సరదాగా సాగిన సంక్రాంతి వేడుకలు
సంక్రాంతి అంటేనే సరదా అన్న రీతిలో పండుగ సాగింది. ప్రజలంతా అష్టకష్టాలు పడి సొంతూళ్లకు వెళ్లి పండగ చేసుకున్నారు. గత మూడేళ్లుగా కరోనా భయాల మధ్య సాగిన పండగ ఇప్పుడు సరదాగా సాగింది. సంస్కృతిని ప్రతిబింబించేవి పండుగలే. ఈ పండుగలు, ఉత్సవాలు, జాతరలు, కొలుపులు మొదలైనవన్నీ మన సంస్కృతిలో భాగం. తెలుగునాట సంక్రాంతిని ముఖ్యమైన పండుగగా చెప్పుకోవచ్చు. తెలుగునాట సంక్రాంతి, తమిళనాడులో పొంగల్, కేరళలో ’ఓణం’ ఇటువంటి పండుగే. కన్నడ, మరాఠీ ప్రజలు కూడా ఈ పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఇది పంటల పండుగ. పంట రైతు ఇంటికి చేరి ప్రతి ఇల్లు ధాన్యలక్ష్మితో కళకళలాడే సమయం ఇది. మొదటిరోజు భోగి, రెండవ రోజున సంక్రాంతి, మూడవ రోజున కనుమ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. సంక్రాంతి అంటే భోగి మంటలు, పాడిపంటలు, పిండి వంటలు మాత్రమే కాదు... రంగురంగుల ముగ్గులతో, పువ్వులు అలంకరించిన గొబ్బెమ్మలతో, హరిదాసు పాటలు, గంగిరెద్దుల ఆటలు, పతంగాల ...








