Warangalvoice

Author: Sahith Gaddam

మార్కెట్‌ యార్డులో తడిసి ముద్దయిన ధాన్యం.. సివిల్‌ సప్లై అధికారులపై హరీశ్‌రావు సీరియస్‌..
Latest News

మార్కెట్‌ యార్డులో తడిసి ముద్దయిన ధాన్యం.. సివిల్‌ సప్లై అధికారులపై హరీశ్‌రావు సీరియస్‌..

అధికారుల నిర్లక్ష్యం, సకాలంలో ధాన్యం సేకరణ చేయడంలో ప్రభుత్వ వైఫల్యం వల్ల రోజుల తరబడి మార్కెట్ యార్డుల వద్ద రైతులు వేచి చూస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసిన నేపథ్యంలో సిద్దిపేట మార్కెట్‌యార్డులో తడిసిన ధాన్యాన్ని హరీశ్‌రావు పరిశీలించారు. ఇప్పటికే మార్కెట్‌లో 3,500 ధాన్యం బస్తాలు తరలించడానికి సిద్ధంగా ఉన్నా, లారీలు లేకపోవడంతో, ధాన్యం నీటిపాలైందని ఈ సందర్భంగా హరీశ్‌రావు ముందు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యాన్ని చూసి కన్నీరు మున్నీరవుతున్న రైతులను ఓదార్చారు. అనంతరం ఆర్డీవో, సివిల్ సప్లై అధికారులపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా సివిల్‌ సప్లై డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌కు ఆయన ఫోన్‌ చేసి మాట్లాడారు. లారీలు, హామీలను వెంటనే సమకూర్చి ధాన్యాన్ని సేకరించాలని ఆదేశించారు. లారీ అసోసియేషన్‌తో మాట్లాడి ధాన్య సేకరణకు లారీలను పంపించవలసిం...
Veldanda | చిన్నారుల చదువులకు రూ.20వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ సర్పంచ్
District News

Veldanda | చిన్నారుల చదువులకు రూ.20వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ సర్పంచ్

వరంగల్ వాయిస్, వెల్దండ  : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామంలో గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జల్లల యాదయ్య పిల్లల చదువు కోసం కుప్పగండ్ల మాజీ సర్పంచ్ మొక్తాల శేఖర్ రూ.20 వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు. అదేవిధంగా భవిష్యత్తులో వాళ్ల కుటుంబానికి అన్నివేళలా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కుప్పగండ్ల మాజీ ఎంపిటిసి మట్ట బాలకృష్ణ గౌడ్, మాజీ వార్డ్ మెంబర్ నారయ్య, మాజీ వార్డు మెంబర్‌ కొమ్మగోని వెంకటయ్య గౌడ్, గోరేటి దశరథం, గుంటి రామకృష్ణ, గోరేటి రాములు, జల్లెల్ల అశోక్ యాదవ్, దుబ్బ చంద్రయ్య, బాకారం భరత్, దుబ్బ వెంకటయ్య, గోరేటి లక్ష్మయ్య, గోరేటి బుజ్జయ్య, గోరేటి కృష్ణయ్య, గుంటి రామకృష్ణ, గోరేటి రాములు జల్లెల్ల అశోక్ యాదవ్, దుబ్బ చంద్రయ్య బాకారం భరత్, దుబ్బ వెంకటయ్య, గోరేటి లక్ష్మయ్య, గోరేటి బుజ్జయ్య, గోరేటి కృష్ణయ్య, ఎండీ జహంగీర్, ఊర రాములు, గో...
ప్రై‘వేటు’కు సిద్ధంగా వైటీపీఎస్‌!
Latest News

ప్రై‘వేటు’కు సిద్ధంగా వైటీపీఎస్‌!

యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను ఓ ప్రైవేట్‌ సంస్థకు కట్టబెట్టేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఈ ప్లాంట్‌ ఆపరేషన్‌ అండ్‌ మెయింటెన్స్‌ (ఓఅండ్‌ఎం)ను సదరు సంస్థకు అప్పగించేందుకు భారీ కుట్ర చేశారా? అంటే.. టీజీ జెన్‌కో ఇంజినీర్లు అవుననే అంటున్నారు. ప్లాంట్‌ నిర్వహణ లోపం వెనక కుట్ర ఉద్దేశపూర్వకంగానే ఓఅండ్‌ఎం స్టాఫ్‌ ఇంజినీర్లను కేటాయించని జెన్‌కో ఆరు నెలలుగా వేధిస్తున్న సిబ్బంది కొరత సీఈ లేఖ రాసినా స్పందన శూన్యం ప్లాంట్‌ను ప్రైవేటుకు అప్పగించే ప్లాన్‌ జెన్‌కో ఇంజినీర్ల అనుమానం వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను ఓ ప్రైవేట్‌ సంస్థకు కట్టబెట్టేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఈ ప్లాంట్‌ ఆపరేషన్‌ అండ్‌ మెయింటెన్స్‌ (ఓఅండ్‌ఎం)ను సదరు సంస్థకు అప్పగించేందుకు భారీ కుట్ర చేశారా? అంటే.. టీజీ జెన్‌కో ఇంజినీర్లు అవుననే అంటున్నారు. కుట్రలో భ...
Telangana DGP | కొత్త డీజీపీ ఎంపిక.. యూపీఎస్సీకి 8 మందితో జాబితా.. చాన్స్‌ ఎవరికి దక్కేనో?
Latest News

Telangana DGP | కొత్త డీజీపీ ఎంపిక.. యూపీఎస్సీకి 8 మందితో జాబితా.. చాన్స్‌ ఎవరికి దక్కేనో?

ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రస్తుత డీజీపీ డా. జితేందర్‌ రిటైర్‌ కానున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పోలీస్‌ బాస్‌ ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇప్పటికే ఈ విషయమై కసరత్తు పూర్తిచేసిన రాష్ట్ర సర్కార్‌ ఎనిమిది మంది సీనియర్‌ అధికారుల పేర్లతో కూడిన జాబితాను యూపీఎస్సీకి పంపించింది. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇక నూతన డీజీపీ (Telangana DGP) ఎంపికపై దృష్టి సారిచింది. బుధవారంతో సీఎస్‌ శాంతి కుమారి పదవీకాలం ముగియనుంది. దీంతో ఆమె స్థానంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుకు ప్రభుత్వం ప్రమోషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రస్తుత డీజీపీ డా. జితేందర్‌ రిటైర్‌ కానున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పోలీస్‌ బాస్‌ ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇప్పటికే ఈ విషయమై కసరత్తు పూర్తిచేసి...
Peddapalli | పహల్గాం ఉగ్రదాడికి నిరసగా పెద్దపల్లి బంద్‌.. తెరచుకోని దుకాణాలు
Latest News

Peddapalli | పహల్గాం ఉగ్రదాడికి నిరసగా పెద్దపల్లి బంద్‌.. తెరచుకోని దుకాణాలు

వరంగల్ వాయిస్, పెద్దపల్లి : జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడికి వ్యతిరేకంగా పెద్దపల్లిలో బంద్‌ నిర్వహిస్తున్నారు. ఉగ్రదాడిలో చనిపోయిన మృతుల ఆత్మకు శాంతిచేకూరాలని కోరూతూ పెద్దపల్లి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పట్టణంలో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్నారు. ఒక్క షాపు కూడా తెరచుకోకపోవడంతో వీధులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. పెద్దపల్లి కూరగాయల మార్కెట్‌ జెండా చౌరస్తా కామన్‌ రోడ్‌లో బంద్‌ సంపూర్ణంగా జరుగుతున్నది....
Sircilla | ఇంట్లో చోరీకి యత్నించిన ఏఎస్‌ఐ.. పట్టుబడటంతో దేహశుద్ధి
District News

Sircilla | ఇంట్లో చోరీకి యత్నించిన ఏఎస్‌ఐ.. పట్టుబడటంతో దేహశుద్ధి

ఆయనో ఏఎస్‌ఐ. నెలనెలా మంచి జీతం. అయినా ఖర్చులకు డబ్బులు సరిపోతలేవేమో.. ఓ ఇంట్లో చోరీకి యత్నించాడు. ఎంతైనా ప్రొఫెషనల్‌ దొంగ కాదుకదా..! దొరికిపోయాడు. ఇంకేముంది జనం ఊరికే ఉంటారా.. చితకబాది పోలీసులకు అప్పగించారు. తారా అతడు కూడా ఓ పోలీసు అని తెలుసుకుని ముక్కున వేలేసుకున్నారు. వరంగల్ వాయిస్,  సిరిసిల్ల రూరల్ : ఆయనో ఏఎస్‌ఐ. నెలనెలా మంచి జీతం. అయినా ఖర్చులకు డబ్బులు సరిపోతలేవేమో.. ఓ ఇంట్లో చోరీకి యత్నించాడు. ఎంతైనా ప్రొఫెషనల్‌ దొంగ కాదుకదా..! దొరికిపోయాడు. ఇంకేముంది జనం ఊరికే ఉంటారా.. చితకబాది పోలీసులకు అప్పగించారు. తారా అతడు కూడా ఓ పోలీసు అని తెలుసుకుని ముక్కున వేలేసుకున్నారు. మహేశ్‌ అనే వ్యక్తి రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల  మున్సిపల్ పరిధిలోని సర్థపూర్‌లో ఉన్న 17వ పోలీస్ బెటాలియన్‌లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. అక్కడే ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. అయితే కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడు...
MLA KP Vivekananda | ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎగిరేది గులాబీ జెండానే : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
Top Stories

MLA KP Vivekananda | ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎగిరేది గులాబీ జెండానే : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

వరంగల్ వాయిస్, దుండిగల్ : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్నారు. ఇవాళ దుండిగల్ మున్సిపాలిటీ పరిధి గండి మైసమ్మలోని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఛలో వరంగల్ సభ సన్నాహక సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఛలో వరంగల్ సభ విజయవంతంపై ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతోపాటు అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని బంగారుమయంగా మార్చారని అన్నారు. స్వల్ప ఓటు...
KTR | రేవంత్ రెడ్డి లాంటి పిచ్చి సన్నాసి తప్ప.. చెరువును ఎవడూ తాకట్టు పెట్టడు: కేటీఆర్‌
Political

KTR | రేవంత్ రెడ్డి లాంటి పిచ్చి సన్నాసి తప్ప.. చెరువును ఎవడూ తాకట్టు పెట్టడు: కేటీఆర్‌

వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : రేవంత్ చేసిన 10 వేల కుంభకోణం మీద తాము చెప్పిందే నిజమైందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  అన్నారు. హెచ్‌సీయూ భూములపై రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని వారం రోజుల క్రితమే చెప్పామన్నారు. సుప్రీంకోర్టు సాధికార కమిటీ హెచ్‌సీయూ భూములపై ఆర్థిక పరమైన అవకతవకలు, ఉద్దేశపూర్వకంగా చేసిన అరాచక పర్వంపై స్పెషలైజ్డ్ ఏజెన్సీ ద్వారా స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని నివేదిక ఇచ్చిందని వెల్లడించారు. ఈ రూ.10 వేల కోట్ల కుంభకోణం బయటకు రావాలంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆర్బీఐ కూడా దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ‘బుధవారం నాటి సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా ఉన్నాయి. అధికార మదంతో విర్రవీగుతూ.. మేమే నియంతలం, రారాజులం అ...
KGBV | ఇంగ్లీష్ టీచ‌ర్ వేధిస్తోంది.. మండుటెండ‌లో కేజీబీవీ విద్యార్థినుల ధ‌ర్నా
District News

KGBV | ఇంగ్లీష్ టీచ‌ర్ వేధిస్తోంది.. మండుటెండ‌లో కేజీబీవీ విద్యార్థినుల ధ‌ర్నా

వరంగల్ వాయిస్,  నాగ‌ర్‌క‌ర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా నాగనూలులో పది రోజుల క్రితం ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి వేధింపులు భరించలేక 9వ త‌ర‌గ‌తి విద్యార్థిని త‌న‌ చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన సంగ‌తి తెలిసిందే. పది రోజులైనా టీచర్‌పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంగ్లీష్ టీచ‌ర్‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో అధికారుల తీరును నిర‌సిస్తూ.. విద్యార్థినులు మ‌రోసారి మండుటెండ‌లో ధ‌ర్నా చేశారు. మేడమ్ మమ్మల్ని టార్చర్ చేస్తుంది, స్నానం చేస్తుంటే ఫోటోలు తీసి ఎవరెవరికో పెడుతుంది, చదవకపోతే గొంతు పట్టుకొని పైకి లేపుతుంది అంటూ విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు మూడు గంటల నుంచి విద్యార్థినులు తరగతులను బహిష్కరించారు. ఇంగ్లీష్ టీచర్ కళ్యాణినీ సస్పెండ్ చేసే వరకు తాము ఎట్టి పరిస్థితుల్లో క్లాసుల్లోకి వెళ్ళమని, భోజ‌నం ముట్టుకోమ‌ని విద్యార్థినులు తేల్చిచెప్పారు....
MLC Kavitha | బెదిరింపుల‌కు పాల్ప‌డేవారిని వ‌దిలిపెట్టేదే లేదు.. ఎమ్మెల్సీ క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
District News

MLC Kavitha | బెదిరింపుల‌కు పాల్ప‌డేవారిని వ‌దిలిపెట్టేదే లేదు.. ఎమ్మెల్సీ క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వరంగల్ వాయిస్,  కామారెడ్డి : ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ల పేర్లను బరాబర్ పింక్ బుక్కులో రాసుకుంటాం.. బెదిరింపులకు పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకులపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. బాన్సువాడలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో కవిత పాల్గొని ప్ర‌సంగించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లవద్దని కొంత మంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిసింది. కేసులు పెట్టించే పోలీస్ స్టేషన్లకు ఈడ్చిన వాళ్లను క్షమించే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఎవరైనా ఊరుకునేదే లేదు. కాంగ్రెస్ నాయకుల తాటాకు చప్పుళ్లకు భయపడేదే లేదు. వాళ్ల తాతలు, ముత్తాతలు, జేజమ్మలు ఎవరు దిగొచ్చినా కూడా భయపడేవాళ్లెవరూ లేరు ఇక్కడ అని ఎమ్మెల్సీ క‌విత తేల్చిచెప్...