మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలి
🔴 కేంద్ర మంత్రికి సీఎం రేవంత్, ఎంపీ కావ్య విజ్ఞప్తివరంగల్ వాయిస్, ఢిల్లీ: తెలంగాణలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ అభివృద్ధిలో కీలకం కానున్న మామునూరు విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో కలిసి ఆమె కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడును పార్లమెంట్‌లోని ఆయన ఛాంబర్‌లో కలిశారు. మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని, కాబట్టి వెంటనే పనులు ప్రారంభించాలని ఎంపీ కడియం కావ్య కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు పలు కీలక అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మామునూరు ఎయిర్‌పోర్ట్‌లో విమాన ప్రయాణాలతో పాటు కార్గో (సరుకు రవాణా) సేవలు, మెయింటెనెన్స్, ఓవర్ హాల్ రిపేర్ సదుపాయాలు ఉండేలా చూడాలని కోరారు. వరంగల్ నగర...









