Warangalvoice

Top Stories

క్రీడలతోనే యువతకు ఉజ్వల భవిష్యత్తు <br> ‘సీఎం కప్ టార్చ్ ర్యాలీ’
Top Stories

క్రీడలతోనే యువతకు ఉజ్వల భవిష్యత్తు
‘సీఎం కప్ టార్చ్ ర్యాలీ’

వరంగల్ వాయిస్, దామెర : ముఖ్యమంత్రి కప్ క్రీడా పోటీల సందడి మండలంలో మొదలైంది. పోటీల ప్రాముఖ్యతను చాటిచెబుతూ శుక్రవారం దామెర మండలంలోని ఊరుగొండ, ఒగ్లాపూర్, దామెర గ్రామ పంచాయతీల్లో ‘సీఎం కప్ టార్చ్ ర్యాలీ’ అత్యంత ఉత్సాహంగా జరిగింది. జిల్లా యువజన క్రీడల అధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీకి క్రీడాకారులు, విద్యార్థులు, యువత భారీ సంఖ్యలో తరలివచ్చారు. మండలంలోని ప్రధాన గ్రామాల్లో సాగిన ఈ టార్చ్ ర్యాలీకి ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. క్రీడా జ్యోతిని చేతబూని క్రీడాకారులు ఉత్సాహంగా పరుగులు తీశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడమే సీఎం కప్ ప్రధాన ఉద్దేశమని, యువత ఈ పోటీల్లో పెద్ద ఎత్తున పాల్గొని తమ ప్రతిభను చాటాలని పిలుపునిచ్చారు. గ్రామీణ క్రీడాకారులకు ఈ పోటీలు ఒక గొప్ప వేదికని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్న...
మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ
Top Stories

మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ

ఒగ్లాపూర్‌ సర్పంచ్ శ్రీధర్ రెడ్డివరంగల్ వాయిస్, దామెర : హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ఒగ్లాపూర్ గ్రామ పంచాయతీలో శుక్రవారం నూతన నర్సరీ పనులను సర్పంచ్ కేతిరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. గ్రామాన్ని పచ్చదనంతో నింపే లక్ష్యంతో, రాబోయే వర్షాకాలం నాటికి లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను సిద్ధం చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో పచ్చదనం పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కోరారు. ఉపాధి హామీ పథకం కింద నర్సరీలో వివిధ రకాల పండ్ల, నీడనిచ్చే మొక్కలను పెంచుతున్నట్లు తెలిపారు. సకాలంలో మొక్కలను సిద్ధం చేసి నాటడం ద్వారా ఒగ్లాపూర్‌ను ఆదర్శ హరిత గ్రామంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఇంజపెల్లి నరేష్, ఉపసర్పంచ్ కిన్నెర దినేష్ కుమార్, వార్డు స...
మినీ మేడారం జాతర రోడ్డుకు మహర్దశ పట్టేనా?
Top Stories

మినీ మేడారం జాతర రోడ్డుకు మహర్దశ పట్టేనా?

కునారిల్లుతున్న తక్కళ్ళపహాడ్ - ఆగ్రంపహాడ్ మార్గంకలెక్టర్‌కు సర్పంచ్ దాడి వసంత రమేష్ వినతి వరంగల్ వాయిస్,దామెర : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, మినీ మేడారంగా పిలవబడే ఆగ్రంపహాడ్ శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర సమీపిస్తున్న తరుణంలో, భక్తులు ప్రయాణించే ప్రధాన రహదారి అధ్వానంగా మారడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తక్కళ్లపహాడ్ మీదుగా జాతరకు వెళ్లే బీటీ.రోడ్డు పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో భక్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై తక్కళ్లపహాడ్ గ్రామ సర్పంచ్ దాడి వసంత రమేష్ మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. గతంలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ద్వారా ఈ రోడ్డు నిర్మాణం కోసం సుమారు రూ.86 లక్షల నిధులు మంజూరయ్యాయని, అయితే పనులు సగంలోనే ఆగిపోవడంతో రోడ్డు ప్రస్తుతం కంకర తేలి భారీ గుంతలతో దర్శనమిస్తోందని సర్పంచ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా వాగు వంతెన వ...
Top Stories

పుష్కలంగా యూరియా నిల్వలు
తప్పుడు ప్రచారాలను నమ్మకండి
మండల వ్యవసాయ అధికారి రాకేష్

వరంగల్ వాయిస్, దామెర : ప్రస్తుత యాసంగి సాగు సీజన్‌కు సంబంధించి దామెర మండలంలో రైతులకు అవసరమైన యూరియా ఎరువులు సరిపడా అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి (ఏఓ) రాకేష్ స్పష్టం చేశారు. సోమవారం దామెర రైతు వేదికలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలో యూరియా కొరత ఉందంటూ ఒక దినపత్రికలో వచ్చిన వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆ వార్తలో వాస్తవం లేదని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధీమా ఇచ్చారు.ఈ సీజన్‌లో ఇప్పటివరకు మార్క్ ఫెడ్ ద్వారా మండలానికి వచ్చిన యూరియా వివరాలను ఏఓ వెల్లడించారు. పీఏసీఎస్ ఊరుగొండ కేంద్రం: 190 మెట్రిక్ టన్నులు, హాకా దామెర కేంద్రం: 60 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్లు: 70 మెట్రిక్ టన్నులు మొత్తంగా ఇప్పటివరకు ఆయా కేంద్రాల ద్వారా రైతులకు ఎరువుల పంపిణీ సజావుగా సాగిందని ఆయన తెలిపారు. యూరియా నిల్వలు అయిపోయిన వెంటనే ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకొని ఎ...
Top Stories

దండు సురేందర్ కుటుంబానికి పరామర్శ

వరంగల్ వాయిస్, దామెర :మండలంలోని పులుకుర్తి గ్రామ నివాసి దండు సురేందర్ ఇటీవల అకాల మరణం చెందడం పట్ల మండల యూత్ బీఆర్ఎస్  అధ్యక్షులు, మాజీ ఉపసర్పంచ్ పెంచాల రాజేందర్ (మెంతుల రాజు) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం సురేందర్ గృహాన్ని సందర్శించిన ఆయన, మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శోకతప్త హృదయంతో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. సురేందర్ మరణం గ్రామస్థులకు మరియు వారి కుటుంబానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి వ్యక్తిగతంగా మరియు రాజకీయంగా ఎల్లవేళలా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. నాయకులు కాశెట్టి సదానందం, ఈదునూరి స్వామి, రాజు, ఆనంద్, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు....
బ్యాండు మాస్టర్స్, వర్కర్ల ఆత్మీయ భేటీ<br>ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని పిలుపు
Top Stories

బ్యాండు మాస్టర్స్, వర్కర్ల ఆత్మీయ భేటీ
ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని పిలుపు

వరంగల్ వాయిస్, దామెర : సమాజంలో అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఐక్యంగా ఉన్నప్పుడే హక్కుల సాధన సాధ్యమవుతుందని సామాజిక నాయకులు వేల్పుల శ్రీనివాస్ అన్నారు. శనివారం దామెర మండలంలోని ల్యాదెళ్ల గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.  ముఖ్యంగా బ్యాండు మాస్టర్స్, బ్యాండు కార్మికులు అందరూ ఒకే తాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. "మనమే బ్యాండు మాస్టర్లుగా ఎదగాలి, మన వృత్తిలో మనం ఐక్యతను చాటుకోవాలి" అని ఆయన పేర్కొన్నారు. కేవలం వృత్తిపరంగానే కాకుండా, సామాజికంగా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఒకరికొకరు తోడుగా ఉండాలని కోరారు. ఐక్యత ద్వారానే మన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగలమని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాల ద్వారా ఈ వర్గాలను చైతన్యపరుస్తామని శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, రాము, లక్ష్మణ్,  స్థానిక బ్యాండు కార్మికులు పాల్గొన్నారు....
ముగిసిన 44వ రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలు<br> రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐలయ్య.
Top Stories

ముగిసిన 44వ రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐలయ్య.

వరంగల్ వాయిస్, పర్వతగిరి : గత మూడు రోజులుగా అన్నారం పల్లవి మోడల్ పాఠశాలలో జరుగుతున్న 44వ రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ క్రీడోత్సవాలు ముగిసినట్లుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐలయ్య తెలిపారు. 1200 మంది క్రీడాకారులు పాల్గొన ఈ పోటీలలో సుమారు 100 మంది టెక్నికల్ సహాయకులు సేవలందించారు. మహిళ విభాగంలో మొదటి స్థానం నల్గొండ జట్టు గెలువగా రెండవ స్థానంలో మహబూబాబాద్ టీమ్, మూడవ స్థానంలో నారాయణపేట టీమ్  నిలిచాయి. పురుషుల విభాగంలో మొదటి స్థానం యాదాద్రి భువనగిరి జట్టు విజయం సాధించిగా,  రెండవ స్థానం సంగారెడ్డి, మూడవ స్థానం హైదరాబాద్ జట్టు నిలిచాయి. ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు మహారాష్ట్రలో జరగబోయే జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొంటారని తెలిపారు. చివరి రోజున స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు క్రీడాలను సందర్శించి విన్నర్, రన్నర్ క్రీడాకారులను షిల్డ్ బహుమతి అందజేసి అభినందించారు. సుమారుగా 1000 మంది క్రీడాకా...
ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
Top Stories

ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

వరంగల్ వాయిస్,దామెర:నూతన సంవత్సరంలో గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఒగ్లాపూర్ గ్రామ సర్పంచ్ కేతి పెళ్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారము దామెర  మండలంలోని ఓగులాపూర్ లో నూతన సంవత్సర వేడుకలను గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ కేక్ కట్ చేసి గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ నూతన సంవత్సరంలో గ్రామ ప్రజల నాయకుల సమిష్టి కృషితో గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిని కొనసాగించేలా కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో  గ్రామపంచాయతీ కార్యదర్శి నరేష్,ఉపసర్పంచ్ కిన్నెర దినేష్, కిన్నెర రామస్వామి, కనుకుంట్ల నరేష్, రాస మల్ల మధు, కారోబారు శ్రీను గ్రామ సిబ్బంది పాల్గొన్నారు....
నూతన సంవత్సర వేడుకలపై కఠిన చర్యలు
Top Stories

నూతన సంవత్సర వేడుకలపై కఠిన చర్యలు

వరంగల్ వాయిస్, దామెర : నూతన సంవత్సర వేడుకలలో నిబంధ నలు అతిక్రమించి హద్దు మీరితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని దామెర ఎస్సై కొంక  అశోక్ హెచ్చరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. మండల ప్రజలు ప్రశాం తమైన వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురికా వద్దని సూచించారు. రోడ్లపై కేకు కటిం గులు, మద్యం సేవించి అల్లర్లకు పాల్పడడం వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవ ద్దని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాలలో డీజే సౌండ్ సిస్టంలు వినియోగిస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగించొద్దని, కలిగిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. డిసెంబర్ 31న రాత్రి పోలీస్ బృందాలుగా ఏర్పడి పెట్రోలింగ్ నిర్వ హిస్తామన్నారు....
విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకోవాలి
Top Stories

విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకోవాలి

వరంగల్ వాయిస్ , దామెర: హనుమకొండ జిల్లా దామెర మండలం ఓగులాపూర్ గ్రామ పరిధిలోని డిస్నీల్యాండ్ హై స్కూల్ 25వ వార్షికోత్సవ (సిల్వర్ జూబ్లీ) వేడుకల్లో ముఖ్యఅతిథిగా పరకాల శాసనసభ్యులు  రేవూరి ప్రకాశ్ రెడ్డి  పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డిస్నీల్యాండ్ యజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.విద్యార్థులు పాఠశాల దశలోనే ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించేందుకు పట్టుదలతో శ్రమించాలని అన్నారు. విద్యార్థులు పట్టుదలతో సాధిస్తే ఏదైనా సాధ్యమవుతుందని అన్నారు.నేటి బాలలే రేపటి పౌరులని, విద్యతో పాటు విలువలు అవసరమని పేర్కొంటూ విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కేతుపల్లి శ్రీధర్రెడ్డి, పాఠశాల కర స్పాండెంట్ బి. శోభారాణి, పాఠశాల వ్యవస్థా పకులు బి.లక్ష్మీనివాసం, ...