Konda Sureka | స్త్రీజాతి విముక్తి కోసం పోరాడి ధీరవనిత.. సావిత్రీబాయి ఫూలే
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
స్వగృహంలో పుష్పాంజలి ఘటించిన మంత్రి
వరంగల్ వాయిస్, వరంగల్ : మహిళా సాధికారతకు పర్యాయపదం సావిత్రీబాయి ఫూలే అని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సావిత్రీబాయి ఫూలే 194వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని తన నివాసంలో మంత్రి కొండా సురేఖ పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. మహిళలపై తీవ్ర అణచివేత, వివక్ష కొనసాగుతున్న ఆ కాలంలోనే మహిళల విద్య కోసం, స్త్రీజాతి విముక్తి కోసం పోరాడి ధీరవనితగా ఫూలే అని కొనిడాయాడారు. అనాథ పిల్లలు, స్త్రీలకు శరణాలయాలు, ఆశ్రమాలు నెలకొల్పడంతో పాటు సాంఘిక దురాచారాల నిర్మూలనకు, సమాజ ఉద్ధరణకు తన జీవితాన్ని అర్పించిన త్యాగశీలిగా ఈ ప్రపంచం సావిత్రీబాయి ఫూలేని గుండెల్లో పెట్టుకుంటుందన్నారు. మహిళలకు స్వేచ్ఛ లభిస్తే ఈ ప్రపంచానికి బానిసత్వం నుంచి విముక్తి లభించినట్టేనని భావించిన కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి వారికి స...









