వెలుగుల మేడారంగా తీర్చిదిద్దాం
🎯 విద్యుత్ శాఖ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి🎯 జాతరలో అత్యుత్తమ పనితీరు..🎯 సిబ్బందికి ప్రశంసా పత్రాల అందజేత🎯 గోదావరి పుష్కరాలకు కూడా సిద్ధం 🎯 హనుమకొండలో 'విద్యుత్ విజయోత్సవం'వరంగల్ వాయిస్, హనుమకొండ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో అన్ని శాఖల కంటే విద్యుత్ శాఖ అత్యుత్తమ పనితీరు కనబరిచిందని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి సగర్వంగా ప్రకటించారు. శనివారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన 'మేడారం జాతర విద్యుత్ విజయోత్సవ' కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కోట్లాది మంది భక్తులకు కన్నుల విందుగా, ఎక్కడా అంతరాయం లేకుండా వెలుగుల మేడారాన్ని అందించామని సీఎండీ కొనియాడారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలగకుండా తొలిసారిగా 33 కేవీ లైన్లలో కవర్ కండక్టర్లను వాడామని, భవిష్యత్తులో అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థను మరింత విస్తరి...









