Warangalvoice

Hanamkonda

తీన్మార్ మల్లన్నకు భారీ మెజార్టీ ఖాయం
Hanamkonda

తీన్మార్ మల్లన్నకు భారీ మెజార్టీ ఖాయం

డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ వరంగల్ వాయిస్, హనుమకొండ : కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ వెస్ట్ నియోజకవర్గ సమావేశం, హనుమకొండ ప్రెస్ క్లబ్ సమావేశానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న హాజరు కాగా, హనుమకొండ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. రామకృష్ణ గారు మాట్లాడుతూ వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లలో తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్క పట్టభద్రులకు డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే పద్ధతిలో చెప్పాలన్నారు. బ్యాలెట్ బాక్స్ లో రెండో నెంబర్ కాంగ్రెస్ పార్టీ పేరు ఉంటుందని, మల్లన్న పేరు ఉంటుందని, చెయ్యి గుర్తు ఉండదు కాబట్టి, అక్కడ ఒకటో నెంబర్ ను రాయాలని చెప్పాల...
హామీలు అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Hanamkonda

హామీలు అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

వరంగల్ వాయిస్, హనుమకొండ : భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని న్యాయవాదుల సంఘం గ్రాడ్యుయేట్స్ కు విజ్ఞప్తి చేస్తుందని న్యాయవాదుల సంఘం రాష్ట్ర నాయకులు, భారత రాష్ట్ర సమితి, రాష్ట్ర సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, బీఆర్ఎస్ లీగల్ సేల్ అధ్యక్షుడు గుర్రాల వినోద్ కుమార్, జనరల్ సెక్రెటరీ శివరాజ్ కుమార్ ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 34 నియోజకవర్గాల్లో పట్టభద్రులు ఆచితూచి ఎంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఆరు నెలలలో ప్రజల వ్యతిరేకతను చూరగొందని ఈ సందర్భంగా తెలిపారు. రేవంత్ ప్రభుత్వంలో అందరికీ అన్యాయం జరుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో కేంద్ర పార్టీలైన కాంగ్రెస్ ప...
కమ్యూనిస్టుల మార్గదర్శకుడు గిరి ప్రసాద్ ఆశయాలను కొనసాగిద్దాం
Hanamkonda

కమ్యూనిస్టుల మార్గదర్శకుడు గిరి ప్రసాద్ ఆశయాలను కొనసాగిద్దాం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కళ్లపల్లి వరంగల్ వాయిస్, హనుమకొండ : కమ్యూనిస్టుల మార్గదర్శకులు నల్లమల గిరి ప్రసాద్ ఆశయాలను కొనసాగిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు అన్నారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో గిరి ప్రసాద్ 27వ వర్ధంతిని సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గిరి ప్రసాద్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం తక్కళ్లపల్లి శ్రీనివాస రావు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో దళ నాయకులుగా పనిచేసిన గిరి ప్రసాద్ గిరిజనులను సమీకరించి జమీందార్లు, రజాకార్లు, రజాకార్ల స్వాధీనంలో ఉన్న వేలాది ఎకరాల భూమిని పేదలకు పంచారన్నారు. అనేక కేసులను, నిర్భందాలను ఎదుర్కొని జైలు జీవితం అనుభవించిన గిరి ప్రసాద్ భారత కమ్యూనిస్టు పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారని తెలిపారు....
గ్యాస్ భద్రత చర్యలపై అవగాహన
Hanamkonda

గ్యాస్ భద్రత చర్యలపై అవగాహన

వరంగల్ వాయిస్, హనుమకొండ : ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తమ వంట గ్యాస్ వాడకం దారులకు ప్రాథమిక భద్రతలో భాగంగా ఇంటింటికి తమ డెలివరీ సిబ్బంది సందర్శించి వాడకం దారులు వినియోగిస్తున్న ఇండేన్ గ్యాస్ పనితీరును‌ గమనించి‌ తొమ్మిది ఆంశాలతో కూడిన ప్రశ్నావళిని డెలివరి బాయ్ ఆప్ ద్వారా ఆయిల్ కంపెనీకి‌ అనుసందానం చేస్తారని ఉమ్మడి ఆంద్రప్రదేశ్ డీలర్ల పూర్వ ప్రధాన కార్యదర్శి పీవీ.మదన్ మోహన్ తెలిపారు. ఇటీవల జరిగిన గ్యాస్ ప్రమాదాలు పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లోఅవగాహన లోపంతో జరిగాయని వచ్చిన నివేదిక ఆధారంగా అన్ని ఆయిల్ కంపెనీలు తమ వద్ద నమోదైన గ్యాస్ వాడకం దారులకు ప్రాథమిక భద్రతా చర్యలు చేపట్టాలని‌ నిర్ణయించాయని అన్నారు. గ్యాస్ లీకేజి వాసన గుర్తిస్తే 1906 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేయాలని సూచించారు. సురక్ష రబ్బరు ట్యూబ్ ఇటాలియన్ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశారని, దాని కాలపరిమితి ఐదు సంవత్సరాలు, తయారీ తే...
ఏనుగుల రాకేష్ రెడ్డికి మద్దతుగా నిలబడండి
Hanamkonda

ఏనుగుల రాకేష్ రెడ్డికి మద్దతుగా నిలబడండి

వీడియో విడుదల చేసిన రెడ్ బస్ సీఈఓ ఫణీంద్ర సామ వరంగల్ వాయిస్, హనుమకొండ : ఏనుగుల రాకేష్ రెడ్డికి మద్దతుగా నిలబడండని రెడ్ బస్ సీఈఓ ఫణీంద్ర సామ పట్టభద్రులను కోరారు. గురువారం ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఓ వీడియో విడుదల చేశారు. రాకేష్ బిట్స్ పిలానీలో తన జూనియర్ అని, బిట్స్ పిలాని రోజుల్లో రాకేష్ రెడ్డి ఆల్రౌండర్, చదువులతో పాటు, విద్యార్థి నాయకుడిగా ప్రధాన కార్యదర్శిగా పని చేశారని వెల్లడించారు. నిర్మాణ్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని తెలిపారు. దేశం మారుతున్న క్రమంలో ఉన్నత విద్యావంతులు రాజకీయాల్లో అవసరమని గుర్తు చేశారు. జీవితంలో అన్ని పరిస్థితులను ఎదుర్కొన్న రాకేష్ రెడ్డి లాంటివాళ్ళు గెలిస్తే బాగుంటుందని సూచించారు. దేశానికి ఏదైనా చెయ్యాలనుకునే వారు రాకేష్ లాంటి మంచి నాయకుడిని ఎన్నుకోండి చాలు అని కోరారు. ప్రజలు రాకేష్ లాంటి ఉన్నత విద్...
వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
Hanamkonda

వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

వరంగల్ వాయిస్, దామెర : దామెర మండలం ల్యాదళ్ల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి-సుధేష్ణ దంపతులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పిట్టల రమేష్ దంపతులు, రామంచి నిరంజన్ రాధిక, రాజనందం-హైమ, గునుగంటి రమేష్ దంపతులు, కొలనుపాక సుధాకర్ దంపతులు, గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు.  ...
శ్రీ మత్స్యగిరి దేవాలయంలో జీఎస్సాఆర్ ప్రత్యేక పూజలు
Hanamkonda

శ్రీ మత్స్యగిరి దేవాలయంలో జీఎస్సాఆర్ ప్రత్యేక పూజలు

వరంగల్ వాయిస్, శాయంపేట : మండల కేంద్రంలోనీ శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో గురువారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే జీఎస్సార్ కు ఆలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచార్యులు, చైర్మన్ సామల భిక్షపతి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో పూజలు చేశారు. మండల కేంద్రానికి చెందిన జెన్న కృపాకర్ రెడ్డి ఆలయానికి గోవిందరాజస్వామి వారి ఏనుగు రథాన్ని బహూకరించగా, ఆ రథాన్ని ఎమ్మెల్యే జీఎస్సార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, మండల అధికార ప్రతినిధి చిందం రవి, మాజీ ఎంపీటీసీ కొమ్ముల భాస్కర్ వై నాలా కుమారస్వామి, జిన్నా ప్రతాప్ సేనా రెడ్డి, దుబాసి కృష్ణమూర్తి, మోత్కూరి భాస్కర్, వలుపదాసు రాము, మాదిరెడ్డి ప్రపంచరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.  ...
తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించుకుందాం
Hanamkonda

తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించుకుందాం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వరంగల్ వాయిస్, శాయంపేట : ప్రజల తరుఫున ప్రశ్నించే వ్యక్తి తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించుకుందామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం శాయంపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల తరుఫున ప్రశ్నించే వ్యక్తి తీన్మార్ అని అన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి అత్యధిక మెజారిటీతో మల్లన్నను గెలిపించుకుందామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కోరారు. తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ప్రతీ ఒక్కరూ కష్టపడాలని సూచించారు. జీవో నంబర్ 46, 317 ఇతర ఉద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ కేబినెట్ సబ్ కమిటీ వేసి పరిష్కరిస్తుందన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప...
నేడు అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవం
Hanamkonda

నేడు అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవం

వరంగల్ వాయిస్, హనుమకొండ : ఈ భూమిపై ఉన్న సమస్త జీవరాసులను, వృక్ష సంపదను, జల వనరులను, ప్రకృతిని సంరక్షించి కాపాడుకోవడం రాబోవు తరాల వారికి మన అందించే విలువైన బహుమతి అని, వీటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ప్రముఖ సామాజికవేత్త, వన సేవ సభ్యుడు నిమ్మల శ్రీనివాస్ అన్నారు. "అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవం "సందర్భంగా బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ధరిత్రిపై ఉండే జీవరాశుల వలన జీవ సమతుల్యం ఏర్పడుతుందని, వీటిలో ఏ జీవి మనుగడకైనా నష్టం వాటిల్లితే అది మిగిలిన జీవరాశులపై ప్రభావం చూపి జీవవైవిద్యానికి విఘాతం కలిగిస్తుందని అన్నారు. పిల్లలకు పాఠశాల స్థాయి నుంచే ఈ విషయాలపై ఆసక్తి పెంచడానికి వారి పాఠ్యాంశాలలో భాగంగా "ఎన్విరాన్ మెంటల్ సైన్స్"(ఈవీఎస్) అనే సబ్జెక్టును ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఉపాధ్యాయులు కూడా చిన్నారులకు విషయాలను బోధించి వారిని ప్రకృతి ప్రేమికులుగా మార్చాలని ఆయన కోరార...
ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
Hanamkonda

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

21 ఏళ్ల తర్వాత అపూర్వ కలయిక చిన్ననాటి సంగతులను పంచుకున్న 2002-03 బ్యాచ్ ఒకరి ఒకరం.. ఆపదలో అందరం అంటూ బాసలు వరంగల్ వాయిస్, హనుమకొండ : ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము.. చదువులమ్మ చెట్టు నీడలో అంటూ కలిసిమెలసి గడిపిన తమ బాల్య స్మృతులను 21 ఏళ్ల తర్వాత కలిసిన జడ్పీహెచ్ఎస్ 2002-03 బ్యాచ్ విద్యార్థులు గుర్తు చేసుకున్నారు. సంతోషంలో దుఖంలో అంతా ఒక్కటై ఒకరికి..ఒకరం తొడుంటామని ఉమ్మడిగా భరోసాను కల్పించుకున్నారు. ఇదంతా ఈనెల 19న కమలాపూర్ జడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2002-03 బ్యాచ్ గర్ల్స్ అండ్ బాయ్స్ కార్యక్రమంలో విద్యార్థులు తమ చిన్ననాటి సంగతులను గుర్తుకు చేసుకుంటూ చేసుకున్న బాసలు. చిన్ననాటి మిత్రులంతా 21 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో వారి సంతోషం అంబరాన్నింటింది. అలాగే తమకు విద్యాదానం చేసిన గురువులను ఆహ్వానించి సత్కారాలు, బహుమతులు ప్రదానం చేసి వారిని ఘనంగా సన్మానించ...