Warangalvoice

Top Stories

వృద్ధుడి ప్రాణం కాపాడేందుకు ఎస్సై తాపత్రయం
Top Stories

వృద్ధుడి ప్రాణం కాపాడేందుకు ఎస్సై తాపత్రయం

వృద్ధుడి ప్రాణం కాపాడేందుకు ఎస్సై తాపత్రయంఎస్సై సీపీఆర్ చేసినా దక్కని ప్రాణంవరంగల్ వాయిస్, దామెర : ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని కాపాడేందుకు ఓ పోలీస్ అధికారి తన వంతు ప్రయత్నం చేశారు. నిమిషాల వ్యవధిలో స్పందించి ప్రాణవాయువు అందించే ప్రయత్నం చేసినా, విధి వెక్కిరించడంతో ఆ వ్యక్తి మృతి చెందారు. శుక్రవారం దామెర మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన స్థానికులను కలచివేసింది. దామెర గ్రామానికి చెందిన భాషబోయిన రాజాలు (58) శుక్రవారం పోలీస్ స్టేషన్ సమీపంలోని వాటర్ ట్యాంకు వద్ద పక్కనే ఉన్న వారితో మాట్లాడుతుండగా, ఒక్కసారిగా గుండెపోటుతో కింద పడిపోయారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై కొంక అశోక్కు సమాచారం అందించారు.సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై అశోక్, క్షణం కూడా వృధా చేయకుండా రాజాలుకు సీపీఆర్ చేశారు. ఆయన గుండె మళ్లీ కొట్టుకునేలా తన శాయశక్తులా ప్రయత్నించారు. అయితే...
కార్మికుల ఆరోగ్యమే లక్ష్యం
Top Stories

కార్మికుల ఆరోగ్యమే లక్ష్యం

దామెరలో లేబర్ కార్డుదారులకు రక్త పరీక్షలుహెల్త్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ వరంగల్ వాయిస్, దామెర : కార్మికుల సంక్షేమం మరియు వారి ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా దామెర మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో శనివారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. లేబర్ కార్డు కలిగిన కార్మికులకు ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించి, అనంతరం వారికి హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన దామెర గ్రామ సర్పంచ్ గారిగే కల్పనా కృష్ణమూర్తి, ఉప సర్పంచ్ బత్తిని రాజు యాదవ్ మాట్లాడుతూ.. రెక్కాడితే గాని డొక్కాడని కార్మికులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆరోగ్య సదుపాయాలను ప్రతి కార్మికుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ వైద్య శిబిరంలో వార్డు సభ్యులు వేల్పుల ప్రసాద్, మీరల రవి, మంతుర్తి రాకేష్, అశోద రవేందర్, బోడ శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే నాయకులు సోన...
పోలీసులను బ్లాక్‌మెయిల్ చేస్తే జైలుకే<br>సీఐ మల్లేష్ హెచ్చరిక<br>
Top Stories

పోలీసులను బ్లాక్‌మెయిల్ చేస్తే జైలుకే
సీఐ మల్లేష్ హెచ్చరిక

వరంగల్ వాయిస్, చిట్యాల : అక్రమాలకు పాల్పడుతూ, తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ బ్లాక్‌మెయిల్‌కు దిగేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చిట్యాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ డి.మల్లేష్ హెచ్చరించారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, పోలీసు శాఖ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. గత నవంబర్ చివరి వారంలో చిట్యాల శివాజీ విగ్రహం వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మోత్కూరు నరేష్ అనే వ్యక్తి 473 రీడింగ్‌తో (తీవ్ర మద్యం మత్తు) పట్టుబడ్డాడు. అతని వాహనాన్ని తనిఖీ చేయగా 5 లీటర్ల గుడుంబా లభ్యమైంది. దీంతో పోలీసులు నిందితుడు నరేష్‌తో పాటు సాదా రాములుపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు. జనవరి 16న నిందితుడు అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, తన వాహనాన్ని కావాలనే ఇవ్వడం లేదని తప్పుడు ఆరోపణలు చేయడాన్ని సీఐ తీవ్రంగా ఖండించార...
త్వరలోనే నూతన బస్టాండ్ ప్రారంభం
Top Stories

త్వరలోనే నూతన బస్టాండ్ ప్రారంభం

వరంగల్ వాయిస్,చిట్యాల : ప్రతిష్టాత్మకమైన మేడారం జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం చిట్యాల మండల కేంద్రంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసేందుకు ఆర్టీసీ అధికారులు సమాయత్తమవుతున్నారు. శనివారం పరకాల బస్ డిపో మేనేజర్ (డీఎం) రామ్ ప్రసాద్ చిట్యాల గ్రామ పంచాయతీని సందర్శించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మరియు ఉపసర్పంచ్‌లను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. రాబోయే మేడారం జాతరను పురస్కరించుకుని, చిట్యాల ప్యాక్స్ (PACS) గ్రౌండ్‌లో తాత్కాలిక బస్ పాయింట్‌ను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ బస్ పాయింట్ వద్ద ప్రయాణికులకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు (తాగునీరు, విద్యుత్, షెడ్లు) కల్పించాలని డిఎం సర్పంచ్‌ను కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సర్పంచ్, అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు.  చిట్యాల మండల కేంద్రంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నూతన బస్టాండ్‌ను ప్రారంభించాలని సర్...
కాంగ్రెస్ దామెర సేవాదళ్ మండల అధ్యక్షుడుగా కొక్కుల ఓం ప్రకాష్
Top Stories

కాంగ్రెస్ దామెర సేవాదళ్ మండల అధ్యక్షుడుగా కొక్కుల ఓం ప్రకాష్

వరంగల్ వాయిస్,దామెర: దామెర మండల కేంద్రానికి చెందిన కొక్కుల ఓం ప్రకాష్ ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు బొచ్చు చందర్ నియామక ఉత్తర్వులు అందించారు కొక్కుల ఓం ప్రకాష్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పార్టీ ఎదుగుదలకు చేసిన సేవలను గుర్తించి నియామక ఉత్తర్వులను అందించినట్లు వారు తెలిపారు ఈ సందర్భంగా ఓం ప్రకాష్ మాట్లాడుతూ సేవాదళ్ మండల అధ్యక్షుడిగా నాపై నమ్మకంతో పార్టీ బాధ్యతలను అప్పగించడం పట్ల మరింత ఉత్సాహంతో పని చేస్తానని తెలిపారు తన నియామకానికి సహకరించిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా చైర్మన్ డిసిసి హనుమకొండ జిల్లా అధ్యక్షులు  వెంకట్రాంరెడ్డికి దామర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన్నెం ప్రకాష్ రెడ్డి టిపిసిసి ఎస్సి సేల్ స్టేట్ కన్వీనర్ దళితరత్న అవార్డు గ్రహీత కోర్నెల్ మరియు సర్పంచ్ పోలేపాక శ్రీనివాస్ సమన్వయ కమిటీ సభ్యులు కూనమల రవీందర్ దుర్గంపేట సర్పంచ్ దాస...
ప్రభుత్వ ఆదాయం 3.90 కోట్లగండి..
Top Stories

ప్రభుత్వ ఆదాయం 3.90 కోట్లగండి..

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్వరంగల్ వాయిస్, క్రైమ్ : రాష్ట్రంలో సంచలం సృష్టించిన జనగామ, యాదాద్రి జిల్లాల్లో ధరణి, భూభారతీ రిజిస్ట్రేషన్లలో 3.90కోట్ల రూపాయల కుంభకోణంలో ప్రభుత్వ అదాయానికి గండి కొట్టిన మొత్తం ముఠాలోని 15 మందిని జనగామ పోలీసులు అరెస్టు చేయగా, మరో తొమ్మిది మంది ప్రస్తుతం పరారీలో వున్నారు. ఈ ముఠా సభ్యుల నుండి పోలీసులు 63.19 లక్షల నగదు, బ్యాంక్లో 1లక్ష రూపాయలు, సుమారు ఒక కోటి రూపాయల విలువైన ఆస్తి పత్రాలు, ఒక కారు, రెండు ల్యాప్ టాప్లు, ఐదు డెస్క్ టాప్ కంప్యూటర్లు, 17 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు అరెస్టు చేసిన వారిలో వసునూరి బసవ రాజు, యాదాద్రి జిల్లా, జెల్లా పాండు, యాదాద్రి జిల్లా,మహేశ్వరం గణేష్ కుమార్,ఇయాదాద్రి జిల్లా, ఈగజులపాటి శ్రీనాథ్, జనగామ, యెనగంధుల వెంకటేష్, జనగామ,కోదురి శ్రవణ్,  జనగామ,కొలిపాక సతీష్ కుమార్, కొడకండ్ల (ఎం), జనగామ,తడూరి రంజి...
ఘనంగా క్యాలెండర్ ఆవిష్కరణ
Top Stories

ఘనంగా క్యాలెండర్ ఆవిష్కరణ

వరంగల్ వాయిస్, హనుమకొండ: బ్యాండ్ కళాకారుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని, వారిని అన్ని విధాలా ఆదుకోవాలని బ్యాండ్ కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండలోని ఏకశిల పార్కులో వరంగల్ అర్బన్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రేటర్ అధ్యక్ష కార్యదర్శులు సూత్రపు అంజయ్య, కుక్కమూడి శంకర్ లతో కలిసి నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు చాంద్ పాషా, ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాజు నాగరాజు మాట్లాడుతూ బ్యాండ్ కళాకారుల దయనీయ స్థితిని వివరించారు. వృత్తిరీత్యా 50 ఏళ్లకే అనారోగ్యానికి గురవుతున్న కళాకారులకు ప్రభుత్వం పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు. సాంస్కృతిక కార్యక్రమాలలో బ్యాండ్ కళాకారులకు తగిన ప్రాధాన్యత మరియు గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న కళాక...
మిన్నంటిన భోగి సంబరాలు<br>ఘనంగా భోగి మంటలు
Top Stories

మిన్నంటిన భోగి సంబరాలు
ఘనంగా భోగి మంటలు

పండుగ ఉత్సాహంలో గ్రామస్తులువరంగల్ వాయిస్, కమలాపూర్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి సంబరాలు కమలాపూర్ మండల కేంద్రంలో భోగి మంటలతో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తున్నట్లుగానే, ఈ ఏడాది కూడా ప్రగతి యూత్ ఆధ్వర్యంలో తెల్లవారుజామునే భోగి మంటల కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.సందడిగా భోగి వేడుకలు - సర్పంచ్ సందడిగ్రామ నడిబొడ్డున మంటలు వెలిగించడంతో ఊరంతా పండుగ కళ సంతరించుకుంది. ఈ వేడుకలో సర్పంచ్ సతీష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కేవలం అతిథిలా కాకుండా, గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి ఆయన స్వయంగా నృత్యం (డ్యాన్స్) చేస్తూ పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. ఒక ప్రజాప్రతినిధి సామాన్య ప్రజలతో కలిసి చిందేయడం చూసి గ్రామస్తులు చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇది ప్రజలకు, ప్రజాప్రతినిధికి మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనమని పలువురు కొనియాడారు. ఈ...
వైభవంగా గోదాదేవి కళ్యాణం
Top Stories

వైభవంగా గోదాదేవి కళ్యాణం

వరంగల్ వాయిస్, కమలాపూర్ : ధనుర్మాస ముగింపు వేడుకలు, భోగి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక శ్రీ సీతా రామచంద్రస్వామి దేవాలయంలో గోదాదేవి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక వేడుకను వీక్షించేందుకు గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో రంగనాథ స్వామి మరియు గోదాదేవి (ఆండాళ్ అమ్మవారు) ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, నూతన వస్త్రాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం వేద పండితులు మంగళ వాయిద్యాల మధ్య, శాస్త్రోక్తంగా కళ్యాణ ఘట్టాన్ని పూర్తి చేశారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయమంతా ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది.ఈ విశిష్ట పూజా కార్యక్రమాలను అర్చకులు పరాశరం సత్యనారాయణ చార్యులు, పరాశరం రామాచార్యులు, పరాశరం వెంకటాచార్యులు, రాఘవ చార్యులు, కందడై తిరువెంగలా చార్యులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారిన...
పల్లవి మోడల్ స్కూల్‌లో సంక్రాంతి సంబరాలు
Top Stories

పల్లవి మోడల్ స్కూల్‌లో సంక్రాంతి సంబరాలు

హాజరైన పర్వతగిరి ఎస్‌ఐ ప్రవీణ్, సర్పంచ్ మహేందర్వరంగల్ వాయిస్, పర్వతగిరి:  అన్నారంలోని పల్లవి మోడల్ స్కూల్‌లో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. పాఠశాల చైర్మన్ అశోక్ చారి, కరస్పాండెంట్ గంజి మహేందర్, డైరెక్టర్ కోటగిరి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు గ్రామస్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పర్వతగిరి ఎస్‌ఐ ప్రవీణ్, అన్నారం సర్పంచ్ గాడిపెళ్లి మహేందర్ హాజరయ్యారు. అతిథులు విద్యార్థులతో కలిసి గాలిపటాలు ఎగురవేసి, భోగి మంటల వద్ద సందడి చేస్తూ వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ కుల వృత్తులను ప్రతిబింబించేలా వేషధారణలతో అలరించారు. హరిదాసులు, బసవన్నల రాకతో పాఠశాల ప్రాంగణం ఒక కుగ్రామాన్ని తలపించింది. విద్యార్థినులు వేసిన రంగోళి (ముగ్గుల) పోటీలు వారి ప్రతిభకు అద్దం పట్టాయి. సంక్రాంతి పాటలకు విద్యార్థులు చేసిన నృత్యాలు అం...