Warangalvoice

Author: Sahith Gaddam

JNTU | జీవో 21 రద్దు చేయాలని జేఎన్టీయూ అధ్యాపకుల విధుల బహిష్కరణ
Latest News

JNTU | జీవో 21 రద్దు చేయాలని జేఎన్టీయూ అధ్యాపకుల విధుల బహిష్కరణ

వరంగల్ వాయిస్, రామగిరి : మంథని జేఎన్టీయూలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు విధులు బహిష్కరించి గురువారం ఆందోళన చేపట్టారు. స్టేట్ అసోసిఅషన్ ఫర్ కాంట్రాక్టు టీచర్స్ పిలుపు మేరకు హైయర్ ఎడ్యూకేషన్ కౌన్సిల్ వద్ద సమస్యలు విన్నవించడానికి జీవో 21కు వ్యతిరకంగా శాంతియుత నిరసన చేపట్టడానికి వెళ్లిన రాష్ట్రం లోని 12 విశ్వవిద్యాలయాలకు చెందిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల అక్రమ అరెస్ట్, ప్రత్యేకంగా మహిళా కాంట్రాక్టు అధ్యాపకుల పట్ల పోలీసుల ప్రవర్తించిన తీరును వ్యతిరేకిస్తూ రాష్ట్ర అసోసియేషన్ విద్యా సంస్థలు బందుకు పిలుపునిచ్చారు. కాగా ఈ పిలుపులో భాగంగా జేఎన్టీయూహెచ్ అనుబంధ కాలేజీ అయిన మంథని కాలేజీకి చెందిన సహాయ ఆచార్యులు బంద్ లో పాల్గొన్నట్లు కాంట్రాక్ట్ అధ్యాపకులు తెలిపారు....
HCU | వెనక్కి తగ్గిన సర్కారు.. హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులు వాపస్‌
Top Stories

HCU | వెనక్కి తగ్గిన సర్కారు.. హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులు వాపస్‌

హెచ్‌సీయూ నుంచి పోలీసు బలగాల ఉపసంహరణ మంత్రుల సబ్‌ కమిటీ సమావేశంలో నిర్ణయం వీసీకి డిప్యూటీ సీఎం భట్టి లేఖ వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటానికి ప్రభుత్వం దిగివచ్చింది. హెచ్‌సీయూ క్యాంపస్‌ నుంచి పోలీసు బలగాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. విద్యార్థులపై నమోదు చేసిన కేసులను కూడా ఉపసంహరించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు హెచ్‌సీయూ వీసీ బీజేరావు కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార సోమవారం లేఖ రాశారు. హెచ్‌సీయూలోని కంచ గచ్చిబౌలి భూ సమస్యపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన మంత్రుల సబ్‌ కమిటీ సోమవారం సచివాలయంలో సమావేశమైంది. సబ్‌కమిటీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార అధ్యక్షతన జరిగిన సమావేశానికి కమిటీ సభ్యు లు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవ...
KTR | పెట్రోల్ ధ‌రల పెంపు.. మండిప‌డ్డ కేటీఆర్
Top Stories

KTR | పెట్రోల్ ధ‌రల పెంపు.. మండిప‌డ్డ కేటీఆర్

వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరల పెంపుపైన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప‌డ్డారు. అమెరికా అడ్డగోలుగా పెంచిన నూతన టారిఫ్ వలన తెలంగాణకు భారీ నష్టం వాటిల్లుతుంద‌ని పేర్కొన్నారు. నిన్న పెంచిన ధరలు అసాధారణం అని కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు తగ్గుతున్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రమే గ్యాస్ పెట్రోల్ ధరలు పెంచింది. మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు.. ధరలు తగ్గాల్సింది పోయి పెరుగుతున్నాయి. పెట్రోల్ ధరల పెంపు వలన నిత్యావసర సరుకుల ధరలు రవాణా చార్యులు భారీగా పెరుగుతాయి. సామాన్యుడి జీవితం అతలాకుతలమవుతుంది. బీజేపీ చెప్పిన అచ్చే దిన్ తీసుకురావడం ఇదేనా..? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. ట్రంప్ తీసుకువచ్చిన నూతన టారిఫ్ విధానంపైన కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా మాట్లాడలేదు. పార్లమె...
KTR | ఏడాది పాటు బీఆర్ఎస్ సిల్వ‌ర్ జూబ్లీ ఉత్స‌వాలు చేస్తాం : కేటీఆర్
Top Stories

KTR | ఏడాది పాటు బీఆర్ఎస్ సిల్వ‌ర్ జూబ్లీ ఉత్స‌వాలు చేస్తాం : కేటీఆర్

వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : తెలుగునాట విజ‌య‌వంతంగా 25 ఏండ్లు పూర్తి చేసుకున్న రెండు పార్టీలు బీఆర్ఎస్, టీడీపీ మాత్ర‌మే అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అందుకే ఏడాది పాటు సిల్వ‌ర్ జూబ్లీ ఉత్స‌వాలు నిర్వ‌హిస్తామ‌ని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు. వరంగల్ ఎల్కతుర్తిలో ఎలాంటి ట్రాఫిక్ లేకుండా.. ప్రజలకు ఇబ్బంది కాని ప్రాంతంలో సభ నిర్వహణ జరుగుతుంది. 1200 ఎకరాల్లో పార్కింగ్‌తో పాటు సభ ఏర్పాట్లు అన్ని ఘనంగా జరుగుతున్నాయి. ఆర్టీసీ ద్వారా 3000 బస్సుల కోసం విజ్ఞప్తి చేశాను.. ఆర్టీసీ సూత్రప్రాయంగా అంగీకరించింది. 27వ తేదీ ఆదివారం కావడం విద్యార్థులకు సెలవులు ఉండటం ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగవు అని కేటీఆర్ పేర్కొన్నారు. మా పార్టీ చరిత్రలో ఈ సమావేశం ఒక పెద్ద మీటింగ్ అవుతుంది. బహిరంగ సభ తర్వాత విద్యార్థి , కార్యకర్తల సభ్యత్వ నమోద...
Dilsukhnagar blast | దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు.. ఆ ఐదుగురికి ఉరి శిక్ష ఖరారు
Top Stories

Dilsukhnagar blast | దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు.. ఆ ఐదుగురికి ఉరి శిక్ష ఖరారు

వరంగల్ వాయిస్, దిల్‌సుఖ్‌నగర్‌ : దిల్‌సుఖ్‌నగర్‌  బాంబు పేలుళ్ల  కేసులో గతంలో ఎన్‌ఐఏ కోర్టు  ఇచ్చిన తీర్పునే తెలంగాణ హైకోర్టు  ఖరారు చేసింది. పేలుళ్ల కేసులో దోషులుగా ఉన్న ఆ ఐదుగురికి ఎన్‌ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను సమర్థించింది. బాంబు పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన ఐదుగురికి ఎన్‌ఐఏ కోర్టు 2016లో ఉరిశిక్ష విధించింది. ఆ శిక్షను రద్దు చేయాలని కోరుతూ దోషులు తెలంగాణ హైకోర్టులో అప్పీల్ పిటిషన్‌ దాఖలు చేశారు. దోషుల అప్పీల్‌ పిటిషన్‌పై ఇప్పటికే విచారణ జరిపిన హైకోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. దోషుల పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తున్నట్లు తెలిపింది. కాగా దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాప్‌లో, మిర్చిపాయింట్‌ వద్ద జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మరణించారు. 131 మంది గాయపడ్డారు. ఐదుగురు నిందితులకు ఎన్‌ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ ...
MLA Madhavaram Krishna Rao | భవిష్యత్తులో అన్ని ఆలయాలు అభివృద్ధి : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
Top Stories

MLA Madhavaram Krishna Rao | భవిష్యత్తులో అన్ని ఆలయాలు అభివృద్ధి : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

వరంగల్ వాయిస్, కేపీహెచ్‌బీ కాలనీ : కూకట్‌పల్లి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన దాసాంజనేయ స్వామి దేవాలయంలో ముందు భాగంలో ఏర్పాటు చేసిన రేకుల షెడ్డును ఇవాళ కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కురుమయ్య గారి నవీన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూకట్‌పల్లి ప్రాంతంలోని పురాతన ఆలయాలను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే రామాలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశామని భవిష్యత్తులో అన్ని ఆలయాలు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కురుమయ్య గారి కొండలరావు, గొట్టిముక్కల వెంగళరావు, వడ్డేపల్లి రాజేశ్వరరావు, ఆలయ కమిటీ చైర్మన్ తులసి రావు, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, దేవస్థాన కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు....
Grain Purchasing Centers : కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలి : ఎమ్మెల్యే వేముల వీరేశం
District News

Grain Purchasing Centers : కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలి : ఎమ్మెల్యే వేముల వీరేశం

వరంగల్ వాయిస్, కట్టంగూర్ : రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్ర‌భుత్వ మద్దతు ధర పొందాలని న‌కిరేక‌ల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం కట్టంగూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అలాగే ప‌లుచోట్ల‌ సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు తన ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శేఖర్ రెడ్డి, నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి, తాసీల్దార్ గుగులోతు ప్రసాద్, ఎంపీడీఓ పెరుమళ్ల‌ జ్ఞానప్రకాశ్‌రావు, వ్యవసాయ శాఖ అధికారి గిరిప్రసాద్, పీఏసీఎస్ సీఈఓ బండ మల్లారెడ్డి, ఏపీఎం సైదులు, మాజీ జడ్పీటీసీలు మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ్మ, మాజీ ఎంపీపీ రెడ్డిపల్లి వెంకటమ్మ సాగర...
MEO | ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య : ఎంఈఓ సత్యనారాయణ శెట్టి
District News

MEO | ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య : ఎంఈఓ సత్యనారాయణ శెట్టి

వరంగల్ వాయిస్, తిమ్మాజిపేట : ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని ఎంఈఓ సత్యనారాయణ శెట్టి అన్నారు. సోమవారం మండల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో నాలుగు, ఐదు తరగతులు చదువుతున్న విద్యార్థులకు ట్వినింగ్ కార్యక్రమంలో ద్వారా ఉన్నత పాఠశాలలో అందిస్తున్న నాణ్యమైన విద్య ప్రమాణాలు, సౌకర్యాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వృత్తి నైపుణ్యం కల అత్యున్నతమైన ఉపాధ్యాయుల ద్వారా విద్యాబోధన ఉంటుందన్నారు. విద్యార్థుల్లో జీవన ప్రమాణాలు పెంపొందించుట, సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగపడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దామని ఎంఈఓ తెలిపారు. సామాజిక స్పృహ కేవలం ప్రభుత్వ పాఠశాలలో లభిస్తుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఉచిత విద్య అందిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలోనే చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా, రఘు, రాంబాబు, మనోహర్, లక్ష్మయ...
HCU Land Dispute: హెచ్‌సీయూ భూములపై హైకోర్టు ఏం తేల్చిందంటే
Top Stories

HCU Land Dispute: హెచ్‌సీయూ భూములపై హైకోర్టు ఏం తేల్చిందంటే

హెచ్‌సీయూ భూములపై హైకోర్టులో విచారణ జరుగగా.. కొన్ని అంశాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు న్యాయవాదులు. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 24కు వాయిదా వేసింది. వరంగల్ వాయిస్, హైదరాబాద్ : హెచ్‌సీయూ భూ వివాదంపై  ఈరోజు (సోమవారం) హైకోర్టులో  విచారణ వాయిదా పడింది. ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం. ఈ అంశం సుప్రీంకోర్టు  పరిధిలో ఉందని డివిజన్ బెంచ్ పేర్కొంది. ఈ కేసులో కౌంటర్, రిపోర్ట్ ఈనెల 24లోగా సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. హెచ్‌సీయూ భూముల వివాదంపై సుప్రీం కోర్టు, హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో హైకోర్టులో హెచ్‌సీయూ భూములపై విచారణ జరుగగా.. పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీం కోర్టులో కేసు విచారణ దశలో ఉన్నందున ఈనెల 24కు వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. 24 లోపు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించారు. అలాగే ...
Kodad | మద్యం మత్తులో సిగరెట్‌ తాగుతూ నిద్రలోకి జారుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. నిప్పంటుకొని మృతి
District News

Kodad | మద్యం మత్తులో సిగరెట్‌ తాగుతూ నిద్రలోకి జారుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. నిప్పంటుకొని మృతి

వరంగల్ వాయిస్, కోదాడ : మద్యం మత్తులో సిగరెట్‌ వెలిగించుకుని.. దానిని ఆర్పివేయకుండా నిద్రలోకి జారుకున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మంటలు చెలరేగడంతో మరణించిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ (Kodad) మండలంలో చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మంగలి తండాకు చెందిన ధరావత్‌ బాలాజీ (52) నడిగూడెం మండలం చెన్నకేశవాపురం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు....