Warangalvoice

Top Stories

గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి ఓటేయండి
Top Stories, Warangal

గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి ఓటేయండి

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి వరంగల్ వాయిస్, వరంగల్ : తూర్పు నియోజకవర్గంలో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఉపఎన్నిక సందర్బంగా గురువారం వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జి కామారెడ్డి శాసనసభ్యుడు కాటిపల్లి వెంకటరమణా రెడ్డితో కలిసి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ వరంగల్ ఎల్ఐసీ మెయిన్ బ్రాంచ్, ఎంజీఎం ఎదురుగా గల ఎల్ఐ సీ బ్రాంచ్, పలు విద్యా సంస్థలు, పలు ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగులను కలసి వారితో ముచ్చటించారు. నిరుద్యోగులను మోసం చేసిందని గత ప్రభుత్వ బీఆర్ఎస్ ను, ఇప్పుడు దొంగ హామీలతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ నమ్మడం లేదని దుయ్యబట్టారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జి పీఎల్ శ్రీనివాస్, గంగిడి...
విద్యుత్ షాక్ తో దుక్కిటేద్దు మృతి
Top Stories

విద్యుత్ షాక్ తో దుక్కిటేద్దు మృతి

వరంగల్ వాయిస్, వెంకటాపూర్ : మండలంలోని మల్లయ్యపల్లి గ్రామంలో విద్యుత్ షాకుతో దుక్కిటేద్దు మృతి చెందింది. రైతు హట్కర్ రూపు సింగ్ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఎద్దు రాకపోవడంతో చుట్టు పరిసరాలలో పరిశీలించగా, విద్యుత్ షాక్ తో ఎద్దు మృతిచెంది ఉందని ఆయన పేర్కొన్నారు. మృతి చెందిన ఎద్దు విలువ 50 వేలు ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ అధికారులు పరిశీలించి పంచనామా చేశారు. ప్రభుత్వం తరుపున ఆదుకోవాలని బాధిత రైతు అధికారులను కోరారు.  ...
పూసపల్లి కుట్ర కేసులో వెంకట్ రెడ్డి పేరును తొలిగించాలి
Top Stories

పూసపల్లి కుట్ర కేసులో వెంకట్ రెడ్డి పేరును తొలిగించాలి

ప్రశ్నించే గొంతుకలపై కుట్ర కేసులు సరికాదు కాకతీయ యూనివర్సిటీ కార్యదర్శి మర్రి మహేష్ వరంగల్ వాయిస్, కేయూ : గత మూడు నెలల క్రితం సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ అజ్ఞాత దళ నేతలపై పెట్టిన పూసపల్లి కుట్ర కేసులో భాగంగా నిన్న పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి వెంకటరెడ్డి పేరు చేర్చడం పట్ల పీడీఎస్ యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద బుధవారంనిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం కాకతీయ యూనివర్సిటీ కార్యదర్శి మర్రి మహేష్ మాట్లాడుతూ పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి వెంకటరెడ్డి పేరును పూసపల్లి కుట్ర కేసులో చేర్చడం ప్రజాస్వామ్య విరుద్ధమని, ఇది ప్రశ్నించే గొంతుకలను అణిచివేయడమేనని అన్నారు. గడిల పాలలను బద్దలు కొట్టి ప్రజల పాలనను తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వలే ప్రశ్నించే గొంతులను ...
గ్రానైట్ లారీలను అడ్డుకున్న బృందావన్ కాలనీవాసులు
Top Stories

గ్రానైట్ లారీలను అడ్డుకున్న బృందావన్ కాలనీవాసులు

వరంగల్ వాయిస్, కాజీపేట : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాజీపేట పట్టణం, 63వ డివిజన్ బాపూజీ నగర్ కూరగాయల మార్కెట్ పరిధిలో నూతనంగా ఏర్పడిన బృందావన్ కాలనీవాసులు బుధవారం గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ ఈ గ్రానైట్ క్వారీలను నడుపుతున్న నాలుగు క్వారీ యజమానుల మీద ప్రస్తుత కాజీపేట సీఐకి ఫిర్యాదు చేశామన్నారు. గ్రానైట్ క్వారీ ఓనర్లు ఇష్టారాజ్యంగా గ్రానైట్ లోడ్ తో లారీలను కాలనీలో నడిపిస్తున్నారని, గతంలో కాజీపేట సీఐగా పనిచేసిన మహేందర్ రెడ్డి, రాజులకు పిటిషన్లు ఇవ్వగా, నాలుగు క్వారీల యజమానులు వచ్చి కాలనీవాసులను సమయం అడగగా కాలనీవాసులు ఒప్పుకోలేదన్నారు. అలాగే గతంలో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కు తెలియపరచగా ఆయన కాలనీకి వచ్చి అప్పటి స్థానిక సీఐ, ఏసీపీ, తహసీల్దార్, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ మైనింగ్ ఏడీలను పిలిపించి...
ఎమ్మెల్సీగా రాకేష్ రెడ్డిని గెలిపించాలి
Top Stories

ఎమ్మెల్సీగా రాకేష్ రెడ్డిని గెలిపించాలి

పిలుపునిచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వరంగల్ వాయిస్, హనుమకొండ : వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఏనుగుల రాకేశ్ రెడ్డిని గెలిపించాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఉన్నత విద్యావంతులు, యువకులు, నిజాయితీపరులు రాజకీయాల్లోకి రావాలని, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఒక వ్యాపారం చెడిపోతే ఆ వ్యాపారి మాత్రమే నష్టపోతారు. ఒక వ్యక్తి ఆరోగ్యం చెడిపోతే ఆ శరీరానికి మాత్రమే నష్టం కానీ, రాజకీయాల్లో చెడు వ్యక్తులు, స్వార్థ పరులు, మోసగాళ్లు ఉంటే మాత్రం మొత్తం సమాజమే చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి, ఉన్నత విద్యావంతులు, నిజాయితీపరులు, ప్రజాసేవ పట్ల అంకితభావం గల యువత రాజకీయాల్లోకి రావాలి రాణించాలి అని తపనపడే వారిలో నేనూ ఒకరిని అన్నారు. అందరికి సుపరిచితుడు, మిత్రుడు రాకేష్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరుతూ వీడియో విడుదల చేశారు. ఈ నెల 27 జరిగే ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 3పై గల ఏనుగుల...
కిర్గిస్థాన్ విద్యార్థులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం
Top Stories

కిర్గిస్థాన్ విద్యార్థులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం

కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి వరంగల్ వాయిస్, హైదరాబాద్ : కిర్గిస్థాన్ లో చోటు చేసుకుంటున్న ఘటనలపై భారతీయ విద్యార్థులందరూ క్షేమంగా ఉన్నారని వారిని భారత దేశానికి తిరిగి తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లతో మాట్లాడుతున్నానని, త్వరలోనే స్వదేశానికి వస్తారని జీవీకే ఎడ్యుటెక్ బృందానికి కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం ఇటీవల జరిగిన అల్లర్ల గురించి అడిగి తెలుసుకొని అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దని జీవీకే ఎడ్యుటేక్ డైరెక్టర్ విద్య కుమార్ తెలిపారు. సలహాల కోసం భారత ప్రభుత్వం భారత రాయబార కార్యాలయం హెల్ప్ లైన్ నెంబర్ 0555710041 సంప్రదించగలరని సూచించారు.  ...
జాతీయ రహదారిపై ప్రత్యేక నిఘా
Top Stories

