Warangalvoice

Author: Sahith Gaddam

SLBC Tonnel | ఎస్‌ఎల్‌బీసీలో పునరుద్ధరించిన కన్వేయర్ బెల్ట్.. కొనసాగుతున్న స్టీల్, వ్యర్థ పదార్థాల తొలగింపు
Latest News

SLBC Tonnel | ఎస్‌ఎల్‌బీసీలో పునరుద్ధరించిన కన్వేయర్ బెల్ట్.. కొనసాగుతున్న స్టీల్, వ్యర్థ పదార్థాల తొలగింపు

జిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీ వద్ద సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు గురువారంతో పూర్తవడంతో శుక్రవారం నుంచి మట్టి తొలగింపు పనులను ముమ్మరం చేశారు. వరంగల్ వాయిస్,  నాగర్ కర్నూల్ : జిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీ  వద్ద సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కన్వేయర్ బెల్ట్  పునరుద్ధరణ పనులు గురువారంతో పూర్తవడంతో శుక్రవారం నుంచి మట్టి తొలగింపు పనులను ముమ్మరం చేశారు. సొరంగం నుంచి ఉబికి వస్తున్న ఊట నీటిని తోడిపోస్తూ స్టీల్  వ్యర్ధాలను బయటకు తరలిస్తున్నారు. శుక్రవారం టన్నెల్ లోపల జరుగుతున్న సహాయక చర్యలపై సహాయక బృందాల ఉన్నతాధికారులతో ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి సమీక్ష నిర్వహించారు. సహాయక బృందాలు తమకు కేటాయించిన పనిని పూర్తి స్థాయిలో చేపడుతూ వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. టన్నెల్ లోపల అత్యధికంగా పేరుకుపోయిన స్టీలును లోకో ట్రైన్ ద్వారా బయటకు తరలిస్తున్నట్లు వివరించ...
Harish Rao | మూగ జీవాలు కూడా రేవంత్ రెడ్డిని క్ష‌మించ‌వు.. మండిప‌డ్డ హ‌రీశ్‌రావు
District News

Harish Rao | మూగ జీవాలు కూడా రేవంత్ రెడ్డిని క్ష‌మించ‌వు.. మండిప‌డ్డ హ‌రీశ్‌రావు

సీఎం రేవంత్ రెడ్డి పాల‌న‌లో ఫెయిల్ అయ్యార‌ని, ఆయ‌న‌ను మూగ‌జీవాలు కూడా క్ష‌మించ‌వు అని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. వరంగల్ వాయిస్,  సిద్దిపేట : సీఎం రేవంత్ రెడ్డి పాల‌న‌లో ఫెయిల్ అయ్యార‌ని, ఆయ‌న‌ను మూగ‌జీవాలు కూడా క్ష‌మించ‌వు అని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. ఏప్రిల్ 27 న వరంగ‌ల్‌లో జరిగే పార్టీ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభ సందర్బంగా సిద్దిపేట నియోజకవర్గ ముఖ్య నాయకులతో హ‌రీశ్‌రావు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. సిద్దిపేటకు 25 ఏళ్ల గులాబీ జెండా కీర్తి ఉంది.. పార్టీ పెట్టి లక్ష్యం సాధించి.. ఆ లక్ష్యంతో అద్భుతమైన అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ జెండా అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. నాడు 2001లో సిద్దిపేట కొనాయ‌పల్లి వెంకటేశ్వ...
Old City | నివురుగప్పిన నిప్పులా పాతనగరం.. భారీగా పోలీసులు మోహ‌రింపు
Latest News

Old City | నివురుగప్పిన నిప్పులా పాతనగరం.. భారీగా పోలీసులు మోహ‌రింపు

వక్ఫ్ బిల్లును పార్లమెంట్‌లో అమోదించడంతో ముస్లిం వర్గాల్లో భిన్నాభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. వరంగల్ వాయిస్, చార్మినార్ : వక్ఫ్ బిల్లును పార్లమెంట్‌లో అమోదించడంతో ముస్లిం వర్గాల్లో భిన్నాభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ బిల్లు ఉభయ సభల్లో ఆమోదించి రాష్ట్రపతి భవన్‌కు చేరిన పక్షంలో ఇక రాజ్యాంగ‌బద్దంగా అమలు కావడమే తరువాయి. ప్రస్తుతం లోక్‌స‌భ‌, రాజ్యసభల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు మెజారిటీ సభ్యులు తమ అభిప్రాయాలను తెలియజేసి బిల్లు సవరణకు మద్దతు పలికారు. ఈ క్ర‌మంలో ముస్లింలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొంద‌రు స్వాగ‌తిస్తే.. మ‌రికొంద‌రు కేంద్ర ప్ర‌భుత్వంపై మండిప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో పాతనగరంలోని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పుల కొనసాగుతుంది. శుక్రవారం ప్రత్యేక ప్రార్ధనల నేపథ్యంలో సున్నిత, అతి సున్నిత ప్రాంతాలుగా గుర్తించిన చోట్ల పోలీస్ ఉన్నతధికారులు ప...
Harish Rao | బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియ‌ర్స్‌పై క‌క్ష సాధింపు చ‌ర్య‌లు మానుకోవాలి.. హ‌రీశ్‌రావు హెచ్చ‌రిక‌
Top Stories

Harish Rao | బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియ‌ర్స్‌పై క‌క్ష సాధింపు చ‌ర్య‌లు మానుకోవాలి.. హ‌రీశ్‌రావు హెచ్చ‌రిక‌

బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్‌పై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు హెచ్చ‌రించారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్‌పై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు హెచ్చ‌రించారు. హెచ్‌సీయూ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసినందుకు విద్యార్థులు, బీఆర్ఎస్ నాయకులు, సోషల్ మీడియా వారియర్స్‌పై అక్రమ కేసులు బనాయించడం స‌రికాద‌న్నారు. నేడు నల్లగొండ జిల్లా, మర్తినేని గూడెం మాజీ సర్పంచ్ బండమీది రామును అక్రమంగా పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు. ఇలా ఎంతమందిపై కేసులు పెట్టుకుంటూ వెళ్తారు రేవంత్ రెడ్డి గారు? ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడతారా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ఇదేం ఇందిరమ్మ రాజ్...
KTR | గ‌డ్డి న‌ర‌స‌య్య మ‌ర‌ణం పార్టీకి తీర‌ని లోటు : కేటీఆర్
Latest News

KTR | గ‌డ్డి న‌ర‌స‌య్య మ‌ర‌ణం పార్టీకి తీర‌ని లోటు : కేటీఆర్

 సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గడ్డి నరసయ్య మరణం పార్టీకి తీరని లోటు అని పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గడ్డి నరసయ్య మరణం పార్టీకి తీరని లోటు అని పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. నరసయ్య అకాల మరణం పట్ల చింతిస్తూ.. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ తరఫున వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను అని కేటీఆర్ తెలిపారు. ఇక న‌ర‌స‌య్య మృత‌దేహానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య శుక్రవారం నివాళుల‌ర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి భరోసా అందించారు. ఆయన వెంట బీఆర్ఎ...
KCR | హైద‌రాబాద్, ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లాల పార్టీ ముఖ్య నేత‌ల‌తో కేసీఆర్ స‌మావేశం
Top Stories

KCR | హైద‌రాబాద్, ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లాల పార్టీ ముఖ్య నేత‌ల‌తో కేసీఆర్ స‌మావేశం

బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో అధినేత కేసీఆర్ అధ్యక్షతన, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పార్టీ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం జరిగింది. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో అధినేత కేసీఆర్ అధ్యక్షతన, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పార్టీ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం జరిగింది. ఈ స‌మావేశంలో వ‌రంగ‌ల్‌లో నిర్వ‌హించే పార్టీ ర‌జ‌తోత్స‌వ మ‌హాస‌భ గురించి నేత‌ల‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. జ‌న స‌మీక‌ర‌ణ‌తో పాటు ప‌లు కీల‌క అంశాల‌పై కేసీఆర్ వారితో చ‌ర్చించారు. పార్టీ ర‌జ‌తోత్స‌వ స‌భ నేప‌థ్యంలో రోజుకు రెండు ఉమ్మ‌డి జిల్లాల నేత‌ల‌తో కేసీఆర్ స‌న్నాహ‌క స‌మావేశాలు కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ...
భగ్గుమన్న రైతన్నలు.. ధాన్యంతో తొగుట మార్కెట్ ముందు రాస్తారోకో
Latest News

భగ్గుమన్న రైతన్నలు.. ధాన్యంతో తొగుట మార్కెట్ ముందు రాస్తారోకో

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారని, కొద్ది రోజుల్లో వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైతే.. ధాన్యం పోయడానికి కూడా స్థలం లేదన్నారు సొసైటీ చైర్మన్ కే హరికృష్ణా రెడ్డి. వరంగల్ వాయిస్,  తొగుట : ఆరుగాలం కష్టించి పండించిన పంటను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సిగ్గు చేటని సొసైటీ చైర్మన్ కే హరికృష్ణా రెడ్డి మండిపడ్డారు. మండల కేంద్రమైన తొగుట వ్యవసాయ మార్కెట్‌లో పొద్దు తిరుగుడు ధాన్యం కొనుగోళ్లు గత 15 రోజులుగా నిలిచిపోవడంతో రైతులతో కలిసి పొద్దు తిరుగుడు ధాన్యాన్ని పరిశీలించారు. 15 రోజులుగా ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఆగ్రహానికి లోనయ్యారు. పొద్దు తిరుగుడు ధాన్యంతో మార్కెట్ ముందు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా సొసైటీ చైర్మన్ కే హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కోడ్‌లో గత నెల 3న తొగుటలో పొద్దుతిరుగుడు కేంద్రాన్ని ప్రారంభ...
TG High Court | కంచ గచ్చిబౌలి భూములపై విచారణ ఈ నెల 7కి వాయిదా..
Top Stories

TG High Court | కంచ గచ్చిబౌలి భూములపై విచారణ ఈ నెల 7కి వాయిదా..

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది. 400 ఎకరాల్లో చెట్ల నరికివేత పనులు ఆపాలని దాఖలైన పిటిషన్లపై పిటిషన్లపై హైకోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. వరంగల్ వాయిస్, హైదరాబాద్ ‌:  కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది. 400 ఎకరాల్లో చెట్ల నరికివేత పనులు ఆపాలని దాఖలైన పిటిషన్లపై పిటిషన్లపై హైకోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దని ఆదేశించిన కోర్టు.. అప్పటిలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని సూచించింది. హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు ఏజీ హైకోర్టును గడువు కోరారు. ఈ మేరకు కోర్టు కేసును వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. ఈ భూముల వ్యవహారంలో సుప్రీం...
SIRICILLA | లక్ష్యం మేరకు యువ వికాస రుణాలను సకాలంలో పంపిణీ చేయాలి
Latest News

SIRICILLA | లక్ష్యం మేరకు యువ వికాస రుణాలను సకాలంలో పంపిణీ చేయాలి

సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రాజీవ్ యువ వికాసం పై బ్యాంకర్లతో సన్నాహక సమావేశం వరంగల్ వాయిస్,  సిరిసిల్ల కలెక్టరేట్  : యువ వికాసం అమలుకు ప్రతి బ్యాంకుకు కేటాయించిన లక్ష్యం మేరకు రుణాలను సకాలంలో పంపిణీ చేయాలనీ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ రాజీవ్ యువ వికాసం పై బ్యాంకర్ల తో సన్నాహక సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం క్రింద మంజూరు చేసే యూనిట్ లకు మున్సిపాలిటీ, మండలాల పరిధిలో ఉన్న బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశించడం జరుగుతుందని, సబ్సిడీ మంజూరైన యూనిట్ లకు తప్పనిసరిగా బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీ చేసి యూనిట్ గ్రౌండింగ్ లో బ్యాంకులు తమ సహకారం అందించాలని అన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల పరిశీలన, తుది ఆమోదం సమయంలో బ్యాంకు బ్రాంచ్ మేనేజర...
Supreme Court | ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై విచారణ.. తుది తీర్పును రిజర్వ్‌ చేసిన ‘సుప్రీం’
Latest News

Supreme Court | ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై విచారణ.. తుది తీర్పును రిజర్వ్‌ చేసిన ‘సుప్రీం’

ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ అగస్టిన్‌ జార్జ్‌ మసీహ్‌ బెంచ్‌ ఎదుట స్పీకర్‌ కార్యదర్శి తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి వాదనలు వినిపించారు. స్పీకర్‌ నిర్ణయానికి కాలపరిమితి విధింపుపై ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవన్నారు. Supreme Court | ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ అగస్టిన్‌ జార్జ్‌ మసీహ్‌ బెంచ్‌ ఎదుట స్పీకర్‌ కార్యదర్శి తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి వాదనలు వినిపించారు. స్పీకర్‌ నిర్ణయానికి కాలపరిమితి విధింపుపై ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవన్నారు. మణిపూర్‌ వ్యవహారం పూర్తిగా భిన్నమైందని.. ఆ ఒక్క విషయాన్ని ప్రత్యేకంగా పరిగణించారని తెలిపారు. రాణా కేసు పూర్తిగా ప్రత్యేకమైందని.. ప్రస్త...