కేటీఆర్ హామీ .. బుట్టదాఖలు
రెండు సంవత్సరాలైనా నెరవేరని లక్ష్యంపక్కదారి పట్టిన ప్రత్యేక నిధులుముంపుపై చొరవ చూపని బల్దియాగత నిధులకే మోక్షం లేదు..అదనంగా మరో రూ.250 కోట్ల నిధులంటూ ప్రచారం
‘‘వరంగల్ మహా నగరపాలక సంస్థ పరిధిలో ముంపు సమస్యే ఉండొద్దు.. అందుకు కావాల్సిన శాశ్వత ప్రణాళికలు రూపొందించండి.. ప్రధాన నాలాలను విస్తరించి ఇతరులెవరూ ఆక్రమించకుండా రెండు వైపుల గోడలు కట్టాలి.. ఆక్రమణకు గురైనా నాలాలను క్లియర్ చేయండి.. వాటితోనే అసలు సమస్య.. నాలాల ఆక్రమణదారులు ఏ హోదాలో ఉన్నా ఉదాసీనత ప్రదర్శించవద్దు.. అవసరమైతే పోలీసుల ప్రొటెక్షన్ తీసుకొని కూల్చివేయండి.. నగరాన్ని ముంపునుంచి రక్షించేందుకు ఎన్ని కోట్లు ఖర్చైనా ఫర్వాలేదు.. ’’అంటూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు అక్టోబర్ 2020లో ఇచ్చిన హామీని బల్దియా అధికారులు అటకెక్కించారు. మంత్రి హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా నేటికీ నగర ప్రజలు ముంపు భయంతో వణికిప...









