Warangalvoice

Author: Sahith Gaddam

BRS | తెలంగాణ భవన్‌లో ఘనంగా బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు..
Top Stories

BRS | తెలంగాణ భవన్‌లో ఘనంగా బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు..

మాజీ ఉపప్రధాని, దివంగత బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు బీఆర్ఎస్  పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. బీజేఆర్ చిత్రపటానికి శాసన మండలిలో ప్రతిపక్షనేత ఎస్.మధుసుదానా చారి సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ఘనంగా నివాళులర్పించారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : మాజీ ఉపప్రధాని, దివంగత బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు బీఆర్ఎస్  పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. బీజేఆర్ చిత్రపటానికి శాసన మండలిలో ప్రతిపక్షనేత ఎస్.మధుసుదానా చారి సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ఘనంగా నివాళులర్పించారు. జగ్జీవన్ రామ్‌కు భారత రత్న ఇవ్వాలని మధుసూదనా చారి డిమాండ్ చేశారు. రాష్ట్రం లోని కాంగ్రెస్ ప్రభుత్వం బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలకు విరుద్ధంగా పని చేస్తున్నదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎర్రోళ్ల శ్రీనివాస్‌, గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, పార్టీ నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు....
KCR | ఉమ్మ‌డి ఖ‌మ్మం, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, న‌ల్ల‌గొండ జిల్లాల ముఖ్య నేత‌ల‌తో కేసీఆర్ స‌మావేశం
Top Stories

KCR | ఉమ్మ‌డి ఖ‌మ్మం, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, న‌ల్ల‌గొండ జిల్లాల ముఖ్య నేత‌ల‌తో కేసీఆర్ స‌మావేశం

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల ముఖ్య నేతలతో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల ముఖ్య నేతలతో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన శనివారం ఎర్రవెల్లి నివాసంలో నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు సిహెచ్ లక్ష్మారెడ్డి, ఎస్ నిరంజన్ రెడ్డి, వీ శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే విజయ్ భాస్కర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డ...
KCR | సామాజిక న్యాయం కోసం బాబు జగ్జీవన్ రామ్ కృషి ఆదర్శనీయం: కేసీఆర్‌
Top Stories

KCR | సామాజిక న్యాయం కోసం బాబు జగ్జీవన్ రామ్ కృషి ఆదర్శనీయం: కేసీఆర్‌

స్వాతంత్య్ర సమరయోధునిగా, భారత ఉప ప్రధానిగా, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సమ సమాజ దార్శనికుడిగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలు మహోన్నతమైనవని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కొనియాడారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : స్వాతంత్య్ర సమరయోధునిగా, భారత ఉప ప్రధానిగా, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సమ సమాజ దార్శనికుడిగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలు మహోన్నతమైనవని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కొనియాడారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. చిన్ననాటి నుంచే సామాజిక వివక్షను ఎదుర్కొన్న ఆయన, వర్ణ కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారని తెలిపారు. దేశ స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలకంగా పాల్గొన్న బాబు జగ్జీవన్ రామ్, అనంతర స్వయంపాలనలో కేబినెట్ మంత్రిగా కార్మిక శాఖల...
Kethaki Temple | కేతకి ఆలయాన్ని సందర్శించిన తెలంగాణ హైకోర్టు జ‌డ్జిలు
Latest News

Kethaki Temple | కేతకి ఆలయాన్ని సందర్శించిన తెలంగాణ హైకోర్టు జ‌డ్జిలు

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జిలు జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి, జస్టిస్ పి. శ్రీసుధ శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరంగల్ వాయిస్, ఝరాసంగం : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జిలు జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి, జస్టిస్ పి. శ్రీసుధ శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా జడ్జిల‌కు ఆలయ రాజగోపురం వద్ద ఆలయ అర్చకులు మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాలు మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలోని అమృత గుండంలో పాదాచారణ చేసి గర్భగుడిలోని పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారికి అభిషేకం, మంగళహారతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం జడ్జీలకు ఆలయ కార్యనిర్వాహణ అధికారి శివ రుద్రప్ప పూలమాల శాలువాతో సన్...
KTR | హెచ్‌సీయూలో జింక‌ను చంపిన కుక్క‌లు.. రాహుల్ చేతికే ఆ ర‌క్త‌పు మ‌ర‌క‌లు : కేటీఆర్
Top Stories

KTR | హెచ్‌సీయూలో జింక‌ను చంపిన కుక్క‌లు.. రాహుల్ చేతికే ఆ ర‌క్త‌పు మ‌ర‌క‌లు : కేటీఆర్

హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో కుక్క‌ల దాడిలో ఓ జింక ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో కుక్క‌ల దాడిలో ఓ జింక ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఆ ర‌క్త‌పు మ‌ర‌క‌లు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేతికే అంటాయ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. అత్యాశతో కూడిన కాంగ్రెస్ ప్రభుత్వం జింక‌ల‌కు నెల‌వైన కంచ గ‌చ్చిబౌలి భూముల‌ను ధ్వంసం చేసింది. దీంతో ఆ ప్రాంతంలో కుక్క‌లు విచ్చ‌ల‌విడిగా సంచరిస్తూ జింక‌ను చంపాయి. కంచ గచ్చిబౌలి మినీ ఫారెస్ట్‌ను రేవంత్ రెడ్డి బుద్ధిహీనంగా ధ్వంసం చేయడం వల్ల విలువైన వృక్ష, జంతుజాలం ​​నష్టపోయింది అని కేటీఆర్ పేర్కొన్నారు. వన్యప్రాణుల ఈ దారుణ హత్యపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టును అభ్యర్థిస్తున్న‌ట్లు కేటీఆర...
RS Praveen Kumar | శాంతి భ‌ద్ర‌త‌లు కాపాడ‌టంలో రేవంత్ స‌ర్కార్ ఘోర వైఫ‌ల్యం : ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్
Latest News

RS Praveen Kumar | శాంతి భ‌ద్ర‌త‌లు కాపాడ‌టంలో రేవంత్ స‌ర్కార్ ఘోర వైఫ‌ల్యం : ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్

శాంతి భద్రతలు కాపాడటంలో రేవంత్ సర్కార్ ఘోర వైఫల్యం చెందింద‌ని బీఆర్ఎస్ నాయ‌కుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : శాంతి భద్రతలు కాపాడటంలో రేవంత్ సర్కార్ ఘోర వైఫల్యం చెందింద‌ని బీఆర్ఎస్ నాయ‌కుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. గత వారం రోజుల్లోనే నలుగురు మహిళలపై అత్యాచార ఘటనలు జరిగాయ‌ని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ గుర్తు చేశారు. మేడ్చల్ ఎంఎంటీఎస్ మహిళా బోగిలో ఉన్నప్పటికీ మహిళపై అత్యాచారం జరిగింది. సంగారెడ్డి కందిలో భర్తను కట్టేసి మహిళపై అత్యాచారానికి పాల్ప‌డ్డారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ గుడి దగ్గర మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. మార్చి 31న జర్మనీ మహిళపై పహాడీ షరీఫ్‌లో అత్యాచారం జరిగింద...
MGU : హెచ్‌సీయూ భూముల‌పై సుప్రీం స్టే.. ఎంజీయూలో విద్యార్థుల హ‌ర్షాతిరేకం
Latest News

MGU : హెచ్‌సీయూ భూముల‌పై సుప్రీం స్టే.. ఎంజీయూలో విద్యార్థుల హ‌ర్షాతిరేకం

హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీకి చెందిన 400 ఎక‌రాల‌ భూముల విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను త‌ప్పుబ‌డుతూ సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. సుప్రీం ఉత్త‌ర్వుల‌పై న‌ల్ల‌గొండ‌ మ‌హాత్మాగాంధీ విశ్వ‌విద్యాల‌య విద్యార్థులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. వరంగల్ వాయిస్, నల్ల‌గొండ విద్యా విభాగం (రామగిరి) : హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీకి చెందిన 400 ఎక‌రాల‌ భూముల విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను త‌ప్పుబ‌డుతూ సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. సుప్రీం ఉత్త‌ర్వుల‌పై న‌ల్ల‌గొండ‌ మ‌హాత్మాగాంధీ విశ్వ‌విద్యాల‌య విద్యార్థులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. వ‌ర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదిక వద్ద విద్యార్థులు స్వీట్లు పంపిణీ చేసుకుని ఆనందోత్సవం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు వాడపల్లి నవీన్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదన్నారు. వ...
MLA Nayini Rajender Reddy | ఆత్మరక్షణ శిక్షణ ప్రతి విద్యార్థికి అవసరం : ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
District News

MLA Nayini Rajender Reddy | ఆత్మరక్షణ శిక్షణ ప్రతి విద్యార్థికి అవసరం : ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

ఆత్మరక్షణ శిక్షణ ప్రతి విద్యార్థికి అవసరమని వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. వరంగల్ వాయిస్, హనుమకొండ  : ఆత్మరక్షణ  శిక్షణ ప్రతి విద్యార్థికి అవసరమని వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి  అన్నారు. హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం( జేఎన్ఎస్) ఇండోర్ స్టేడియంలో బాలికల స్వీయ రక్షణకై యూఎస్‌ఏలో లో స్థిరపడ్డ గ్రాండ్ మాస్టర్ గూడూరు సుధాకర్ నేతృత్వంలో ఆత్మరక్షణ మెలుకువలు (సెల్ఫ్ డిఫెన్స్) శిక్షణ శిబిరాన్ని కలెక్టర్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాం రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ అజీజ్ ఖాన్ తో  కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలికలపై పెరుగుతున్న నేరాల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని వారి భద్రతను నిర్ధారించడానికి పాఠశాలల్లో వారికి ఆత్మరక్షణ శిక్షణ ఇవ్వాలని సూచించారు. బాలికలకు ఆత్మరక్షణ, ఆరోగ్యం, ఫిట్‌నెస్‌, ఆత్మబలాభివృద్ధిని న...
Warangal Court | వ‌రంగ‌ల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు
District News

Warangal Court | వ‌రంగ‌ల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు

వ‌రంగ‌ల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వ‌చ్చింది. దీంతో పోలీసులు, లాయ‌ర్లు, కోర్టు సిబ్బంది అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. వరంగల్ వాయిస్, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వ‌చ్చింది. దీంతో పోలీసులు, లాయ‌ర్లు, కోర్టు సిబ్బంది అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. కోర్టు వ‌ద్ద‌కు చేరుకున్న బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది విస్తృతంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. లాయ‌ర్లు, కోర్టు సిబ్బంది భ‌యంతో గ‌డుపుతున్నారు. జిల్లా జ‌డ్జికి మెయిల్ ద్వారా ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి నుంచి బాంబు పెట్టామ‌ని మెయిల్ చేసిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ వ్య‌క్తి ఎవ‌ర‌నే విష‌యాన్ని తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని తెలిపారు. నిన్న మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, నాగ‌ర్‌క‌ర్నూల్ క‌లెక్ట‌రేట్ల‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే....
Jurala project | జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలి.. ఎమ్మెల్యేకు రైతుల మొర
District News

Jurala project | జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలి.. ఎమ్మెల్యేకు రైతుల మొర

ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న జూరాల ప్రాజెక్టు చెంతనే ఉన్న నందిమల్ల, మూలమల్ల, మస్తీపూర్ తదితర గ్రామాలకు సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మొర పెట్టుకున్నారు. వరంగల్ వాయిస్, అమరచింత : ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న జూరాల ప్రాజెక్టు  చెంతనే ఉన్న నందిమల్ల, మూలమల్ల, మస్తీపూర్ తదితర గ్రామాలకు సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి  మొర పెట్టుకున్నారు. సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు సమీపంలో ఔట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యేను నందిమల్ల గ్రామానికి చెందిన రైతులు రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సరోజ నరసింహుల తో పాటు పలువురు రైతులు విజ్ఞప్తి చేశ...