జాతీయ రహదారిపై ప్రత్యేక నిఘా

వరంగల్ వాయిస్, రఘునాథపల్లి : హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారుల గల రఘునాథపల్లి, నిడిగొండ, గోవర్ధనగిరి, కొమ్మల గ్రామాల మధ్యలో ఇటీవల తరచుగా ప్రమాదాలు జరుగుతుండడంతో సిఐ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నేపథ్యంలో జనగామ రూరల్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ యాదవ్ నేపథ్యంలో రఘునాథపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదాల నివారణకై సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. ఇటీవల మొబైల్ టిఫిన్ సెంటర్ వద్ద టిఫిన్ చేస్తున్న ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందడంతో పోలీసులు ప్రత్యేక దృష్టికి కేంద్రీకించారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి తో నిరంతరం తరచుగా వాహనాలను తనిఖీ చేస్తూ పలు పలు సూచనలు చేస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్ తో పాటు వాహనాలకు లైసెన్స్ లేని వారికి జరిమాన విధిస్తూ జైలుకు పంపిస్తున్నారు. లింగాల గణపురం, చిల్పూర్, రఘునాథ పెళ్లి మండలా...
ఎమ్మెల్సీగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించండి
Top Stories

ఎమ్మెల్సీగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించండి

వరంగల్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు రాదారపు శివకుమార్ వరంగల్ వాయిస్, మొగిలిచెర్ల : వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా వరంగల్ జిల్లాలోని, పరకాల నియోజకవర్గం, గీసుకొండ మండలం, గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచర్లలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు బిల్లా రమేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటర్స్, ప్రైవేట్ టీచర్స్, ప్రభుత్వ ఉద్యోగులు, డిగ్రీ అయిపోయి ఎమ్మెల్సీ ఓటు ఉన్న అభ్యర్థుల ఇండ్లకు వెళ్లి ప్రచారం చేశారు. గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు ఎందుకు వేయాలో వివరిస్తూ పాంప్లెంట్ పంచుతూ, డోర్ స్టిక్కర్ వేస్తూ కలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు రాదారపు శివకుమార్ హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్, అలియాస్ తీన్మార్ మల్లన్నకు ఓటు వేసిన, బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి ఓటు వేసిన అవి ము...
పట్టభద్రుల ఆత్మీయ సమావేశం
Top Stories

పట్టభద్రుల ఆత్మీయ సమావేశం

హాజరైన బీజేపీ నేత ఈటల రాజేందర్ వరంగల్ వాయిస్, హనుమకొండ : వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం హనుమకొండ కిషన్ పురలోని వాగ్దేవి కాలేజీలో జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సమావేశంలో బీజేపీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రభారి డా.వి.మురళీధర్ గౌడ్, వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా.పెసరు విజయచందర్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పులి సర్రోత్తం రెడ్డి, వాగ్దేవి సంస్థల అధినేత చందుపట్ల దేవేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు....
హైకోర్టు న్యాయవాది రాపోల్ భాస్కర్ కు పరామర్శ
Top Stories

హైకోర్టు న్యాయవాది రాపోల్ భాస్కర్ కు పరామర్శ

వరంగల్ వాయిస్, హైదరాబాద్ : ప్రముఖ హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ తల్లి రాపోలు రామలక్ష్మమ్మ ఇటీవల మరణించగా విషయం తెలుసుకున్న అసైన్డ్ భూమి సమితి (ఏబీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది కలకోటి మహేందర్ మంగళవారం హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించి సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలకోటి మహేందర్ మాట్లాడుతూ రాపోలు రామలక్ష్మమ్మ అందించిన స్ఫూర్తితోనే ఆమె కుమారుడైన రాపోలు భాస్కర్ రెండు తెలుగు రాష్ట్రాలలో గొప్ప న్యాయవాదిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించి బాధితులకు ఉచితంగా న్యాయ సహాయం, సలహాలు, సూచనలు చేస్తూ తమలాంటి న్యాయవాదులకు ఆదర్శంగా నిలుస్తూ వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నాడని అన్నారు. ఆమె లేని లోటు కుటుంబానికి తీరనిదని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర...