Warangalvoice

Author: Sahith Gaddam

KTR: గవర్నర్ అసెంబ్లీ ప్రసంగం.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
Latest News

KTR: గవర్నర్ అసెంబ్లీ ప్రసంగం.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

KTR: గవర్నర్ ప్రసంగం ద్వారా కాంగ్రెస్ సర్కార్ నీచత్వాన్ని‌ బయటపెట్టుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. పదవిని కాపాడుకోవటానికి ఢిల్లీకి మూటలు పంపే పనిలో రేవంత్ బిజీలో ఉన్నారని కేటీఆర్ విమర్శించారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు(బుధవారం) ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అసెంబ్లీలో ప్రసంగించారు. అయితే అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) విమర్శలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్త ప్రసంగం మాదిరిగా గవర్నర్ ప్రసంగముందని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో కేటీఆర్ మాట్లాడారు. గాంధీ భవన్‌లో కాంగ్రెస్ కార్యకర్త ప్రసంగం మాదిరిగా గవర్నర్ ప్రసంగముందని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ గవర్నర్‌ను కూడా అవమానించింది, మోసం చేసిందని మండిపడ...
MLC Kavitha | సంచార జాతులకు డీఎన్టీ సర్టిఫికెట్లు జారీ చేయాలి.. ఎమ్మెల్సీ క‌విత డిమాండ్
Latest News

MLC Kavitha | సంచార జాతులకు డీఎన్టీ సర్టిఫికెట్లు జారీ చేయాలి.. ఎమ్మెల్సీ క‌విత డిమాండ్

MLC Kavitha | సంచార జాతులకు డీనోటిఫైడ్ జాతుల(డీఎన్టీ) సర్టిఫికెట్లు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్ : సంచార జాతులకు డీనోటిఫైడ్ జాతుల(డీఎన్టీ) సర్టిఫికెట్లు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లో వెనుక‌బడి ఉన్న ఈ జాతులను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో సంచార జాతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సర్టిఫికెట్లు లేక పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని యునైటెడ్ పూలే ఫ్రంట్ కో కన్వీనర్ బొళ్ల శివ శంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ సంచార జాతుల సంఘం కోల శ్రీనివాస్ మంగళవారం నాడు ఎమ్మెల్సీ కవితకు విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను శాసన మండలిలో లేవనెత్తాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… సంచార జా...
KCR | అసెంబ్లీ స‌మావేశాల‌కు నేనూ వ‌స్తున్నా : కేసీఆర్
Latest News

KCR | అసెంబ్లీ స‌మావేశాల‌కు నేనూ వ‌స్తున్నా : కేసీఆర్

KCR | తెలంగాణ భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం ముగిసింది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న బీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం మూడు గంట‌ల‌కు పైగా కొన‌సాగింది. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : తెలంగాణ భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం ముగిసింది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న బీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం మూడు గంట‌ల‌కు పైగా కొన‌సాగింది. ఈ సంద‌ర్భంగా బ‌డ్జెట్ స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అంద‌రం క‌లిసి ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కృషి చేద్దామ‌ని కేసీఆర్ సూచించారు. అసెంబ్లీ స‌మావేశాల‌కు నేను కూడా వ‌స్తున్నాన‌ని పార్టీ ప్ర‌తినిధుల‌తో కేసీఆర్ అన్నారు. రేప‌ట్నుంచి అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి....
Adilabad | పాత మొబైల్స్‌ ఇచ్చి.. ప్లాస్టిక్‌ వస్తువులు తీసుకెళ్లండి.. సైబర్‌ నేరగాళ్ల నయా ప్లాన్‌ బట్టబయలు.. ఆరుగురు అరెస్టు
Latest News

Adilabad | పాత మొబైల్స్‌ ఇచ్చి.. ప్లాస్టిక్‌ వస్తువులు తీసుకెళ్లండి.. సైబర్‌ నేరగాళ్ల నయా ప్లాన్‌ బట్టబయలు.. ఆరుగురు అరెస్టు

Adilabad | మీ ఇంట్లో పనికిరాని పాత మొబైల్‌ను ఇస్తే ప్లాస్టిక్‌ వస్తువులు ఇస్తామని మీ ఊళ్లో తిరుగుతున్నారా? ప్లాస్టిక్‌ వస్తువులకు ఆశపడితే ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. ఇలాగే ఆటోలో వీధి వీధి తిరుగుతూ పాత మొబైల్స్‌ను సేకరించి సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టు ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో రట్టయ్యింది వరంగల్ వాయిస్,  ఆదిలాబాద్‌ : మీ ఇంట్లో పనికిరాని పాత మొబైల్‌ను ఇస్తే ప్లాస్టిక్‌ వస్తువులు ఇస్తామని మీ ఊళ్లో తిరుగుతున్నారా? ప్లాస్టిక్‌ వస్తువులకు ఆశపడితే ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. ఇలాగే ఆటోలో వీధి వీధి తిరుగుతూ పాత మొబైల్స్‌ను సేకరించి సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టు ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో రట్టయ్యింది. ఆరుగురు నిందితులతో కూడిన బిహార్‌ ముఠాను ఆదిలాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్ మీడియాకు తెలిపారు. పాత, పనికిరాని మొబైల్స్‌ను ఇస్...
RSP | చిల్ల‌ర వేషాలు మానుకోక‌పోతే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటా.. కాంగ్రెస్ సోష‌ల్ మీడియాకు ఆర్ఎస్పీ వార్నింగ్
Latest News

RSP | చిల్ల‌ర వేషాలు మానుకోక‌పోతే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటా.. కాంగ్రెస్ సోష‌ల్ మీడియాకు ఆర్ఎస్పీ వార్నింగ్

RSP | కాంగ్రెస్ పార్టీ సోష‌ల్ మీడియాపై బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. నా రాజకీయ భవిష్యత్‌పై గత రెండు రోజులుగా కాంగ్రెస్ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని స్ప‌ష్టం చేశారు. వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : కాంగ్రెస్ పార్టీ సోష‌ల్ మీడియాపై బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. నా రాజకీయ భవిష్యత్‌పై గత రెండు రోజులుగా కాంగ్రెస్ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని స్ప‌ష్టం చేశారు. ఈ చిల్లర వేషాలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాన‌ని ఆర్ఎస్పీ హెచ్చ‌రించారు. నేను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానో, ఏ వర్గాల భవిష్యత్‌ కోసం పనిచేయాల్నో నాకు క్లారిటీ ఉంద‌ని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తెలిపారు. మీ లాగా పదవులకోసం ఢిల్లీకి మూటలు మోసే సంస్కృతి నాకు లేదు. అన్ని పైసలు క...
MLC Elections | 56వేల ఉద్యోగాలు ఇచ్చినా.. గ్రాడ్యుయేట్లు ఎందుకు ఓటు వేయలేదో.. కాంగ్రెస్‌ నేత ఆవేదన
Top Stories

MLC Elections | 56వేల ఉద్యోగాలు ఇచ్చినా.. గ్రాడ్యుయేట్లు ఎందుకు ఓటు వేయలేదో.. కాంగ్రెస్‌ నేత ఆవేదన

Nizamabad | ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడం నిరాశ కలిగించిందని నిజామాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మానాల మోహన్‌ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ భవన్‌లో నుడా చైర్మన్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వరంగల్ వాయిస్,  కంఠేశ్వర్ : ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడం నిరాశ కలిగించిందని నిజామాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మానాల మోహన్‌ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ భవన్‌లో నుడా చైర్మన్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు, ఉపాధ్యాయులను సీఎం అన్ని విధాలుగా అభివృద్ధి చేసినప్పటికీ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించడం నిరాశకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక 56 వేల ఉద్యోగాలు ఇచ్చినా పట్టభద్రులు ఎందుకు ఓటు వేయలేరో అన...
MLC Kavitha | ప‌సుపు రైతుల ఆందోళ‌న‌లు ప్ర‌భుత్వానికి క‌నిపించ‌డం లేదా..? : ఎమ్మెల్సీ క‌విత‌
Latest News

MLC Kavitha | ప‌సుపు రైతుల ఆందోళ‌న‌లు ప్ర‌భుత్వానికి క‌నిపించ‌డం లేదా..? : ఎమ్మెల్సీ క‌విత‌

MLC Kavitha | నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు ప్రభుత్వానికి కనిపించడం లేదా..? అని రేవంత్ రెడ్డి స‌ర్కార్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత సూటిగా ప్ర‌శ్నించారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు ప్రభుత్వానికి కనిపించడం లేదా..? అని రేవంత్ రెడ్డి స‌ర్కార్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత సూటిగా ప్ర‌శ్నించారు. ఎన్నిక‌ల‌కు ముందు ఎన్నో మాయ మాటలు చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి మాత్రం ముందుకు రావడం లేదు. క్వింటాలు పసుపుకు రూ. 15 వేల మేర మద్దతు ధర కల్పిస్తామని ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైంది? అని నిల‌దీశారు. పసుపుకు కనీసం రూ. 9 వేలు రాని పరిస్థితి ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడానికి చర్యలు తీసుకోకపోవడం దారుణం. ఇది రైతులను నయవంచన, మోసం చేయడమే అని ఎమ్మెల్సీ క‌విత ధ్వ‌జ‌మెత్తారు. పసుపు బోర్డు తీసుకొచ్చామని చెబ...
Turmeric farmers | మెట్‌పల్లిలో పసుపు రైతుల ఆందోళన.. జాతీయ రహదారిపై బైఠాయింపు
Latest News

Turmeric farmers | మెట్‌పల్లిలో పసుపు రైతుల ఆందోళన.. జాతీయ రహదారిపై బైఠాయింపు

Turmeric farmers | మద్దతు ధర కోసం(Support price) రైతు ఐక్యవేది ఆధ్వర్యంలో పసుపు రైతులు మంగళవారం రోడ్డెక్కారు. వరంగల్ వాయిస్, మెట్‌పల్లి : మద్దతు ధర కోసం(Support price) రైతు ