గోప్యంగా ఉంచడం, అసలు పట్టణ ప్రగతికి ప్రత్యేకంగా మంజూరైన నిధుల వివరాలను కూడా వెల్లడిరచకపోవడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. స్థానికంగా ఉండే సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతిలో మేయర్, కమిషనర్ ఏ సమయంలో ఏ డివిజన్‌లో పర్యటిస్తారో తెలియక ప్రజలు తికమక పడుతున్నారు. ఫొటోలకు ఫోజులిచ్చేందుకే పట్టణ ప్రగతి...



