Warangalvoice

Telangana

ఆందోళన కలిగించేలా దేశంలో కరోనా వ్యాప్తి
Telangana, Today_banner

ఆందోళన కలిగించేలా దేశంలో కరోనా వ్యాప్తి

నాలుగు వేలకు పైనే కొత్త కేసులు వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ:దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తోంది. రోజు రోజుకూ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. గత నాలుగు రోజులుగా మూడు వేల కేసులు నమోదవ్వగా.. తాజాగా 24 గంటల వ్యవధిలో ఏకంగా నాలుగు వేలకు పైనే కొత్త కేసులు వెలుగు చూశాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడిరచిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 1,31,086 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా.. 4,435 కొత్త కేసులు బయటపడ్డాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు కొత్త కేసుల్లో 46 శాతం మేర పెరుగుదల కనిపించింది.కాగా, 163 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గతేడాది సెప్టెంబర్‌ 25న 4,777 కేసులు వెలుగు చూశాయి. తాజా కేసులతో దేశంలో కొవిడ్‌ బారిన పడిన వారి సంఖ్య 44,733,719కి చేరింది. ప్రస్తుతం 23,091 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల వ్యవధిలో కరోన...
బండి సంజయ్‌ అరెస్ట్‌పై మండిపడ్డ కిషన్‌ రెడ్డి
Political, Telangana

బండి సంజయ్‌ అరెస్ట్‌పై మండిపడ్డ కిషన్‌ రెడ్డి

ఏ అభియోగం కింద అరెస్ట్‌ చేశారని డిజిపికి ప్రశ్న వరంగల్ వాయిస్,హైదరాబాద్‌:బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అరెస్ట్‌, ఆయనపై నమోదైన కేసులపై తీవ్ర దుమారం రేగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు మిన్నంటుతున్నాయి. మరోవైపు.. యాదాద్రి జిల్లా బొమ్మల రామారం పోలీస్‌ స్టేషన్‌ లో అర్థరాత్రి నుంచి ఉన్న బండి సంజయ్‌ పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద ఆయనపై అభియోగాలు నమోదు చేశారు. బండి సంజయ్‌ కుట్ర చేశారని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బండి సంజయ్‌ పై ఏయే సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారనే వివరాలను మాత్రం పోలీసులు ఇంకా వెల్లడిరచలేదు. దీనిపై గందరగోళం నెలకొంది. బండి సంజయ్‌ పై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌ కు ఫోన్‌ చేసి.. మాట్లాడారు. డీజీపీ సైతం ఫోన్‌లో వివరాలు వెల్లడిరచలేదు. అన్ని వివరాలు తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి...
ప్రభుత్వాన్ని అప్రతిష్ట చేసే కుట్ర
Political, Telangana

ప్రభుత్వాన్ని అప్రతిష్ట చేసే కుట్ర

బండి సంజయ్‌ను బర్తరఫ్‌ చేయాలి మంత్రులు జగదీశ్‌ రెడ్డి, గంగుల డిమాండ్‌ వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: ప్రశ్నపత్రాల లీకేజీలో రాజకీయ అన్నారు. పశ్నాపత్రాల అడ్డంగా దొరికిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని తక్షణమే అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని, పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని మంత్రి జగదీశ్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. తప్పుచేసి అడ్డంగా దొరికినప్పటికీ సంజయ్‌ని ఆ పార్టీ నేతలు వెనకేసుకురావడం సిగ్గుచేటని విమర్శించారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌ రెడ్డి విూడియాతో మాట్లాడారు. పోలీస్‌ స్టేషన్‌లోకి చోచ్చుకెళ్ళి దొంగను రక్షించే చెందంగా బీజేపీ ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పేపర్‌ లీకులతో రాష్ట్రంలో బీజేపీ అరాచకాలు సృష్టిస్తున్నదని ఆరోపించారు.పథకం ప్రకారమే ప్రశ్నపత్రాలను లీక్‌ చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో బీజేపీ క్షుద్రాజకీయ క్రీడకు తెరలేపిందని చెప...
ప్రశ్నపత్రాల లీక్‌.. కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు
Telangana

ప్రశ్నపత్రాల లీక్‌.. కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు

వరంగల్ వాయిస్,హైదరాబాద్: తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నపత్రాలు లీక్‌ చేసి విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో భాజపా నాయకులు చెలగాటమాడుతున్నారని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్టు.. తదనంతర పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ ట్విటర్ ద్వారా స్పందించారు. ‘‘పిచ్చోని చేతిలో రాయి ఉంటే.. వచ్చి పోయేటోళ్లకే ప్రమాదం. కానీ, అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం’’ అని కేటీఆర్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు.  ...
బండి సంజయ్‌ అరెస్ట్‌తో అక్రమాలు కప్పిపుచ్చుకోలేరు
Telangana

బండి సంజయ్‌ అరెస్ట్‌తో అక్రమాలు కప్పిపుచ్చుకోలేరు

కెసిఆర్‌ తీరుపై మండిపడ్డ ఎంపి లక్ష్మణ్‌ వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సజయ్‌ ను అర్ధరాత్రి అకారణంగా, అక్రమంగా అరెస్ట్‌ చేసి ప్రభుత్వం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం విూడియాతో మాట్లాడుతూ… అరచేతిని అడ్డంపెట్టి సూర్యకాంతిని ఆపలేరన్నారు. బండి సంజయ్‌ను అరెస్టు చేసి అవినీతి, అక్రమాలు బయటపడకుండా ఆపలేరన్నారు. అయినా తమ పోరాటం ఆగదన్నారు. గతంలో తీన్మార్‌ మల్లన్న, అంతకు ముందు రఘు.. ఇలా ప్రశ్నించిన జర్నలిస్టులను కూడా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. ఒకవైపు లీకేజీలు, మరోవైపు ప్యాకేజీలు.. ఇది బయటపడకుండా ఉండడం కోసమే బండి సంజయ్‌ను అరెస్ట్‌ చేశారని ఆరోపించారు. 30 లక్షల మంది విద్యార్థుల బతుకులు లీకేజీ కారణంగా ఆగమయ్యాయని తెలిపారు. తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్ళించడం కోసమే బండి సంజయ్‌ను అరెస్ట్‌ చేశారన్నారు. పార్లమెంట్‌ వే...
వరంగల్‌లో హిందీ టెన్త్‌ పేపర్‌ లీక్‌
Telangana

వరంగల్‌లో హిందీ టెన్త్‌ పేపర్‌ లీక్‌

వాట్సాప్‌ గ్రూపుల్లో ఉదయమే ప్రత్యక్షం లీక్‌ కాదని సమర్థించుకున్న డిఇవో లీక్‌ వార్తలపై చర్య తీసుకోవాలని మంత్రి సబిత ఆదేశం వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: తెలంగాణలో క్వశ్చన్‌ పేపర్‌ లీక్స్‌ కలకలం రేపుతున్నాయి. టీఎస్‌పీఎస్‌సీ నుంచి పదో తరగతి పరీక్షల వరకు పేపర్‌ లీక్స్‌ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటిరోజే తెలుగు పేపర్‌ లీక్‌ అయిన విషయం తెలిసిందే. రెండు రోజు మంగళవారం కూడా హిందీ పేపర్‌ లీక్‌ అవ్వడం పెను సంచలనానికి దారితీసింది. హిందీపేపర్‌ లీక్‌తో తెలంగాణ పదోతరగతి పరీక్షలు రెండోరోజూ వార్తల్లోకి వచ్చాయి. తొలిరోజు వికారాబాద్‌ జిల్లా తాండూరులో తెలుగు పేపర్‌ లీక్‌ అవ్వగా.. మంగళవారం వరంగల్‌ జిల్లాలో హిందీ పేపర్‌ లీక్‌ అయింది. హిందీ క్వశ్చన్‌ పేపర్‌ ఉదయం 9.30కే బయటకు వచ్చినట్లు వరంగల్‌ అధికారులు గుర్తించారు. పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే హిందీ ...
ధాన్యం కొనుగోళ్లలో వెనకడుగు లేదు
Telangana

ధాన్యం కొనుగోళ్లలో వెనకడుగు లేదు

కేంద్రం సహకరించకున్నా ముందుకే పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్‌ వరంగల్ వాయిస్,కరీంనగర్‌: వరి ధాన్యం కొనుగోలు విషయంలో సిఎం కెసిఆర్‌ తీసుకున్న నిర్ణయం వల్లనే రైతులకు మేలు జరుగుతోందని పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కేంద్రం మొండికేసినా రాష్ట్రంలో చివరిగింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నామని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో మోదీ ప్రభుత్వాన్ని వదిలేదని లేదని రాష్ట్రమంత్రి పేర్కొన్నారు. కేంద్రం వైఖరి తెలిసే వరి సాగు చేయొద్దని సీఎం కేసీఆర్‌ ముందే రైతులకు సూచించారన్నారు. వరి వేయాలని బీజేపీ నేతలు రైతులను రెచ్చగొట్టారన్నారు. వరి కొనిపిస్తామన్న బీజేపీ నేతలు ఇప్పుడు కనిపించడం లేదని విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేసేంత వరకు విడిచిపెట్టలేదన్నారు. యాసంగి ధాన్యాన్ని నేరుగా కేంద్రమే కొనుగోలు చేయాలని అన్నారు. కేంద్రం ధాన్యం కొనకపోయినా గత కొన్నేళ్లుగా తామే కొనుగోలు చేస్తున్నామని అన్నారు. కేంద్రం...
కూల్‌రూఫ్‌ పాలసీతో తగ్గనున్న విద్యుత్‌ ఛార్జీలు
Telangana

కూల్‌రూఫ్‌ పాలసీతో తగ్గనున్న విద్యుత్‌ ఛార్జీలు

భవనాలకు కూల్‌రూఫ్‌తో మంచి ప్రయోజనాలు ప్రజల్లో విస్తృతంతగా ప్రచారం చేయాలి కూల్‌రూఫ్‌ పాలసీ విడుదల సందర్భంగా కెటిఆర్‌ వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కూల్‌ రూఫ్‌ పాలసీని తీసుకొస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇది భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడే కార్యక్రమమని చెప్పారు. ఇంటితోపాటు, గోడలను కూల్‌రూఫ్‌ ఉంచుకుంటే విద్యుత్‌ వినియోగం కూడా తగ్గుతుందన్నారు. మొదట తమ ఇంటిపై కూల్‌ రూఫ్‌ విధానం అమలుచేశామన్నారు. హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌ సీడీఎంఏ ఆఫీస్‌లో కూల్‌రూఫ్‌ విధానంపై ఆయన మాట్లాడారు. భవన యజమానులు ఎండవేడిమిని తగ్గించుకొనేందుకు సహజ విధానాలు పాటించేలా రూపొందించిన తెలంగాణ కూల్‌రూఫ్‌ పాలసీ 2023`28ని మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశం మొత్తంలోనే హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌కు డిమాండ్‌ ఉందని చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలు దేశంలో ఎక్కడా లేవని స్పష్టం చేశారు. ...
తెలుగు రాష్టాల్ల్రో టెన్త్‌ పరీక్షలు ప్రారంభం
Telangana

తెలుగు రాష్టాల్ల్రో టెన్త్‌ పరీక్షలు ప్రారంభం

టెన్త పరీక్షా కేంద్రాలవద్ద కోలాహలం వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: తెలుగు రాష్టాల్ల్రో పదో తరగతి పరీక్షలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తెలంగాణ లో ఉదయం 9:30 గంటల నుంచి 12:30 గంటల వరకు పరీక్ష జరుగనుంది. ఆరు పేపర్లతోనే టెన్త్‌ పరీక్షలను ఎస్‌ఎస్‌స్సీ బోర్డు నిర్వహించనుంది. ఏప్రిల్‌ 3 నుండి 13 వరకు పరీక్షలు జరుగనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని తెలంగాణ విద్యా శాఖ ప్రకటించింది. ఉదయం 9:35 గంటల వరకు విద్యార్థులను అధికారులు పరీక్షా కేంద్రంలోకి అనమతించారు. పదో తరగతి పరీక్షల కోసం మొత్తం 2652 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో 4.94 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొత్తం విద్యార్థుల్లో అబ్బాయిలు 2,43,852, అమ్మాయిలు 2,41,974 ఉన్నారు. అలాగే 3,78,794 మంది విద్యార్థులు ఇంగ్లీష్‌ విూడియంలో పరీక్ష రాయనుండగా.. 98,726 మంది విద్యార్థులు తెలుగు విూడియంలో పరీక్ష ర...
Telangana

తెలంగాణలో అప్పుడే ఎన్నికల వేడి

అధికార పార్టీకి సవాల్‌ విసిరేలా నేతల దూకుడు ఎదురుదాడి ప్రచారం లో ముందున్న బిఆర్‌ఎస్‌ కెసిఆర్‌పై నియంత పాలన అంటూ విమర్శలు వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: తెలంగాణలో సాధారణ ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం ఉంది. కానీ రాజకీయ పార్టీలు అన్నీ అప్పుడే ప్రచారంలోకి దిగాయా అన్న సందేహం వస్తోంది. అధికార బిఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ బిజెపిలు కత్తులు నూరుతున్నాయి. అయితే వీరికన్నా ముందే బిఆర్‌ఎస్‌ బిజెపిని ఎండగడుతూ సిలిండర్‌ను చూపుతూ ప్రచారం చేస్తోంది. ప్రధానంగా గ్యాస్‌, పెట్రో ధరలనే హైలెట్‌ చేస్తోంది. కులాల వారీగా, వర్గాలవారీగా, వృత్తుల వారీగా, సంఘాల వారీగా సమావేశాలు నిర్వహించి ఆకట్టుకుంటున్నారు. పతకాల్లో ప్రభుత్వం జోరు పెంచింది. ఆత్మీయ సమ్మేళనాలు జోరుగా సాగుతున్నాయి. ప్రజలంతా బిఆర్‌ఎస్‌ వెంటే ఉన్నారంటూ ప్రచారం చేస్తున్నారు. మంత్రులు,ఎమ్‌ఎల్యేలు, ఇతర నేతలు అంతా నియోజకవర్గాల్లోనే మకాం వేసి ...