Warangalvoice

Telangana

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి
Mulugu, Telangana

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి

మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక అయిదు దశల్లో 99 రోజుల యాక్షన్ ప్లాన్ ఏప్రిల్ 2న గ్రామ స్థాయిలో గ్రామ సభల నిర్వహణ ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమం మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమం మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమం జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. వరంగల్ వాయిస్, ములుగు:  మార్చి 6వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు. బుధవారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాపాలన... ప్రగతి ప్రణాళికలు కార్యాచరణ అమలుపై రెవెన్యూ, పంచాయతీరాజ్, ప్రణాళిక, ఇరిగేషన్, హోం, రవాణా, వ్యవసాయం, ఉద్యానవన, విద్య, వైద్య, మహిళా శిశు సంక్షేమ, హౌసింగ్, తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అయిద...
మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలి
Political, Telangana, Warangal_TriCites

మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలి

🔴 కేంద్ర మంత్రికి సీఎం రేవంత్, ఎంపీ కావ్య విజ్ఞప్తివరంగల్ వాయిస్, ఢిల్లీ: తెలంగాణలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ అభివృద్ధిలో కీలకం కానున్న మామునూరు విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో కలిసి ఆమె కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడును పార్లమెంట్‌లోని ఆయన ఛాంబర్‌లో కలిశారు. మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని, కాబట్టి వెంటనే పనులు ప్రారంభించాలని ఎంపీ కడియం కావ్య కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు పలు కీలక అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మామునూరు ఎయిర్‌పోర్ట్‌లో విమాన ప్రయాణాలతో పాటు కార్గో (సరుకు రవాణా) సేవలు, మెయింటెనెన్స్, ఓవర్ హాల్ రిపేర్ సదుపాయాలు ఉండేలా చూడాలని కోరారు. వరంగల్ నగర...
ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలను నిర్వహించిన మంత్రి సీతక్క..
Telangana

ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలను నిర్వహించిన మంత్రి సీతక్క..

సీతక్క కు కృతజ్ఞతలు తెలియజేసిన ప్రముఖులు వరంగల్ వాయిస్,హైదరాబాద్ : రాఖీ పౌర్ణమి  పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క శనివారం రాఖీ పండుగను రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఘనంగా జరిపారు. సోదర సోదరీమణుల అనుబంధాన్ని ప్రతిబింబించే ఈ పండుగ సందర్భంగా సీతక్క స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హైదరాబాదులో అందుబాటులో ఉన్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు, నేతల నివాసాలను సందర్శించారు. ప్రతి ఒక్కరి చేతికి రాఖీ కట్టి, స్వీట్లు తినిపించి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్బంగా నాయకులు రాఖీ కట్టించుకుంటూ సీతక్క ను సొంత సోదరిగా భావించి “సోదరి సీతక్క” అంటూ ఆత్మీయంగా పలకరించి, ఆశీర్వాదాలు ...
సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ
Telangana

సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ

వరంగల్ వాయిస్,హైదరాబాద్ :రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని  రాష్ట్ర అటవీ,పర్యావరణ,దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రాఖీ కట్టారు.ఈ సందర్బంగా మంత్రి కొండా సురేఖ తనకు సొంత సోదరి లాగా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  తన ఆప్యాయతను వ్యక్తం చేశారు.అన్న చెల్లెళ్ల,అక్క తమ్ముళ్ళ అనుబంధాన్ని చాటే రాఖీ పండుగ ప్రతి ఒక్కరు ఆనందోత్సావాల నడుమ జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు....
Seetakka-మహిళా సాధికారతే లక్ష్యం
Mulugu, Telangana

Seetakka-మహిళా సాధికారతే లక్ష్యం

పలు వ్యాపారుల్లో వారి భాగస్వామ్యం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వరంగల్ వాయిస్, ములుగు : మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ రూపొందించిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు. గురువారం జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్ లో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సెర్ఫ్ అదనపు సీఈఓ పి.కట్యాయని దేవి, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్., ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవి చందర్ లతో కలిసి మంత్రి సీతక్క ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వడ్డీ లేని రుణాల చెక్కులు, లోన్ బీమా, ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇందిరమ్మ కళలను నెరవేర్చడానికి కాంగ్రెస్ సర్కార్ పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. మహిళల జీవితాల్లో వ...
TG Cabinet | ఈ నెల 6న తెలంగాణ కేబినెట్ భేటీ
Telangana

TG Cabinet | ఈ నెల 6న తెలంగాణ కేబినెట్ భేటీ

TG Cabinet | ఈ నెల 6వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ జ‌ర‌గ‌నుంది. గురువారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : ఈ నెల 6వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ జ‌ర‌గ‌నుంది. గురువారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశానికి మంత్రులు, ప‌లువురు అధికారులు హాజ‌రుకానున్నారు. ఈ స‌మావేశంలో బీసీ రిజ‌ర్వేష‌న్లు, ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌పై నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. బ‌డ్జెట్ స‌మావేశాల‌పై కూడా చ‌ర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం....
రాజకీయ యుద్ధభేరి సభను సక్సెస్ చేయాలి
District News, Hanamkonda, Telangana, Warangal

రాజకీయ యుద్ధభేరి సభను సక్సెస్ చేయాలి

యుద్ధభేరి పోస్టర్ ఆవిష్కరణ వరంగల్ వాయిస్, హనుమకొండ : వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఫిబ్రవరి 2న నిర్వహించే బీసీ రాజకీయ యుద్ధ భేరి సభకు ముదిరాజులు మద్దతు తెలుపుతూ గురువారం హనుమకొండలోని హంటర్ రోడ్ లోని ముదిరాజ్ అర్బన్ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, భయ్యా స్వామి, పులి రజనీకాంత్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ముదిరాజ్ కులస్తులతో బీసీ రాజకీయ యుద్ధభేరి సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా, ముదిరాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లే బోయిన అశోక్ ముదిరాజ్, బీసీ నేత, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి, మాజీ కూడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజుయాదవ్ హజరయ్యారు. ఈ సందర్భంగా ముదిరాజ్ రాష్ట్ర కార్యదర్శి పల్లె బోయిన అశోక్ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులకు అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉన్న కులం ముదిరాజు కులం అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నట...
బీజేపీ దామెర మండల నూతన అధ్యక్షుడిగా వేల్పుల రాజ్ కుమార్
District News, Hanamkonda, Telangana, Warangal

బీజేపీ దామెర మండల నూతన అధ్యక్షుడిగా వేల్పుల రాజ్ కుమార్

వరంగల్ వాయిస్, దామెర : భారతీయ జనతా పార్టీ దామెర మండలం నూతన అధ్యక్షుడిగా దామెర గ్రామానికి చెందిన వేల్పుల రాజ్ కుమార్ నియామకమయ్యారు. గత 15 సంవత్సరాలుగా పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని వివిధ హోదాలలో ఉమ్మడి జిల్లా యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా, గత స్థానిక ఎన్నికలో బీజేపీ జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం దామెర వార్డు మెంబర్ గా, మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేసిన సేవలను గుర్తించి దామెర మండల పార్టీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఈ నియామకానికి సహకరించిన జిల్లా ఎన్నికల అధికారి పెద్దోళ్ల గంగారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, పరకాల కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయ చందర్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు మందు ఐలయ్య, కన్నబోయిన రాజయ్య యాదవ్, జిల్లా బీజేపీ నాయకులు గురుజాల శ్రీరామ్ ...
“ఆరోగ్యదర్శి”ని వార్షికోత్సవ సంచిక ఆవిష్కరణ
District News, Hanamkonda, Telangana

“ఆరోగ్యదర్శి”ని వార్షికోత్సవ సంచిక ఆవిష్కరణ

వరంగల్ వాయిస్, హనుమకొండ : ఆరోగ్యదర్శిని 10వ వార్షికోత్సవ సంచికను, నూతన సంవత్సర క్యాలెండర్ ను హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియంలో తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , సీనియర్ జర్నలిస్ట్ , వరంగల్ ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి బుధవారం ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రముఖ హోమియో వైద్యుడు డాక్టర్ పావుశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో ఆరోగ్యదర్శిని పక్షపత్రిక పదేళ్లుగా నిర్విరామంగా వెలువరించడం అభినందనీయమన్నారు. అలాగే ఉచిత హోమియో క్యాంపులు నిర్వర్తిస్తూ ప్రజలకు హోమియోపతిపై అవగాహన కల్పించడంలో విశేష కృషి చేస్తున్నారన్నారు. ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం గడ్డం కేశవమూర్తి మాట్లాడుతూ ఒకవైపు వైద్యం చేస్తూనే మరొకవైపు ఆరోగ్య దర్షిని పక్షపత...
బీసీల సంక్షేమానికి పోరాడుదాం
Political, Telangana

బీసీల సంక్షేమానికి పోరాడుదాం

మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి వరంగల్ వాయిస్, హైదరాబాద్ : మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్ లో బీఆర్ఎస్ బీసీ ప్రతినిధుల బృందం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. వెనుకబడిన కులాలకు అన్ని రంగాలలో అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యల గురించి బీఆర్ఎస్ పార్టీ బీసీ ప్రజా ప్రతినిధులు వారి అభిప్రాయాలను పంచుకున్నారు. కేంద్ర ప్రభుత్వంలో వెనుకబడిన కులాల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం విచారకరమన్నారు. తమిళనాడు పర్యటన సందర్బంగా ఇటీవల పరిశీలించిన అంశాలను గురించి చర్చించారు. చట్టసభలలో బీసీలకు 33శాతం, స్థానిక సంస్థల ఎన్నికలలో 42శాతం రిజర్వేషన్స్ అమలయ్యే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మరింత ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు...