భాజాపాలోకి నవనాయకుడు
సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఉవ్వీళ్లు
గ్రామాల్లో పర్యటిస్తూ యువకుల్లో చైతన్యం నింపుతున్న నేత
త్వరలో పార్టీలో చేరేందుకు రంగం సిద్దం
వరంగల్ వాయిస్, డోర్నకల్ : డోర్నకల్ బీజేపీలో మరో ముఖచిత్రం ఆవిషృతం కాబోతోంది. డోర్నకల్ మండలం చాంప్లతండా గ్రామ పంచాయతీలోని ధరావత్ తండాకు చెందిన విద్యావంతుడు, వ్యాపార వేత, నవ యువ నాయకుడు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దేశ ప్రధాని మోదీ చేపడుతున్న సంస్కరణలు, హిందుత్వ భావజాలంతో భాజపాలో చేరేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. జూలై నెల చివరిలో కాని వచ్చే నెల మొదటి వారంలోకాని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు రాంచందర్ సమక్షంలో ఆ పార్టీలో చేరేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. డోర్నకల్ నియోజకవర్గం ఎమ్మేల్యే స్థానాన్ని భాజాపా అభ్యర్దితో భర్తీ చేయడమే లక్ష్యంగా పార్టీని సంస్దగతంగా బలోపేతం చేసేందుకు సదరు యువకుడు కాషాయం పార్టీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప...









