Warangalvoice

Author: Sahith Gaddam

KCR: మళ్లీ మనదే అధికారం.. కష్టపడి పనిచేయాలి
Political

KCR: మళ్లీ మనదే అధికారం.. కష్టపడి పనిచేయాలి

బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సీఎంపై ప్రజల్లో ఇంత తొందరగా వ్యతిరేకత వస్తుందనుకోలేదని ఎద్దేవా చేశారు. ఇంకా ఏం అన్నారనే విషయాలను ఇక్కడ చూద్దాం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) తాజాగా జరిగిన బీఆర్ఎస్ (భారతీయ రాష్ట్ర సమితి) నేతల విస్తృతస్థాయి సమావేశంలో కమ్యూనిస్టులపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో కమ్యూనిస్టులు అధికార పార్టీతో అనుసంధానమై, ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యతను విస్మరించి కాంగ్రెస్‌కు తొత్తులుగా మారిపోయారని ఆరోపించారు. అంతేకాదు ఈ సమావేశంలో కేసీఆర్, తెలుగుదేశం పార్టీ (TDP) ప్రాస్థానం గురించి కూడా మాట్లాడారు. ఎన్టీఆర్ (నందమూరి తారక రామారావు) పడిన కష్టనష్టాలను వివరించారు. టీడీపీ ఎన్టీఆర్ కాలంలో ఉన్న పరిస్థితులను గుర్తుచేశారు. ప్రజల్లో వ్యతిరేకత ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి పాలనపై ప్రజలలో వ్యతిర...
KCR | వందశాతం మళ్లీ అధికారంలోకి వస్తాం.. బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్‌ వ్యాఖ్యలు
Political

KCR | వందశాతం మళ్లీ అధికారంలోకి వస్తాం.. బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్‌ వ్యాఖ్యలు

KCR | తెలంగాణలో మళ్లీ వందశాతం అధికారంలోకి వస్తామని బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరుగుతున్నది. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : KCR | తెలంగాణలో మళ్లీ వందశాతం అధికారంలోకి వస్తామని బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరుగుతున్నది. భేటీలో బీఆర్‌ఎస్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకలపై కార్యక్రమాల నిర్వహణపై, సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు, ప్లీనరి అంశాలపై నేతలతో కేసీఆర్‌ చర్చించి.. శ్రేణులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావం మొదలు ఇప్పటి వరకు సుదీర్ఘ ప్రస్థానాన్ని పార్టీ నేతలకు గుర్తు చేశారు. ఉద్యమం, తెలంగాణ అభివృద్ధి కోసం చేసిన...
Yadadri: 23న లక్ష్మీ నారసింహ దివ్య స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్టామహోత్సవం
Cultural

Yadadri: 23న లక్ష్మీ నారసింహ దివ్య స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్టామహోత్సవం

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి స్వర్ణ విమాన గోపురానికి మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. దేశంలోనే మొట్టమొదటి ఎత్తయిన స్వర్ణగోపురం పనులు యాదాద్రిలో పూర్తి కావొచ్చాయి. వరంగల్ వాయిస్, యాదాద్రి : యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం (Sri Lakshmi Narasimha Swamy temple)లో బుధవారం (19వ తేదీ) నుంచి 23 వరకు మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు (Mahakumbhabhishekam Celebrations) జరగనున్నాయి. 23న సుదర్శన లక్ష్మీనరసింహ దివ్య విమాన స్వర్ణ గోపురం మహాకుంభాభిషేక ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది. ఈ రోజు ఉదయం 7.45 గంటలకు స్వస్తివాచనం, విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం పూజలతో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. సాయంత్రం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, మృత్సంగ్రహణం, యాగశాల ప్రవేశం, అఖండ దీప ప్రజ్వలన, అంకురార్పణ, ద్వార తో...
Karimnagar | అంతర్ జిల్లా ఘరానా దొంగ అరెస్ట్.. రూ.11 లక్షల విలువగల సొత్తు స్వాధీనం
Crime

Karimnagar | అంతర్ జిల్లా ఘరానా దొంగ అరెస్ట్.. రూ.11 లక్షల విలువగల సొత్తు స్వాధీనం

తాళం వేసిన ఇండ్లనే టార్గెట్‌గా చేసుకొని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా ఘరానా దొంగ మిట్టపల్లి లక్ష్మణ్‌ను మల్లాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ వాయిస్, మెటపల్లి : తాళం వేసిన ఇండ్లనే టార్గెట్‌గా చేసుకొని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా ఘరానా దొంగ  మిట్టపల్లి లక్ష్మణ్‌ను మల్లాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం మెటపల్లి సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నిరంజన్ రెడ్డి వివరాలను వెల్లడించారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన మిట్టపల్లి లక్ష్మణ్ అలియాస్ రవి అలియాస్ విజయ్(28) అను అతను నిజామాబాద్, నిర్మల్, కరీంనగర్, ఆదిలాబాద్ తదితర జిల్లాలో దొంగతనాలకు పాల్పడ్డాడు. వివిధ పోలీస్ స్టేషన్స్‌ పరిధిలో ఇప్పటి వరకు 40 కేసులు నమోదవగా పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. గత కొంతకాలంగా మెటపల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో తాళం వేసిన ఇళ్లలో వరుసగా దొంగత...
తెలంగాణ‌ హైకోర్టులో కేసు వాదిస్తుండ‌గా న్యాయ‌వాదికి గుండెపోటు
Today_banner

తెలంగాణ‌ హైకోర్టులో కేసు వాదిస్తుండ‌గా న్యాయ‌వాదికి గుండెపోటు

తెలంగాణ హైకోర్టులో విషాదం నెల‌కొంది. హైకోర్టులో కేసు వాదిస్తుండ‌గా ఓ న్యాయ‌వాది గుండెపోటుకు గుర‌య్యాడు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : తెలంగాణ హైకోర్టులో విషాదం నెల‌కొంది. హైకోర్టులో కేసు వాదిస్తుండ‌గా ఓ న్యాయ‌వాది గుండెపోటుకు గుర‌య్యాడు. కోర్టు హాలులోనే న్యాయ‌వాది కుప్ప‌కూలిపోయాడు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన జ‌డ్జి, ఇత‌ర న్యాయ‌వాదులు.. బాధిత న్యాయ‌వాదిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే న్యాయ‌వాది మృతి చెందిన‌ట్లు ఉస్మానియా వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన న్యాయ‌వాదిని వేణుగోపాల‌రావుగా గుర్తించారు. సంతాపంగా 21వ కోర్టు హాలులో జ‌డ్జి విచార‌ణ‌ను నిలిపివేశారు. మిగిలిన కోర్టు హాళ్ల‌లోనూ రెగ్యుల‌ర్ పిటిష‌న్ల‌ను వాయిదా వేశారు. మృతుడి నివాసంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. న్యాయ‌వాది వేణుగోపాల‌రావు మృతిప‌ట్ల హైకోర్టు జ‌డ్జిలు, న్యాయ‌వాదులు, సిబ...
Peddagattu Jathara  చౌడ‌మ్మ త‌ల్లికి బోనం స‌మ‌ర్పించిన ఎమ్మెల్సీ క‌విత‌
Cultural

Peddagattu Jathara చౌడ‌మ్మ త‌ల్లికి బోనం స‌మ‌ర్పించిన ఎమ్మెల్సీ క‌విత‌

పెద్ద‌గ‌ట్టు లింగమంతుల స్వామి జాత‌ర‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చౌడ‌మ్మ త‌ల్లికి క‌విత బోనం స‌మ‌ర్పించారు. వరంగల్ వాయిస్, సూర్యాపేట : పెద్ద‌గ‌ట్టు లింగమంతుల స్వామి జాత‌ర‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చౌడ‌మ్మ త‌ల్లికి క‌విత బోనం స‌మ‌ర్పించారు. అనంత‌రం ప్ర‌త్యేక పూజ‌లు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. బోనం ఎత్తుకుని ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న క‌విత‌కు పూజారులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. పూజ‌ల అనంత‌రం ఆశీర్వ‌చ‌నం అందించారు. ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు లింగమంతుల జాతర శుభాకాంక్షలు. స్వామివారికి బోనం చెల్లిండం నా అదృష్టంగా భావిస్తున్నాను. సముక్క సారక్క జాతర తరువాత రెండో అతి పెద్ద జాతర లింగమంతుల జాతర. తెలంగాణ రాష్ట్ర సంప్రదాయం, సంస్కృతికి లింగమంతుల జాతర నిదర్శనం. కేసీఆర్ హయాంలో జాతరకు రూ.14 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. ఆలయ...
KTR | రేవంత్ రెడ్డికి రియ‌ల్ ఎస్టేట్ త‌ప్ప‌.. స్టేట్ ఫిక‌ర్ లేదు : కేటీఆర్
Political

KTR | రేవంత్ రెడ్డికి రియ‌ల్ ఎస్టేట్ త‌ప్ప‌.. స్టేట్ ఫిక‌ర్ లేదు : కేటీఆర్

KTR | రేవంత్ రెడ్డికి స్వార్థం త‌ప్ప ఇంకోటి తెలియ‌దు.. రియ‌ల్ ఎస్టేట్ త‌ప్ప‌.. స్టేట్ ఫిక‌ర్ లేదు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఆమ‌న్‌గ‌ల్‌లో ఏర్పాటు చేసిన రైతు దీక్ష‌లో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : రేవంత్ రెడ్డికి స్వార్థం త‌ప్ప ఇంకోటి తెలియ‌దు.. రియ‌ల్ ఎస్టేట్ త‌ప్ప‌.. స్టేట్ ఫిక‌ర్ లేదు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఆమ‌న్‌గ‌ల్‌లో ఏర్పాటు చేసిన రైతు దీక్ష‌లో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. అన్న‌దాత‌లు, మ‌హిళ‌లు జాగ్ర‌త్త‌గా, చైత‌న్య‌వంతంగా ఉండాలి. నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలో రుణ‌మాఫీ కాక చందు అనే రైతు బ్యాంక్ ముందు బైక్ కాల‌బెట్టి నిర‌స‌న చెప్పిండు. ఆదిలాబాద్‌లో జాద‌వ్ రావు అనే రైతు బ్యాంకులోనే ఎండ్రిన్ తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. మేడ్చ‌ల్‌లో సురేంద్ రెడ్డి అనే రైతు వ్య‌వ‌సాయ శాఖ ...
Maha Kumbh | ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న ‘మహా’రద్దీ.. 37 రోజుల్లో 55 కోట్ల మంది పుణ్యస్నానాలు
Today_banner

Maha Kumbh | ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న ‘మహా’రద్దీ.. 37 రోజుల్లో 55 కోట్ల మంది పుణ్యస్నానాలు

Maha Kumbh | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. Maha Kumbh | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. 144 ఏళ్లకోసారి వచ్చే ఈ మేళా మరో ఎనిమిది రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు తాకిడి పెరిగింది. అక్కడ గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకూ 69 లక్షల మంది నదీ స్నానాలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ డేటా ప్రకారం.. మొత్తంగా 37 రోజుల్లో 55.31 కోట్ల మంది త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. కాగా, వారాంతం త‌ర్వాత ర‌ద్దీ త‌గ్గుతుంద‌ని అంతా భావించారు.. అయితే, సోమ‌వారం ఒక్కరోజే ఏకంగా కోటి మందికి పైగా భ‌క్తులు మ‌హా కుంభ‌మేళాకు వ‌చ్చార...
Bala Lakshmi | అసంపూర్తి సర్వే కాదు.. పూర్తిస్థాయి సర్వే చేయాలి: బీసీ కమిషన్ సభ్యురాలు బాల లక్ష్మి
Political

Bala Lakshmi | అసంపూర్తి సర్వే కాదు.. పూర్తిస్థాయి సర్వే చేయాలి: బీసీ కమిషన్ సభ్యురాలు బాల లక్ష్మి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేను పూర్తి స్థాయి నిర్వహించి, క్షేత్ర స్థాయిలో వివరాలను పొందుపరచాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యురాలు బాల లక్ష్మి (Bala Lakshmi) అన్నారు. వరంగల్ వాయిస్, పీర్జాదిగూడ, ఫిబ్రవరి 18: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేను పూర్తి స్థాయి నిర్వహించి, క్షేత్ర స్థాయిలో వివరాలను పొందుపరచాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యురాలు బాల లక్ష్మి (Bala Lakshmi) అన్నారు. మంగళవారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఎన్యుమరేటర్లు, వార్డు అధికారులకు కుల గణనపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వజ్రెష్ యాదవ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కుల గణన సర్వేకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని, ఈ సర్వేలో పాల్గొని వారి కుటుంబ సభ్యుల పేర్లు రీ సర్వేలో నమోదు చేసుకోవాలన్నారు. తదితర అంశాల...
Yennam Srinivas Reddy | మహబూబ్‌నగర్‌ను ఎడ్యుకేషన్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
Political

Yennam Srinivas Reddy | మహబూబ్‌నగర్‌ను ఎడ్యుకేషన్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్‌నగర్‌ను ఎడ్యుకేషన్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. ఇది ఒక్కరితో సాధ్యం కాదని, ప్రతి ఒక్కరు తమ వంతు సహాయం చేయాలని కోరారు. వరంగల్ వాయిస్, మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ను ఎడ్యుకేషన్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి  అన్నారు. ఇది ఒక్కరితో సాధ్యం కాదని, ప్రతి ఒక్కరు తమ వంతు సహాయం చేయాలని కోరారు. ఇందులో భంగా మహబూబ్‌నగర్‌ విద్యానిధిని ఏర్పాటు చేశామని, సామాజిక స్పృహ కలిగిన వారు సహకరించాలన్నారు. పట్టణంలోని బీఈడీ కాలేజీలో నూతనంగా నిర్మించిన శౌచాలయాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాలేజీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. మన కళాశాలను, పాఠశాలలను బాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీ పేద విద్యార్థులు చదువుకుంటారని వారికి...