Warangalvoice

Author: Sahith Gaddam

CM Revanth Reddy: కులగణనపై బీఆర్ఎస్, బీజేపీ కుట్ర. సీఎం రేవంత్‌రెడ్డి పైర్
Political

CM Revanth Reddy: కులగణనపై బీఆర్ఎస్, బీజేపీ కుట్ర. సీఎం రేవంత్‌రెడ్డి పైర్

CM Revanth Reddy: బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కులగణనలో ఇప్పటి వరకు వారి వివరాలు ఎందుకు నమోదు చేసుకోలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. 50శాతం ఉన్న ప్రజలు, అర శాతం ఉన్న వాళ్లను ప్రశ్నిస్తారని వాళ్లకు భయపట్టుకుందని విమర్శించారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్: కులగణన ప్రక్రియ నిర్వీర్యం చేసేలా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుట్ర పన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేశారు. కులగణనపై కోర్టుల్లో కేసులు వేసే ప్రమాదం ఉందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మాటిచ్చారని తెలిపారు. బలహీన వర్గాలు ముందుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని చెప్పారు. మా నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలని బీసీ కులగణన చేశామని తెలిపారు. ఇవాళ(శనివారం) గాంధీభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం...
మోదీ త‌ల‌కిందులుగా త‌పస్సు చేసినా.. రాహుల్ గాంధీ వంద జోడో యాత్ర‌లు చేసినా.. ఈ అభివృద్ధిని సాధించ‌లేరు : కేటీఆర్
Political

మోదీ త‌ల‌కిందులుగా త‌పస్సు చేసినా.. రాహుల్ గాంధీ వంద జోడో యాత్ర‌లు చేసినా.. ఈ అభివృద్ధిని సాధించ‌లేరు : కేటీఆర్

KTR | దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ త‌ల‌కిందులుగా త‌పస్సు చేసినా.. రాహుల్ గాంధీ మ‌రో వంద జోడోయాత్ర‌లు చేసినా.. కేసీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణలో గత పదేండ్లలో జరిగిన అభివృద్దిని సాధించలేరు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ త‌ల‌కిందులుగా త‌పస్సు చేసినా.. రాహుల్ గాంధీ మ‌రో వంద జోడోయాత్ర‌లు చేసినా.. కేసీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణలో గత పదేండ్లలో జరిగిన అభివృద్దిని సాధించలేరు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. గత పదేళ్లు కేసీఆర్ మొక్కవోని పట్టుదలతో తెలంగాణలో అభివృద్ధి యజ్ఞం చేశారు.. అని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదికనే చెప్తున్నది అని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు....
KTR | ఎస్ఎల్‌బీసీ ట‌న్నెల్ ప్ర‌మాదం.. పూర్తి బాధ్య‌త సీఎం రేవంత్ రెడ్డిదే : కేటీఆర్
Today_banner

KTR | ఎస్ఎల్‌బీసీ ట‌న్నెల్ ప్ర‌మాదం.. పూర్తి బాధ్య‌త సీఎం రేవంత్ రెడ్డిదే : కేటీఆర్

KTR | ఎస్ఎల్‌బీసీ ట‌న్నెల్ వద్ద జరిగిన ప్రమాదానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే వ‌హించాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : ఎస్ఎల్‌బీసీ ట‌న్నెల్ వద్ద జరిగిన ప్రమాదానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే వ‌హించాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. సుంకిశాలలో రీటైనింగ్ వాల్ కుప్పకూలిన ఘటన మరువకముందే రాష్ట్రంలో మరో దుర్ఘటన జరగడం కాంగ్రెస్ సర్కారు వైఫల్యానికి నిదర్శనం అని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కమీషన్ల వేటలో పర్యవేక్షణను గాలికొదిలేయడం, నాణ్యతా ప్రమాణాల విషయంలో పూర్తిగా రాజీపడిపోవడం వల్లే ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతున్నాయి. పైకప్పు కూలిన ఈ ఘటనలో లోపల ఎవరైనా చిక్కుకుని ఉంటే వారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలి. ఈ...
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు.. చిక్కుకున్న కార్మికులు వీళ్లే!
Today_banner

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు.. చిక్కుకున్న కార్మికులు వీళ్లే!

వరంగల్ వాయిస్, నాగర్ కర్నూలు: నాగర్‌కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎడమ వైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద పై కప్పు కూలడంతో అందులో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ఈ క్రమంలోనే సొరంగంలో చిక్కుకున్న కార్మికుల వివరాలను ప్రకటించింది. సొరంగంలో జర్విసింగ్‌ (పంజాబ్‌), సన్నీసింగ్‌ (జమ్ముకశ్మీర్‌), మనోజ్‌ దోబే (యూపీ), శ్రీనివాసులు, సందీప్‌, సంతోష్‌ జట్కా ఇరాన్‌ చిక్కుకున్నట్లుగా తెలిపింది. వారి ఆచూకీ కోసం సహాయక సిబ్బంది వెతుకుతున్నారు. కాగా, ఈ ప్రమాదంలో గాయపడిన పలువురు కార్మికులను ఈగలపెంట జెన్‌కో ఆస్పత్రికి తరలించారు. శనివారం ఉదయం ఎడవైపు సొరంగం 14వ కిలోమీటర్‌ వద్ద ప్రమాదం జరిగింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంట సమీపంలో పనులు జరుగుతుండగా టన్నెల్‌ పైకప్పు 3 మీటర్ల మేర పడిపోయింది. దీంతో ముగ్గురు కార్...
Mysterious disease | కొన్నూర్‌లో అంతుచిక్కని వ్యాధి.. మూడు రోజుల్లో 2500 కోళ్లు మృతి
Today_banner

Mysterious disease | కొన్నూర్‌లో అంతుచిక్కని వ్యాధి.. మూడు రోజుల్లో 2500 కోళ్లు మృతి

Mysterious disease | బర్డ్‌ ఫ్లూ కారణంగా ఏపీ (Andhrapradesh) లో పెద్ద సంఖ్యలో ఫారమ్‌ కోళ్లు, నాటు కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. తెలంగాణ (Telangana) లో కూడా అక్కడక్కడ బర్డ్‌ ఫ్లూ ఆనవాళ్లు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో వనపర్తి (Wanaparthy) జిల్లా మదనపురం (Madanapuram) మండలం కొన్నూర్‌ (Konnur) గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో భారీ సంఖ్యలో కోళ్లు మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. Mysterious disease : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే బర్డ్‌ ఫ్లూ (Bird Flu) ప్రమాద ఘంటికలు మోగుతుండగానే.. కొత్తగా మరో అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. బర్డ్‌ ఫ్లూ కారణంగా ఏపీ (Andhrapradesh) లో పెద్ద సంఖ్యలో ఫారమ్‌ కోళ్లు, నాటు కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. తెలంగాణ (Telangana) లో కూడా అక్కడక్కడ బర్డ్‌ ఫ్లూ ఆనవాళ్లు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో వనపర్తి (Wanaparthy) జిల్లా మదనపురం (Madanapuram) మండలం కొన్నూర్‌ (Konnur) గ్రామంల...
Gandhi Bhavan | రుణ‌మాఫీ కాలేదంటూ.. గాంధీ భ‌వ‌న్ మెట్ల మీద వృద్ధ రైతు ధ‌ర్నా..
Today_banner

Gandhi Bhavan | రుణ‌మాఫీ కాలేదంటూ.. గాంధీ భ‌వ‌న్ మెట్ల మీద వృద్ధ రైతు ధ‌ర్నా..

Gandhi Bhavan | కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే రూ. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన రేవంత్ రెడ్డి మాట‌లు.. నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయి. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే రూ. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన రేవంత్ రెడ్డి మాట‌లు.. నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయి. చాలా మంది రైతుల‌కు రుణ‌మాఫీ కాక‌పోవ‌డంతో.. రేవంత్ స‌ర్కార్‌పై ఆగ్ర‌హంతో ఉన్నారు. అవ‌కాశం ఉన్న చోట రైతులు నిర‌స‌న తెలుపుతున్నారు. తాజాగా ఓ వృద్ధ రైతు.. హైద‌రాబాద్‌లోని గాంధీ భ‌వ‌న్‌కు చేరుకుని ధ‌ర్నాకు దిగాడు. త‌న‌కు రుణ‌మాఫీ చేసే వ‌ర‌కు ఇక్క‌డ్నుంచి క‌దిలేది లేద‌ని ఆ రైతు తేల్చిచెప్పాడు. త‌న పేరు తోట యాద‌గిరి శాలిగౌరారం మండ‌లం తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గం.. 55 క్వింటాళ్ల 80 కిలోల ధాన్యాన్ని విక్ర‌యించాను. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు బోన‌స్ రాలేదు. అంతే కా...
Maganti Gopinath : ఎమ్మెల్యేకి తీవ్ర అనారోగ్యం.. ఆసుపత్రిలో చేరిక
Health

Maganti Gopinath : ఎమ్మెల్యేకి తీవ్ర అనారోగ్యం.. ఆసుపత్రిలో చేరిక

Maganti Gopinath : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. గత కొంత కాలంగా మాగంటి గోపినాథ్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. గత నాలుగు రోజుల క్రితం ఆ సమస్య మరింత తీవ్రం కావడంతో.. కుటుంబ సభ్యులు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆయన్ని నగరంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యాన్ని వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. గత కొంత కాలంగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో గత నాలుగు రోజుల క్రితం ఈ సమస్య మరింత పెరిగింది. దీంతో కుటుంబ సభ్యులు.. ఆయన్ని ఆగమేగాల మీద ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు...
MLC Kavitha | సుప్రీం తీర్పు వ‌ల్లే ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు బాట‌లు.. రేవంత్, మోదీ చేసిందేమీ లేదు : ఎమ్మెల్సీ క‌విత‌
Political

MLC Kavitha | సుప్రీం తీర్పు వ‌ల్లే ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు బాట‌లు.. రేవంత్, మోదీ చేసిందేమీ లేదు : ఎమ్మెల్సీ క‌విత‌

MLC Kavitha | సుప్రీంకోర్టు తీర్పు వ‌ల్లే ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు బాట‌లు ప‌డ్డాయ‌ని, ఈ విష‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేద‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత పేర్కొన్నారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : సుప్రీంకోర్టు తీర్పు వ‌ల్లే ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు బాట‌లు ప‌డ్డాయ‌ని, ఈ విష‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేద‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత పేర్కొన్నారు. ఎమ్మెల్సీ క‌విత నివాసంలో దళిత బంధు సాధన సమితి సమావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా క‌విత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎస్సీ వర్గీకరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదు. షమీమ్ అక్తర్ కమిషన్ నివేదికను బయటపెట్టి.. వెంటనే వర్గీకరణ చేయాలి. దళితుల మధ్య పంచాయితీ పెట్టవద్దు… ఎవరికీ అన్యాయం జరగకుండా వర్గీకరణ ఉండాలి. ఎస్సీ వర్గీకరణ పేరు చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మరో మోసం చేశారు....
Omar Abdullah | ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన ఒమర్‌ అబ్దుల్లా.. ఇకపై కారులో వెళ్లబోనని స్పష్టం
Today_banner

Omar Abdullah | ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన ఒమర్‌ అబ్దుల్లా.. ఇకపై కారులో వెళ్లబోనని స్పష్టం

Omar Abdullah | జమ్ముకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా మరోసారి ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సౌకర్యాన్ని ఆయన ప్రశంసించారు. చాలా సమయం ఆదా అయ్యిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇకపై కారులో వెళ్లబోనని అన్నారు. వరంగల్ వాయిస్, న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) మరోసారి ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సౌకర్యాన్ని ఆయన ప్రశంసించారు. చాలా సమయం ఆదా అయ్యిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇకపై కారులో వెళ్లబోనని అన్నారు. దక్షిణాసియా ట్రావెల్ అండ్‌ టూరిజం ఎక్స్ఛేంజ్ SATTE 2025 కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒమర్‌ అబ్దుల్లా ఢిల్లీకి వచ్చారు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. టూరిజం ప్రమోషన్ ఈవెంట్‌ జరిగే యశోభూమికి 25 నిమిషాల్లో చేరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, అక్కడకు చేరుకోవడానికి కారులో గంటన్నర కంటే ఎక్కువ సమయం పడుతుందని ఒమర్‌ అబ్దుల్లా తెలిపారు. మెట్రో రైల...
Gandra Venkataramana Reddy | హ‌త్యా రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకే అల‌వాటు.. బీఆర్ఎస్ పార్టీ హ‌త్యా రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హించ‌దు అని మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి స్ప‌ష్టం చేశారు.
Political

Gandra Venkataramana Reddy | హ‌త్యా రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకే అల‌వాటు.. బీఆర్ఎస్ పార్టీ హ‌త్యా రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హించ‌దు అని మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి స్ప‌ష్టం చేశారు.

వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : హ‌త్యా రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకే అల‌వాటు.. బీఆర్ఎస్ పార్టీ హ‌త్యా రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హించ‌దు అని మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి స్ప‌ష్టం చేశారు. మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మ‌తి భ్ర‌మించి మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. తెలంగాణ భ‌వ‌న్‌లో గండ్రా వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. భూపాలపల్లిలో రాజలింగ మూర్తి హత్యను బీఆర్ఎస్ మాజీ శాసన సభ్యుడిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. హత్య తర్వాత కాంగ్రెస్ పార్టీ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతోంది. ఈ హ‌త్య‌ను బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, హ‌రీశ్‌రావుకు ఆపాదించాలని కాంగ్రెస్ శతవిధాల ప్రయత్నించడం దుర్మార్గం. స్థానిక భూవివాదం నేపథ్యంలో ఈ హత్య జరిగిందని ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. కొందరి ఒత్తిడితో రాజలింగ మూర్తి భార్య నాపై ఆరోపణలు చేస్తున్నారు అని వెంక‌ట ర‌మ‌ణారెడ్డి తెలిపారు. ఈ హ‌త్య‌పై సీబీఐ, సీఐడీ విచార...