సెప్టెంబర్17 ముమ్మాటికీ తెలంగాణ విలీన దినమే
సీనియర్ జర్నలిస్టు, హనుమకొండ : తెలంగాణలో నైజాం విముక్తి కోసం జరిగిన పోరాటానికి గుర్తుగాసెప్టెంబర్ 17ను ముమ్మాటికీ విలీన దినోత్సవంగానే గుర్తించాలి. నిజాం రాజుతో పాటు ఆయన సంస్థానంలోని భూస్వాములకు వ్యతిరేకంగా హిందూ, ముస్లింలు ఐక్యంగా పోరాటాలు చేశారు. కానీ బీజేపీ నేతలు హైదరాబాద్ సంస్థానంలోని విముక్తి పోరాటాన్ని ముస్లింలకు వ్యతిరేకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే సెప్టెంబర్17పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షోయబుల్లాఖాన్ ముస్లిం అయినప్పటికీ రజాకార్లు ఆయన చేతులు నరికారు. వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని మతపరమైన కోణంలో ఎలా చూస్తాం. సాయుధ రైతాంగ పోరాటం విజయవంతమయ్యే దశకు చేరుకున్నంక ‘‘చుట్టుముట్టూ సూర్యాపేట.. నట్టనడుమ నల్లగొండ.. గోల్కొండ ఖిల్లా కింద నీ ఘోరీ కడుతం కొడుకో.. నైజాం సర్కరోడా’’ అని తెలంగాణ ప్రజలు పాటలు పాడుకునే వారు. నిజాంకు ప్రజలు ఘోరీ కట్టేందుకు సిద్ధమైన తర్...








