Warangalvoice

Author: WarangalVoice

శ్రావణ మాసోత్సవాలను ప్రారంభించిన కార్పొరేటర్
Top Stories

శ్రావణ మాసోత్సవాలను ప్రారంభించిన కార్పొరేటర్

వరంగల్ వాయిస్, వరంగల్ : శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం, రామన్నపేట, వరంగల్ నందు శ్రావణ మాసోత్సవాలను శుక్రవారం స్థానిక కార్పొరేటర్ గందె కల్పనా నవీన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మహిమాన్వితమైన జిల్లాలోనే ప్రత్యేకంగా నర్మదాబాణ లింగం, అన్నపూర్ణ మాత భద్రకాళీ వీరభద్ర స్వామిలతో కూడిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాసోత్సవాలు అద్భుతంగా జరుగుతాయని భక్తులు పాల్గొనాలని పిలుపిచ్చారు. అర్చకులు తనుగుల రత్నాకర్ అయ్యగారు స్వామి వారికి ప్రత్యేక అభిషేకం చేయించారు. అనంతరం అన్నపూర్ణ దేవికి ప్రత్యేక అలంకారం అర్చనలు చేశారు. శ్రాణమాసం మొదటి రోజే శుక్రవారం కావడంతో మహిళా భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించారు. భక్తులకు ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అప్పరాజు రాజు, సభ్యులు చిట్టిమళ్ళ సురేష్, కటకం రాములు, పప్ప...
డాక్టర్ బైరి నిరంజన్ కు కేటీఆర్ పరామర్శ
District News, Hanamkonda

డాక్టర్ బైరి నిరంజన్ కు కేటీఆర్ పరామర్శ

వరంగల్ వాయిస్, కాజీపేట : దర్గా కాజీపేటలో ఉన్న తన ఇంటి సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు పక్కన బండ మీద మీద పడబోయిన ఒక వ్యక్తిని కాపాడి తాను రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నమస్తే తెలంగాణ రచయిత, యూనివర్సిటీ అధ్యాపక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరి నిరంజన్ కు ఎడమ చేయి మణికట్టు కీలు విరిగిపోయి బలమైన దెబ్బలు తగలి చికిత్స పొందుతున్న నేపథ్యంలో వారి పరిస్థితిని తెలుసుకొని ఫోన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. దీనికి వారు స్పందిస్తూ తారక రామారావు గొప్ప మానవతావాది అని ప్రమాదవశాత్తు కాలు విరిగి తాను తీవ్రమైన కాలు నొప్పితో బాధపడుతూ కూడా నాకు జరిగిన ప్రమాదాన్ని వెంటనే తెలుసుకొని నన్ను పలకరించడం నాకు ఎంతో భరోసాను ఇచ్చిందని బైరి నిరంజన్ తెలిపారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, యూనివర్సిటీ అధ్యాపక సంఘం చైర్మన్ డాక్టర్ పి.కరు...
పెన్షనర్స్ కు ప్రత్యేక డైరెక్టరేట్ ను ఏర్పాటు చేయాలి
District News, Mahabubabad

పెన్షనర్స్ కు ప్రత్యేక డైరెక్టరేట్ ను ఏర్పాటు చేయాలి

వరంగల్ వాయిస్, తొర్రూరు : పెన్షనర్స్ కు ప్రత్యేక డైరెక్టరేట్ ను ఏర్పాటు చేయాలని, ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వీరయ్య అన్నారు. శుక్రవారం పట్టణ కేంద్రంలోని స్థానిక జడ్పీఎస్ఎస్ పాఠశాలలో ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ తొర్రూరు మండల శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పి.రఘునారాయణ అధ్యక్షతన వహించగా ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి వీరయ్య హాజరై మాట్లాడుతూ సామాజిక దృక్పథంతో సంఘం పనిచేస్తుందని, పెన్షనర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుందని తెలిపారు. పెన్షనర్స్ పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి కోరేది ప్రతి నెల 1న జీతాలు ఇవ్వాలని, మెడికల్ బిల్స్ ను వెంటనే మంజూరు చేసి, సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. 398 వేతనంపై పనిచేసిన టీచర్స్ కు నోషల్ ఇంక్రిమెంట్ ఇచ్చి, లైఫ్ సర్టిఫికెట్స్ ఆన...
ఫార్మసీ రంగంలో విస్తృత అవకాశాలు
District News, Hanamkonda

ఫార్మసీ రంగంలో విస్తృత అవకాశాలు

వరంగల్ వాయిస్, కేయూ : ఫార్మసీ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ప్రముఖ ఫార్మసీ సంస్థ అలయన్స్ అండ్ ఎకో సిస్టం మేనేజ్ మెంట్ సంచాలకుడు డాక్టర్ కొండం రాజ్ బిరుదురాజు అన్నారు. విశ్వవిద్యాలయ ఫార్మసీ కళాశాలలో సెమినార్ హాల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గాదె సమ్మయ్య అధ్యక్షతన జరిగిన ఉపన్యాస కార్యక్రమంలో నేడు “డ్రగ్ డెవలప్ మెంట్ అండ్ పర్సనలైజ్డ్ మెడిసిన్ : పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్” అనే అంశంపై విస్తృత ఉపన్యాసం చేశారు. ఫార్మసీ రంగానికి మంచి భవిష్యత్ ఉందన్నారు. మారుతున్న జీవన్ శైలికి అనుగుణంగా డ్రగ్ డెవలప్ మెంట్ లో మార్పులు వస్తున్నాయన్నారు. దీనికి అనుగుణంగా రోగ నిర్ధారణ ఉండాలన్నారు, ఫార్మసీ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నాయకత్వ లక్షణాలు అలవరుచుకోవాలి అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కొండం రాజ్ బిరుదురాజు మాట్లాడుతూ ఈ విశ్వవిద్యాలయ ఫార్మసీ కళాశాల పూర్వ విద్యార్ధి అయ...
స్వేరోస్ జ్ఞాన సంకల్పసభ గోడపత్రిక ఆవిష్కరణ
District News

స్వేరోస్ జ్ఞాన సంకల్పసభ గోడపత్రిక ఆవిష్కరణ

వరంగల్ వాయిస్, కేయూ : స్వేరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈనెల 31న సిద్దిపేటలో నిర్వహించ తలపెట్టిన జ్ఞాన సంకల్ప సభ బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్ లను హనుమకొండ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీ మొదటి గేట్ ముందు బహుజన స్టూడెంట్ ఫెడరేషన్(బీ.ఎస్.ఎఫ్) కేయూ అధ్యక్షుడు మన్నే దినాకర్ ఆధ్వర్యంలో విడుదల చేశారు. అనంతరం స్వేరోస్ ఇంటర్నేషనల్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు శనిగరపు రాజేంద్ర ప్రసాద్, బీఎస్ ఎఫ్ కేయూ ఇంఛార్జి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బొట్ల మనోహర్ మాట్లాడుతూ స్వేరో జ్ఞాన సంకల్ప సభకు చీఫ్ గెస్ట్ గా స్వేరోస్ ఇంటర్నేషనల్ ఫౌండర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొంటున్నారని తెలిపారు. బహుజన మేధావులు, విద్యార్థులు, యువత, ఉద్యోగులు, మహిళలు అధిక సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ వాల్ పోస్టర్ ఆవిష్కరణలో వరంగల్ జిల్లా మాజీ జాయింట్ సెక్రటరీ శనిగరపు శాజన్, బీఎస్ ఎఫ్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర...
31న ఎస్సై, కానిస్టేబుల్ మెగా మోడల్ టెస్ట్
District News, Hanamkonda

31న ఎస్సై, కానిస్టేబుల్ మెగా మోడల్ టెస్ట్

వరంగల్ వాయిస్, కేయూ : ఈ నెల 31న తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఎస్సై, కానిస్టేబుల్ మెగా మోడల్ టెస్ట్ కరపత్రాన్ని యూనివర్సిటీ లైబ్రరీ ఆవరణంలో శుక్రవారం టీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షుడు బైరాపాక ప్రశాంత్, రూరల్ జిల్లా కోఆర్డినేటర్ లంక రాజ్ గోపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 80 వేల పైన ఉద్యోగాల ప్రకటన చేసి, వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి అందులో భాగంగా 17,516 ఎస్సై, కానిస్టేబుల్ పరీక్ష తేదీలను కూడా ప్రకటించిన నేపథ్యంలో టీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసం కల్పించడం కోసం ఈ మెగా మోడల్ టెస్ట్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న రిటైర్డ్ పోలీస్ అధికారుల చేత, ఉత్తమ అధ్యాపకుల చేత ఈ ప్రశ్నాపత్రాన్ని తయారు చేస్తున్నామని, ఈ మోడల్ టెస్ట్ ను నిరుద్యోగ అభ్యర్థులందరూ సద్వినియోగ...
రీజనల్ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల దాడులు
Mulugu

రీజనల్ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల దాడులు

వరంగల్ వాయిస్, మంగపేట : మంగపేట మండల కేద్రంలోని శ్రీ దుర్గా మోడరన్ రైస్ మిల్లులో అక్రమంగా పీడీఎస్ బియ్యం నిల్వ ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. శుక్రవారం వరంగల్ రీజనల్ విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ అడిషన్ ఎస్పీ రామారావు ఆదేశాల మేరకు ములుగు జిల్లా మంగపేట మండలంలో శ్రీదుర్గా మోడరన్ రైస్ మిల్లు పై దాడి చేసి అక్రమంగా నిల్వ ఉంచిన 420 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని, 55 క్వింటాళ్ల బ్రోకెన్ రైస్ బియ్యాన్ని పట్టుకొని సీజ్ చేశారు. వీటి విలువ సుమారు రూ.11 లక్షలు ఉంటుందని, మిల్లు ఓనరుపై తగు చర్యల తీసుకునేందుకు సివిల్ సప్లై అధికారులకు రిపోర్ట్ పంపటం జరిగిందని వారు తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్ సీఐ రాకేష్ , పీసీ సుమన్ రెడ్డి, రమేష్ సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహసీల్దార్ రాంచందర్, మంగపేట రెవిన్యూ ఇస్పెక్టర్ నేత కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు....
వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి
Top Stories

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి

వరంగల్ వాయిస్, హనుమకొండ : వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి కల్లూరి పవన్ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా శనివారం పవన్ మాట్లాడుతూ వీఆర్ఏలు రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో కింది స్థాయి ఉద్యోగులుగా పని చేస్తున్నారని, ప్రభుత్వం ప్రవేశ పెట్టె ప్రతి సంక్షేమ పధకాన్ని అమలు చేసే క్రమంలో పగలు, రాత్రి అని తేడా లేకుండా పని చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ వీఆర్ ఏలు కూడా గౌరవంగా బ్రతకాలని, వారికి కూడా పే స్కేల్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వక పోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించే వరకు జాతీయ బీసీ యువజన సంఘం పోరాడుతుందని అన్నారు....
రామకృష్ణకు మా అసోసియేషన్ శుభాకాంక్షలు
Mahabubabad

రామకృష్ణకు మా అసోసియేషన్ శుభాకాంక్షలు

వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు దర్శనం రామకృష్ణకు మా అసోసియేషన్ తరపున అధ్యక్షుడు బొడ్డుపల్లి ఉపేంద్రం శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ 1996 సంవత్సరం నుంచి తన కుటుంబ సభ్యులలో ఒకడిగా ఉండి ఎదిగిన దర్శనం రామకృష్ణ భవిష్యత్తులో మంచి న్యాయవాదిగా మహబూబాబాద్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ముందుకు సాగాలని అన్నారు. మండలంలోని సింగారం గ్రామానికి చెందిన దర్శనం రామకృష్ణ నిరుపేద కుటుంబంలో జన్మించి అణగారిన వర్గాల ప్రజలకు సహాయపడాలనే తపనతో లా విద్యను పూర్తి చేసి ఉత్తీర్ణత సాధించారు....
పార్లమెంట్ సమావేశంలో బీసీల కుల గణన చేపట్టాలి
District News

పార్లమెంట్ సమావేశంలో బీసీల కుల గణన చేపట్టాలి

బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్వరంగల్ వాయిస్, హనుమకొండ : బీసీ సంక్షేమ సంఘం హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు అనుమాండ్ల విద్యాసాగర్ ఆధ్వర్యంలో హాసన్ పర్తి మండల కేంద్రంలో బీసీల చలో ఢిల్లీ కార్యక్రమం పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ బీసీ కుల గణన లేకుంటే బీసీల అస్తిత్వం కష్టమేనని, బీసీలకు ప్రస్తుతం అందుతున్న ఫలాలు కొనసాగాలంటే, జనాభా దామాష ప్రకారం బీసీల వాటా బీసీలకు దక్కాలంటే, బీసీ లెక్కలు తప్పనిసరిగా ఉండాల్సిందేనని అన్నారు. ఈ పార్లమెంట్ సమావేశంలో బీసీ కుల గణపైన పార్లమెంట్ లో చట్టం చేయాలని, జనాభాలో 55 శాతం ఉన్న బీసీలకు జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో రిజర్వేషన్ కల్పించాలని, బీసీలపైన క్రిమిలేయార్ ఎత్తివేయాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన...