Warangalvoice

Author: Sahith Gaddam

కాంగ్రెస్‌ పార్టీ తీరుపై ఆ పార్టీ ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి
Political

కాంగ్రెస్‌ పార్టీ తీరుపై ఆ పార్టీ ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి

Congress MLA | కాంగ్రెస్‌ పార్టీ  తీరుపై ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడుతున్నవారికి సరైన ప్రాధాన్యం ఇవ్వడంలేదని అన్నారు. నిన్నమొన్న పార్టీలో చేరినవాళ్లకు పదవులు కట్టబెట్టి అందలం ఎక్కించడం ఏమాత్రం సబబుకాదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ తీరుపై ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడుతున్నవారికి సరైన ప్రాధాన్యం ఇవ్వడంలేదని అన్నారు. నిన్నమొన్న పార్టీలో చేరినవాళ్లకు పదవులు కట్టబెట్టి అందలం ఎక్కించడం ఏమాత్రం సబబుకాదని వ్యాఖ్యానించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే  మల్‌రెడ్డి రంగారెడ్డి  ఈ విధంగా పార్టీ తీరుపై అసంతృప్తి గళం వినిపించారు. తెలంగాణ మంత్రివర్గంలో రంగారెడ్డి జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న జిల్లా రంగ...
T PCC | రాహుల్ గాంధీ ఆదేశాల మేర‌కే తీన్మార్ మ‌ల్ల‌న్న స‌స్పెండ్ : టీ పీసీసీ చీఫ్‌
Political

T PCC | రాహుల్ గాంధీ ఆదేశాల మేర‌కే తీన్మార్ మ‌ల్ల‌న్న స‌స్పెండ్ : టీ పీసీసీ చీఫ్‌

T PCC | కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న స‌స్పెన్ష‌న్‌పై టీ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. తీన్మార్ మ‌ల్ల‌న్న విష‌యంలో ఏఐసీసీ నిర్ణ‌యం తీసుకుంద‌న్నారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న స‌స్పెన్ష‌న్‌పై టీ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. తీన్మార్ మ‌ల్ల‌న్న విష‌యంలో ఏఐసీసీ నిర్ణ‌యం తీసుకుంద‌న్నారు. రాహుల్ గాంధీ ఆదేశాల‌తోనే తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసిన‌ట్లు పేర్కొన్నారు. పార్టీ కార్య‌క‌లాపాల‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించేవారికి ఇది ఒక హెచ్చ‌రిక అని ఆయ‌న తెలిపారు. భ‌విష్య‌త్‌లో ఎవ‌రైనా పార్టీ లైన్ దాటితే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని మ‌హేశ్ కుమార్ గౌడ్ హెచ్చ‌రించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై ఆ పార్టీ వేటు వేసిన సంగ‌తి తెలిసిందే. తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను స‌స్పెండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ...
MLC Kavitha | కొడంగ‌ల్ ఎత్తిపోత‌ల వ‌ల్ల 4.5 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు న‌ష్టం : ఎమ్మెల్సీ క‌విత‌
Political

MLC Kavitha | కొడంగ‌ల్ ఎత్తిపోత‌ల వ‌ల్ల 4.5 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు న‌ష్టం : ఎమ్మెల్సీ క‌విత‌

MLC Kavitha | కొడంగ‌ల్ - నారాయణపేట్ ఎత్తిపోతల పథకం వల్ల పాలమూరు - రంగారెడ్డి కంపోనెంట్స్ తీసివేయడం వల్ల 4.5 లక్షల ఎకరాలకు నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత పేర్కొన్నారు. వరంగల్ వాయిస్, నాగ‌ర్‌క‌ర్నూల్ : కొడంగ‌ల్ – నారాయణపేట్ ఎత్తిపోతల పథకం వల్ల పాలమూరు – రంగారెడ్డి కంపోనెంట్స్ తీసివేయడం వల్ల 4.5 లక్షల ఎకరాలకు నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు బీమా నుంచి కాకుండా జూరాల నుంచి నీటిని తీసుకుంటే మంచిదని ఇంజనీర్లు చెబుతున్నారని తెలిపారు. నాగ‌ర్‌క‌ర్నూల్‌లో ఎమ్మెల్సీ క‌విత మీడియాతో మాట్లాడారు. 8 మంది ప్రాణాలు ఎస్ఎల్‌బీసీ సొరంగంలో కొట్టుమిట్టాడుతుంటే… కాంగ్రెస్ నాయకులు పార్టీ సమావేశానికి వెళ్లారు. ఒక్క మంత్రి కూడా ఘటనా స్థలం వద్ద ఇప్పుడు లేరంటే ప్రాణాలంటే కాంగ్రెస్ నాయకులకు లెక్కలేదనేది అర్థ‌మ‌వుతుంది. కేసీఆర్ హాయాంలో ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ను 11.5 ...
Brahmanandam | ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు శాల్తీ లేచిపోతుంది.. నిట్లో సందడి చేసిన బ్రహ్మానందం
Cultural

Brahmanandam | ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు శాల్తీ లేచిపోతుంది.. నిట్లో సందడి చేసిన బ్రహ్మానందం

Brahmanandam | ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు శాల్తీ లేచిపోతుంది.. అంటూ హాస్యనటుడు డాక్టర్ కె.బ్రహ్మానందం విద్యార్థులను ఉత్సాహపరిచారు. వరంగల్ వాయిస్, హనుమకొండ : ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు శాల్తీ లేచిపోతుంది.. అంటూ హాస్యనటుడు డాక్టర్ కె.బ్రహ్మానందం  విద్యార్థులను ఉత్సాహపరిచారు. వరంగల్ నిట్లో(Warangal NIT) స్ప్రింగ్ స్ప్రి 2025 ప్రారంభించి మాట్లాడారు. చాలా పేదరికం నుంచి ఎన్నో అడ్డంకులు, అవహేళనలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానన్నారు. లాల్ బహుదూర్ శాస్త్రి, డా. బీఆర్‌ అంబేద్కర్, అబ్దుల్ కలాం ఎంతో కష్టపడి చదివారని, వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. లెక్చరర్ గా చేసినప్పటికీ నాకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని ఆలోచించగా సినిమాల్లో నటించే అవకాశం రాగా ఒక్కో అడుగు వేస్తూ ఒడిసి పట్టుకున్నానని తెలిపారు. నీ దగ్గర డబ్బు ఉంటేనే నీకు గౌరవం ఇస్తారు. కృషి, పట్టుదల సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. వ...
Rajnath Singh: శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలంటూ విద్యార్థులకు పిలుపు
District News

Rajnath Singh: శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలంటూ విద్యార్థులకు పిలుపు

Rajnath Singh: యూపీఐ లావాదేవీలలో భారత్ నేడు అగ్రగామిగా ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. గతేడాది అంటే.. 2024లో భారత్‌లో రూ. 171 బిలియన్ల లావాదేవీలు జరిగాయని వివరించారు. ఈ మొత్తం లావాదేవీల విలువ రూ. 2.45 లక్షల కోట్ల రూపాయిలని ఆయన సోదాహరణగా వివరించారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్: శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలని యువతకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపు నిచ్చారు. గ్లోబల్ లీడర్ షిప్‌లో యువతదే కీలక పాత్ర అని ఆయన స్పష్టం చేశారు. నేషనల్ సైన్స్ డే సందర్భంగా హైదరాబాద్‌లోని విజ్ఞాన్ వైభవ్-2025ను సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చే మార్పుల పట్ల విద్యార్ధులు అవగాహన కలిగి ఉండాలన్నారు. రక్షణ శాఖ చారిత్రాత్మక విజయాల్లో కేంద్రం విశేష పాత్ర పోషిస్తుం...
MLC Kavitha | ఆయా రంగాల్లో బీసీల‌కు 46 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల్సిందే : ఎమ్మెల్సీ క‌విత‌
District News

