Warangalvoice

Author: Sahith Gaddam

Ponnam Prabhakar Goud | తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ సన్నబియ్యం : మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
Latest News

Ponnam Prabhakar Goud | తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ సన్నబియ్యం : మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్

హుస్నాబాద్ పట్టణంలోని బుడగ జంగం కాలనీలో సన్న బియ్యం పథకాన్ని ఇవాళ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ సన్నబియ్యం అందిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. వరంగల్ వాయిస్, హుస్నాబాద్ టౌన్  : రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ నేటి నుంచి సన్న బియ్యం పథకాన్ని అందిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలోని బుడగ జంగం కాలనీలో ఇవాళ సన్న బియ్యం పథకం మంత్రి పొన్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ.. తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ సన్నబియ్యం అందిస్తామన్నారు. ఈ పథకం దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలో ప్రారంభించడం జరిగిందని.. ఇది దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని 17,263 చౌకధరల దుకాణాల ద్వారా ర...
KTR | విధ్వంసమే మీ ఏకైక నినాదం.. హెచ్‌సీయూ వ్యవహారంలో రేవంత్‌పై కేటీఆర్‌ ధ్వజం
Top Stories

KTR | విధ్వంసమే మీ ఏకైక నినాదం.. హెచ్‌సీయూ వ్యవహారంలో రేవంత్‌పై కేటీఆర్‌ ధ్వజం

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు తీవ్రంగా స్పందించారు. తొలుత పర్యావరణ పరిరక్షణ పేరుతో చాలా మంది పేదల ఇండ్లను కూల్చివేశారని మండిపడ్డారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : హైదరాబాద్‌సెంట్రల్‌ యూనివర్సిటీ వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు తీవ్రంగా స్పందించారు. తొలుత పర్యావరణ పరిరక్షణ పేరుతో చాలా మంది పేదల ఇండ్లను కూల్చివేశారని మండిపడ్డారు. ఆ తర్వాత అభివృద్ధి పేరుతో గిరిజన గ్రామాలను వెంబడించారని.. బంజరు భూములు, బల్లులు కూడా గుడ్లు పెట్టవు అన్నారని.. ఇప్పుడు మీరు జంతువుల గూళ్ళను వెంటాడి సామూహిక హత్యలు చేస్తారంటూ మండిపడ్డారు. మీ సమర్థన? అభివృద్ధా? ప్రభుత్వ భూమా? మీది ప...
MLA KP Vivekananda | రానున్న రోజుల్లో అన్ని ప్రాంతాల అభివృద్ధి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Top Stories

MLA KP Vivekananda | రానున్న రోజుల్లో అన్ని ప్రాంతాల అభివృద్ధి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద

గాజుల రామారం (సర్కిల్) డివిజన్ పరిధిలోని హెచ్ఏఎల్ వెస్ట్ కాలనీ నూతన సంక్షేమ సంఘం ఏర్పడిన సందర్భంగా సంక్షేమ సంఘ సభ్యులు ఇవాళ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందను మర్యాదపూర్వకంగా కలిశారు. వరంగల్ వాయిస్,  దుండిగల్  : సంక్షేమ సంఘ సభ్యులు ఒక్క తాటిపై ఉంటేనే కాలనీ మరింత అభివృద్ధి చెందుతుందని బీఆర్ఎస్ పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. గాజుల రామారం (సర్కిల్) డివిజన్ పరిధిలోని హెచ్ఏఎల్ వెస్ట్ కాలనీ నూతన సంక్షేమ సంఘం ఏర్పడిన సందర్భంగా ఇవాళ ఎమ్మెల్యే వివేకానందను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ.. గత పదేళ్ల కాలంలో నియోజకవర్గంలోని అన్నీ డివిజన్లలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి పరిచామని.. రానున్న రోజుల్లో కూడా అన్ని ప్రాంతాలను అభివృద్ధి పరుస్తామని పేర్కొన్నారు. కాలనీ అభివృద్ధిలో సంక్షేమ సంఘాల పాత్ర ఎంతో కీలకమ...
SLBC Tunnel | ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు
Latest News

SLBC Tunnel | ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు

నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమల పెంట ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో (SLBC Tunnel) సహాయక చర్యలు 36వ రోజుకు చేరుకున్నాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు రెస్క్యూ బృందాలు నిర్విరామంగా కృషిచేస్తున్నాయి. ప్రమాదం జరిగి 36 రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ ఇద్దరు ఇంజనీర్ల మృతదేహాలు మాత్రమే లభించాయి. వరంగల్ వాయిస్, నాగర్‌కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమల పెంట ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో (SLBC Tunnel) సహాయక చర్యలు 36వ రోజుకు చేరుకున్నాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు రెస్క్యూ బృందాలు నిర్విరామంగా కృషిచేస్తున్నాయి. ప్రమాదం జరిగి 36 రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ ఇద్దరు ఇంజనీర్ల మృతదేహాలు మాత్రమే లభించాయి. మిగిలిన ఆరుగురి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. రోజు మాదిరిగానే శనివారం ఉదయం సైతం ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్, సింగరేణి, ఆర్మీ, కేరళ పోలీస్ క్యాడవార్ డాగ్స్ వంటి రిస్క్యూ టీంలు సహాయ ...
రిటైర్డ్‌ ఉద్యోగులను పంపిస్తారా?
Top Stories

రిటైర్డ్‌ ఉద్యోగులను పంపిస్తారా?

ప్రభుత్వంలో వివిధ పద్ధతుల్లో కొనసాగుతున్న విశ్రాంత ఉద్యోగుల తొలగింపుపై సీఎస్‌ శాంతికుమారి ప్రకటన చేశారు. కానీ ఉత్తర్వులు ఉత్తముచ్చటేనని ప్రభుత్వవర్గాల్లో నే చర్చ జరుగుతున్నది. ఎక్స్‌టెన్షన్‌ ఇస్తే చిక్కు లు వస్తాయని గుర్తించి, అందరినీ తొలగించి, ఆ తర్వాత అనుకూల అధికారులను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రభుత్వంలోని కొందరు ప్లాన్‌ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అధికారులు, ఉద్యోగులపై ప్రభుత్వ వైఖరిలో అస్పష్టత అనుకూల అధికారులను కొనసాగించేందుకు ప్రణాళిక ఎక్స్‌టెన్షన్‌పై ఉన్న అధికారుల తొలగింపు ఉత్తదేనా? సీఎస్‌ ఆదేశాలు ప్రచార ఆర్భాటమేనా? వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : ప్రభుత్వంలో వివిధ పద్ధతుల్లో కొనసాగుతున్న విశ్రాంత ఉద్యోగుల తొలగింపుపై సీఎస్‌ శాంతికుమారి ప్రకటన చేశారు. కానీ ఉత్తర్వులు ఉత్తముచ్చటేనని ప్రభుత్వవర్గాల్లో నే చర్చ జరుగుతున్నది. ఎక్స్‌టెన్షన్‌ ఇస్తే చిక్కు లు వస్తాయన...
KTR | పదేండ్ల కేసీఆర్ పాలనలో సౌ‘భాగ్యనగరం’.. 15 నెలల అసమర్థ కాంగ్రెస్ పాలనలో అ‘భాగ్యనగరం’: కేటీఆర్‌
Top Stories

KTR | పదేండ్ల కేసీఆర్ పాలనలో సౌ‘భాగ్యనగరం’.. 15 నెలల అసమర్థ కాంగ్రెస్ పాలనలో అ‘భాగ్యనగరం’: కేటీఆర్‌

పదేండ్ల కేసీఆర్‌ పాలనలో సౌభాగ్యనంగరంగా ఉన్న హైదరాబాద్‌ 15 నెలల అసమర్థ కాంగ్రెస్‌ ఏలుబడిలో అభాగ్యనగరంగా మారిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) అన్నారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో నగరంలో ఇండ్ల కొనుగోళ్లు తగ్గాయని విమర్శించారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : పదేండ్ల కేసీఆర్‌ పాలనలో సౌభాగ్యనంగరంగా ఉన్న హైదరాబాద్‌ 15 నెలల అసమర్థ కాంగ్రెస్‌ ఏలుబడిలో అభాగ్యనగరంగా మారిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) అన్నారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో నగరంలో ఇండ్ల కొనుగోళ్లు తగ్గాయని విమర్శించారు. అమ్మకాలు జరగకపోవడంతో రియల్టర్లు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. అన్నదాతలే కాదు అమాయక రియల్‌ వ్యాపారులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కూల్చడం కాదు కట్టడం నేర్చుకోవాలని, అబద్ధాలు చెప్పడం కాదు అభివృద్ధి చేయడం నేర్చుకోవాలని కాంగ్రెస్‌ పాలకులకు చురకలంటించారు. ...
Kaleshwaram Canal : భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాల‌ని ధ‌ర్నా
Latest News

Kaleshwaram Canal : భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాల‌ని ధ‌ర్నా

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా రాజాపేట‌ మండలంలోని బేగంపేట గ్రామ‌ రైతుల నుంచి కాళేశ్వరం కాల్వ పనులకు కోసం సేకరించిన భూమికి వెంట‌నే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం తాసీల్దార్ కార్యాలయం ముందు బాధితులు ధర్నా నిర్వహించారు. వరంగల్ వాయిస్, రాజాపేట : యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా రాజాపేట‌ మండలంలోని బేగంపేట గ్రామ‌ రైతుల నుంచి కాళేశ్వరం కాల్వ పనులకు కోసం సేకరించిన భూమికి వెంట‌నే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం తాసీల్దార్ కార్యాలయం ముందు బాధితులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి చిగుళ్ల లింగం మాట్లాడుతూ.. సేకరించిన రైతుల భూములు ధరణి నుంచి తొలగిపోయి రైతు భరోసా కూడా రాక రైతులు తీవ్రంగా నష్ట పోతున్న‌ట్లు తెలిపారు. పరిహారం చెల్లించకుండానే ధరణి ఆన్‌లైన్‌లో నుంచి రైతుల పేర్లు తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ...
Bhadrachalam | మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ధర్నా.. భద్రాచలం ప్రభుత్వ దవాఖాన వద్ద ఉద్రిక్తత
Latest News

Bhadrachalam | మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ధర్నా.. భద్రాచలం ప్రభుత్వ దవాఖాన వద్ద ఉద్రిక్తత

భద్రాచలం  ప్రభుత్వ దవాఖాన వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. భవనం కుప్పకూలిన ఘటనలో శిథిలాల కిందపడి చనిపోయిన మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కుల సంఘాలు, వామపక్ష, కుల సంఘా నాయకులు, తాపీమేస్త్రి ఉపేందర్‌ బంధువులు ఆందోళనకు దిగారు. వరంగల్ వాయిస్, భద్రాచలం : భద్రాచలం  ప్రభుత్వ దవాఖాన వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. భవనం కుప్పకూలిన ఘటనలో శిథిలాల కిందపడి చనిపోయిన మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కుల సంఘాలు, వామపక్ష, కుల సంఘా నాయకులు, తాపీమేస్త్రి ఉపేందర్‌ బంధువులు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబాలకు రూ.కోటి నష్ట పరిహారం చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. ఆ తర్వాతే మృతదేహాలకు పోస్టుమార్టం చేయాలని ప్రభుత్వ దవాఖాన మార్చురీ ఎదుట ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్‌కు చేరుకున్నారు. వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. శ్రీపతి సేవా ట్రస్టు పేరిట భద్రా...
KTR | తెలంగాణకు బీవైడీ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ కృషి ఫలితమే: కేటీఆర్‌
Top Stories

KTR | తెలంగాణకు బీవైడీ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ కృషి ఫలితమే: కేటీఆర్‌

రాష్ట్రానికి బీవైడీ కార్ల సంస్థ పెట్టుబడి రావడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  సంతోషం వ్యక్తంచేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాల వల్లే రాష్ట్రానికి బీవైడీ సంస్థ వచ్చిందన్నారు. 2023లోనే 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడికి బీవైడీ, ఒలెక్ట్రా అంగీకారం కుదుర్చుకున్నాయని చెప్పారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : రాష్ట్రానికి బీవైడీ కార్ల సంస్థ పెట్టుబడి రావడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  సంతోషం వ్యక్తంచేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాల వల్లే రాష్ట్రానికి బీవైడీ సంస్థ వచ్చిందన్నారు. 2023లోనే 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడికి బీవైడీ, ఒలెక్ట్రా అంగీకారం కుదుర్చుకున్నాయని చెప్పారు. బీవైడీ కంపెనీ రాష్ట్రానికి రావడం ఫార్ములా-ఈ రేసు ప్రత్యక్షఫలితమని వెల్లడించారు. బీవైడీ రాకకు ఏండ్ల తరబడి కష్టపడిన అందరికి ఎక్స్‌ వేదికగా అభినందనలు తెలిపారు. ‘బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ కృషితోనే తెలంగాణ...
ACB Raid | రూ.30వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విద్యుత్‌ ఏవో
Top Stories

ACB Raid | రూ.30వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విద్యుత్‌ ఏవో

విద్యుత్‌ లైన్‌ మార్పిడి కోసం బాధితుడి నుంచి లంచం తీసుకున్న విద్యుత్‌ శాఖ ఏవో ను ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : విద్యుత్‌ లైన్‌ మార్పిడి కోసం బాధితుడి నుంచి లంచం తీసుకున్న విద్యుత్‌ శాఖ ఏవో  ను ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. హైదరాబాద్‌లోని జీడిమెట్ల డివిజన్‌లో ఏవోగా పనిచేస్తున్న ఎస్‌.సురేందర్‌ రెడ్డి  గురువారం మధ్యాహ్నం తన కార్యాలయంలో బాధితుడి నుంచి రూ. 30వేలు తీసుకుంటుండగా పట్టుబడ్డారు. తన ఇంటిపై నుంచి వెళ్తున్న 11 కేవీ లైన్‌ కేబుళ్లను తొలగించాలని బాధితుడు ఏవోని సంప్రదించగా అందుకు లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ( ACB) అధికారులను ఆశ్రయించాడు. గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు కార్యాలయంలో లంచం డబ్బులు తీసుకుంటుండగా అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు దాడులు చేసి ఏవోని పట్టుకుని కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని నాంపల...