Warangalvoice

Author: WarangalVoice

కేంద్రం కేటాయించిన నిధులపై ఆర్టీఐ దరఖాస్తు
District News, Warangal

కేంద్రం కేటాయించిన నిధులపై ఆర్టీఐ దరఖాస్తు

వరంగల్ వాయిస్, వర్ధన్నపేట : భారతీయ జనతా పార్టీ వర్ధన్నపేట అధ్యక్షుడు రాయపురపు కుమారస్వామి ఆధ్వర్యంలో స్థానిక మండల అభివృద్ధి అధికారి రాజ్యలక్ష్మి, మండల పంచాయతీ అధికారి ధనలక్ష్మి కిసమాచార హక్కు చట్టం ద్వారా మండల పరిషత్, మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల కేటాయింపు వినియోగానికి సంబంధించిన సమాచారం కోసం దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పక్షాన మాజీ శాసనసభ్యుడు నల్లూరి ఇంద్రసేనారెడ్డి జాతీయ కార్యవర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మండలాలలో ఆయా మండల పరిధిలో గల గ్రామాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2014-15వ ఆర్థిక సంవత్సరం నుంచి జూన్ 30 2022 ఆర్థిక సంవత్సరం వరకు ఏమేం నిధులు కేటాయించాయి, వాటి వినియోగం ఏ విధంగా జరిగింది అనే అంశాలను ప్రాతిపదికన సమాచార సేకరణ కోసం ప్రతి మండలానికి ఈ దరఖా...
పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి
District News, Mahabubabad

పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి

వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలో మంద కృష్ణ మాదిగపిలుపు మేరకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టాలని స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా 8వ రోజు రిలే నిరాహారదీక్షలో ఎంఎస్పీ మహబూబాబాద్ జిల్లా కో ఆర్డినేటర్ గుగ్గిళ్ల పీరయ్య మాదిగ పాల్గొన్నారు. దీక్ష లో ఎంఎస్పీ నియోజకవర్గ ఇంఛార్జి పాషా, మండల ఇంఛార్జి కందిపాటి భిక్షపతి, వీహెచ్ పీఎస్ జిల్లా నాయకులు చలగొల వెంకన్న, మోలుగురి కుమార్, ఎంఎస్పీ మండల నాయకులు, మంద సంపత్, మట్టె మహేష్, బిర్రు మంజుల, బొడ సక్రియా, సాంబ లక్ష్మీ, భిక్ష నాయక్, మాలోతు అమ్మి, చెవుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు....
వీఆర్ఏల సమ్మెకు బీజేపీ మద్దతు
District News, Warangal

వీఆర్ఏల సమ్మెకు బీజేపీ మద్దతు

వరంగల్ వాయిస్, కాజీపేట : స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలతో వీఆర్ఏల జాక్ తో కలిసి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ వీఆర్ఏలకు సంఘీభావం తెలిపారు. వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు. పే స్కేల్ ప్రమోషన్లు కల్పిస్తామని చెప్పి కేసీఆర్ మోసం చేశారని దుయ్యపట్టారు. సమ్మెలో పాల్గొన్న బీజేపీ నాయకులు హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు చిల్లర నర్సింగ్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి ఎండీ చాంద్ పాషా, 2వ డివిజన్ అధ్యక్షుడు భగవాన్ దాస్ ఉపాధ్యాయ, దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కోవెల జీవన్, ప్రకాష్, జయంతి లాల్, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుడు కందకట్ల సత్యనారాయణ, గుంటి కుమార్ స్వామి, ఆర్ శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రవణ్ కుమార్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు....
వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలి
District News, Hanamkonda

వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలి

వరంగల్ వాయిస్, పరకాల : తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ డిమాండ్ చేశారు. పట్టణ కేంద్రంలో వీఆర్ఏలు చేపట్టిన దీక్షకు వారు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలను పట్టించుకోకపోవడం చాలా బాధాకరమన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన పే స్కేల్ జీవో వెంటనే విడుదల చేయాలి అన్నారు. అర్హులైన వారికి ప్రమోషన్ ఇవ్వాలన్నారు. అలాగే మిగతా వారి న్యాయమైన డిమాండ్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తప్పవని ఈ సందర్భంగా వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ పరకాల మండల అధ్యక్షుడు సూర రాజు, ఉపాధ్యక్షుడు ఓట్ల స్వాతి, కార్యదర్శి అశోక్, రాకేష్, రామకృష్ణ, రవీందర్, శైలజ, తిరుపతి, సాంబయ్య, దేవి, నరసయ్య, తదితరులు ...
గొర్రెల, మేకల అనారోగ్య నివారణకు వ్యాక్సిన్
District News, Warangal

గొర్రెల, మేకల అనారోగ్య నివారణకు వ్యాక్సిన్

వరంగల్ వాయిస్, వరంగల్ : గొర్రెలు, మేకలు అనారోగ్య నివారణకు, నీలి నాలుక వ్యాధిని అరికట్టేందుకు ముందు జాగ్రత్తగా బ్లుటంగ్ వాక్సిన్ రాష్ట్ర ప్రభుత్వం వేయించడం జరుగుతుందని, దీన్ని గొర్రెలు, మేకల యజమానులు సద్వినియోగం చేసుకోవాలని 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు. పశు వైద్యశాల డాక్టర్ ఝాన్సీ అధ్వర్యంలో శుక్రవారం ఉచిత మందుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు మందులను పంపిణీ చేసి, గొర్రెలకు ఇంజక్షన్లు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే రాష్ట్రంలోని పశు సంపద గొర్రెలు, మేకలు పెంపకానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటయ్య. హసీనా, వినయ్, గొట్టే రాజమ్మ, పిట్ట శ్రీనివాస్, సుంకరి నరేష్ ఉన్నారు....
నిత్యావసర సరుకుల పంపిణీ
Bhupalapally, District News, Telangana

నిత్యావసర సరుకుల పంపిణీ

వరంగల్ వాయిస్, వెంకటాపురం నూగూరు : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని టేకుల బోరు అనే ఆదివాసి గ్రామాల్లో గత వారం రోజుల క్రితం వచ్చిన గోదావరి వరదల వల్ల ఊరు మొత్తం మునిగిపోయింది. తదనంతరం అక్కడ ఆదివాసి కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని శుక్రవారం అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పీర్ల కృష్ణబాబు ఆధ్వర్యంలో గ్రామంలో 55 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 కేజీల బియ్యం, కేజీ నూనె, కేజీ ఉల్లిగడ్డ, కేజీ ఆలుగడ్డ, కేజీ పప్పు తదితర నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్బంగా కృష్ణబాబు మాట్లాడుతూ వరదల వల్ల సర్వం కోల్పొయిన వీరికి స్వచ్ఛందంగా కొంతమంది మానవతవాదులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి సహాయం అందించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇల్లు పోయినవారికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని, తక్షణ సాయం కింద కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన పదివేల రూపాయలు త్వరగా అందించాలని కోరారు. ఈ కార్యక్...
పేదల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
District News, Mahabubabad, Political

పేదల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

పేదల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యంఎమ్మెల్యే శంకర్ నాయక్వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అభిప్రాయపడ్డారు. మహబూబాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ లబ్ధిదారులకు అందజేశారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలలోని వివిధ గ్రామాలకు చెందిన అనారోగ్యానికి గురైన 47 మంది బాధితులకు మంజూరైన రూ.15,99,500 విలువ గల చెక్కులను అందించారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారానే కాకుండా ఆరోగ్య శ్రీ పథకం వర్తించని వ్యాధులకు పేదలను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో ప్రజాకర్షణ పథకా...