Warangalvoice

Telangana

నిత్యావసర సరుకుల పంపిణీ
Bhupalapally, District News, Telangana

నిత్యావసర సరుకుల పంపిణీ

వరంగల్ వాయిస్, వెంకటాపురం నూగూరు : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని టేకుల బోరు అనే ఆదివాసి గ్రామాల్లో గత వారం రోజుల క్రితం వచ్చిన గోదావరి వరదల వల్ల ఊరు మొత్తం మునిగిపోయింది. తదనంతరం అక్కడ ఆదివాసి కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని శుక్రవారం అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పీర్ల కృష్ణబాబు ఆధ్వర్యంలో గ్రామంలో 55 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 కేజీల బియ్యం, కేజీ నూనె, కేజీ ఉల్లిగడ్డ, కేజీ ఆలుగడ్డ, కేజీ పప్పు తదితర నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్బంగా కృష్ణబాబు మాట్లాడుతూ వరదల వల్ల సర్వం కోల్పొయిన వీరికి స్వచ్ఛందంగా కొంతమంది మానవతవాదులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి సహాయం అందించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇల్లు పోయినవారికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని, తక్షణ సాయం కింద కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన పదివేల రూపాయలు త్వరగా అందించాలని కోరారు. ఈ కార్యక్...
మరోమారు టీచర్ల ఆందోళన
Telangana

మరోమారు టీచర్ల ఆందోళన

జివో 317తో టీచర్లకు నష్టం అంటూ నిరసనవిద్యాశాఖ కమిషనరేట్‌ ముట్టడికి యత్నం వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : టీచర్ల సమస్యలపై ఉపాధ్యాయ సంఘాల నేతలు మరోసారి ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్‌లోని విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయం ముట్టడికి యత్నించారు. తక్షణమే బదిలీలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. వారిని పోలీసులు అడ్డుకోగా.. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి.. స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ.. ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన నేతలు, ఉపాధ్యాయులు.. కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఆందోళనకారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. వారిని అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా 317 జీవో కారణంగా టీచర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఉపాధ్యాయ...
జలకళ సంతరించుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు
Telangana

జలకళ సంతరించుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు

మేడిగడ్డ బ్యారేజి 24 గేట్లు ఎత్తి నీటి విడుదలరాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు వరంగల్ వాయిస్, జయశంకర్‌భూపాలపల్లి : జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మేడిగడ్డ బ్యారేజి 24 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు.. పరవళ్లు తొక్కుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి బ్యారేజీలకు వరద తాకిడి పెరిగింది. మేడిగడ్డ బ్యారేజీలో 24 గేట్లు ఎత్తి… నీటిని భారీగా దిగువకు పంపిస్తున్నారు.మేడిగడ్డ బ్యారేజీకి 60వేల530 క్యూసెక్కుల ప్రవాహం రాగా… 24 గేట్లు తెరిచి 62వేల 940 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మేడిగడ్డలో 9.8 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు… పరవళ్లు తొక్కుతున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభా...