బాబా గుడిలో భక్తజనం
గురు పౌర్ణమి సందర్భంగా పోటెత్తిన భక్తులు
శేజ హారతితో ముగిసిన పూజా కార్యక్రమాలు
వరంగల్ వాయిస్, హనుమకొండ : మనం జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటానికి మనకు తోడు, నీడై నిలిచి మనల్ని సన్మార్గంలో నడిపించే గురువులను పూజించి వారిని గౌరవించుకునే రోజే ‘గురు పౌర్ణమి’ అని హనుమకొండలోని సాయిబాబా మందిర చైర్మన్ మతుకుమల్లి హరగోపాల్ అన్నారు. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం మందిరంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పూజారులు కిషోర్ శర్మ, మణిశర్మ, చందులు మహన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు. సివిల్స్ లో 11వ ర్యాంకు సాధించిన సాయి శివాని తల్లిదండ్రులతో కలిసి బాబా దర్శనం చేసుకున్నారు. ఆమెకు మందిర చైర్మన్ శేష వస్త్రాలలు అందజేసి ఘనంగా సత్కరించారు. నగర ట్రాఫిక్ ఏసీపీ తీర్థాల సత్యనారాయణ, సుబేదారి సర్కిల్ ఇన్ స్పెక్టర్ రంజిత్ కుమార్ తదితరులు పూజా కార్యక...