MLC Kavitha | ఆయా రంగాల్లో బీసీల‌కు 46 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల్సిందే : ఎమ్మెల్సీ క‌విత‌

MLC Kavitha | బీసీల‌కు విద్యా, ఉపాధి, రాజ‌కీయ రంగాల్లో వేర్వేరుగా 46 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత డిమాండ్ చేశారు. వరంగల్ వాయిస్, నాగ‌ర్‌క‌ర్నూల్ : బీసీల‌కు విద్యా, ఉపాధి, రాజ‌కీయ రంగాల్లో వేర్వేరుగా 46 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత డిమాండ్ చేశారు. అయితే ఈ మూడింటికి సంబంధించి వేర్వేరు బిల్లుల‌ను అసెంబ్లీలో ప్ర‌వేశపెట్టాల‌ని డిమాండ్ చేశారు క‌విత‌. నాగర్‌కర్నూల్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్వర్యంలో నిర్వ‌హించిన రౌండ్ టేబుల్ సమావేశంలో క‌విత ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు. బీసీలకు విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో 46 శాతం రిజర్వేషన్లకు వేర్వేరు బిల్లులను పెట్టాలి. ఒకటే బిల్లు పెడితే మొదటికే మోసం వస్తుందని తొలి నుంచి నేను వాదిస్తున్నాను. ప్రభుత్వం దిగొచ్చి మూడు బిల్లులను పెట్టాలి. మూడింటికి ఒకే బిల్లు పెడితే కోర్టుల్లో నిలవదు అని ...
Harish Rao | మాజీ మంత్రి హ‌రీశ్‌రావుపై మ‌రో కేసు న‌మోదు
Political

Harish Rao | మాజీ మంత్రి హ‌రీశ్‌రావుపై మ‌రో కేసు న‌మోదు

Harish Rao | ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని నిత్యం ప్ర‌శ్నిస్తున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావుపై రేవంత్ స‌ర్కార్ క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతూనే ఉంది. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని నిత్యం ప్ర‌శ్నిస్తున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావుపై రేవంత్ స‌ర్కార్ క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతూనే ఉంది. ఏదో ఒక ర‌కంగా హ‌రీశ్‌రావుపై కేసులు నమోదు చేస్తూ.. ఇబ్బందుల‌కు గురి చేస్తుంది రేవంత్ స‌ర్కార్. తాజాగా హ‌రీశ్‌రావుపై మ‌రో కేసు న‌మోదైంది. మాజీ మంత్రి హ‌రీశ్‌రావుపై చ‌క్ర‌ధ‌ర్ గౌడ్ బాచుప‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా, కేసు న‌మోదు చేశారు. హ‌రీశ్‌రావుపై 351(2), ఆర్‌డ‌బ్ల్యూ3(5) సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. హ‌రీశ్‌రావుతో పాటు సంతోష్ కుమార్, రాములు, వంశీపై కేసు న‌మోదైంది....
Farmers Protest | పంచాయతీ కార్యాలయంలో నీటిపారుదల అధికారుల నిర్బంధం
Political

