నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
దామెర మండలంలో మూడవ విడత ఏర్పాట్లపై సంతృప్తివరంగల్ వాయిస్, దామెర: హనుమకొండ జిల్లాలో మూడో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించారు. కలెక్టర్ ప్రధానంగా క్లస్టర్లలోని నామినేషన్ల ప్రక్రియను పర్యవేక్షించారు. దామెర, ల్యాదెళ్ల, ఒగులాపూర్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన నామినేషన్లను స్వీకరిస్తున్నారు.ఈ కేంద్రంలో ఒగ్లాపూర్, దమ్మన్నపేట గ్రామ పంచాయతీలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ జరుగుతోంది. సర్పంచ్, వార్డు స్థానాలకు రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను స్వీకరిస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. క్లస్టర్ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన ఎలక్షన్ నోటీస్, రిజర్వేషన్ల జాబితా లను ఆమె పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియ గురించి ఆర్వోలు, ఏఆర్వోలతో మాట్లాడి కలెక్టర్ వి...