Farmers Protest | పంచాయతీ కార్యాలయంలో నీటిపారుదల అధికారుల నిర్బంధం

Farmers Protest | నిజాంసాగర్ కెనాల్ నీటిని చివరి ఆయకట్టు వరకు అందడం లేదని ఆరోపిస్తూ సాలూర మండలం సాలురా క్యాంప్ గ్రామంలో నీటి పారుదల అధికారులను రైతులు నిర్బంధించారు. వరంగల్ వాయిస్,  బోధన్ రూరల్ : నిజాంసాగర్ (Nizamsagar ) కెనాల్ నీటిని చివరి ఆయకట్టు వరకు అందడం లేదని ఆరోపిస్తూ సాలూర మండలం సాలురా క్యాంప్ గ్రామంలో నీటి పారుదల అధికారులను ( Irrigation Officers ) రైతులు (Farmers)  నిర్బంధించారు. నిజాంసాగర్ డి 28 కెనాల్ లో నీళ్లు రావడం లేదని ఫిర్యాదు చేయడంతో ఇరిగేషన్ అధికారులు కెనాల్‌ను పరిశీలించడానికి శుక్రవారం గ్రామానికి వచ్చారు. దీంతో ఆగ్రహించిన రైతులు నిజాంసాగర్ కెనాల్‌ నీటిని విడుదల చేసి వారం రోజులు కావస్తున్న కింది ఆయకట్టుకు నీళ్లు రాకపోవడంతో రైతులు ఇరిగేషన్ అధికారులను గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి తాళం వేశారు. నిజాంసాగర్ కెనాల్ నీరు చివరి ఆయకట్టు వరకు అందకపోవడంతో పంటలు ఎండుతున్...
SpringSpree | వరంగల్‌ NIT లో మూడు రోజులు స్ప్రింగ్‌ స్ప్రీ ఈవెంట్‌.. పాల్గొననున్న బ్రహ్మానందం
Today_banner

SpringSpree | వరంగల్‌ NIT లో మూడు రోజులు స్ప్రింగ్‌ స్ప్రీ ఈవెంట్‌.. పాల్గొననున్న బ్రహ్మానందం

SpringSpree | వరంగల్ నిట్‌ స్ప్రింగ్‌ స్ప్రీ ఈవెంట్‌ 2025 కి ముస్తాబైంది. ఈ నెల 28 నుంచి మార్చి 2 వరకు మూడు రోజులపాటు ఈ సాంస్కృతిక మహోత్సవం జరగనుంది. గురువారం నిట్లో జరిగిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ బిద్యాధర్ సుబుది వివరాలను వెల్లడించారు. వరంగల్ వాయిస్,  హనుమకొండ  : వరంగల్ నిట్‌ స్ప్రింగ్‌ స్ప్రీ ఈవెంట్‌ 2025 కి ముస్తాబైంది. ఈ నెల 28 నుంచి మార్చి 2 వరకు మూడు రోజులపాటు ఈ సాంస్కృతిక మహోత్సవం జరగనుంది. గురువారం నిట్లో జరిగిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ బిద్యాధర్ సుబుది వివరాలను వెల్లడించారు. సంగీతం, నృత్యం, కళలు, వినోదం వంటి రంగాల్లో ప్రతిభను వెలికి తీయడానికి వేదికగా స్ప్రింగ్‌ స్ప్రీ ఈవెంట్‌ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశంలోని ప్రముఖ కళాశాలల వార్షికోత్సవాల్లో ఒకటిగా వరంగల్‌ నిట్‌ పేరుగాంచింది. దేశవ్యాప్తంగా ఉన్న నిట్ కాలేజీల విద్యార్థులు ఈ మహోత్సవానికి హాజరవుతారని బిద్యాధర్‌ ...
MLC Elections 2025: పోలింగ్ ముగిసింది.. గెలిచేదెవరు..
Political

MLC Elections 2025: పోలింగ్ ముగిసింది.. గెలిచేదెవరు..

మొత్తం మూడు స్థానాలకు పోలింగ్ జరిగినప్పటికీ.. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం అందరిదృష్టి ఆకర్షిస్తోంది. మొత్తం 56 మంది అభ్యర్థులు ఇక్కడి నుంచి పోటీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీతో పాటు మరో ఇండిపెండెంట్ అభ్యర్థి మధ్య తీవ్రపోటీ.. వరంగల్ వాయిస్, హైదరాబాద్ : తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. మార్చి3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను లెక్కిస్తారు. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహించడంతో ఫలితాలు వెల్లడించడానికి రెండు నుంచి మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం నిర్వహించారు. మొత్తం మూడు స్థానాలకు పోలింగ్ జరిగినప్పటికీ.. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం...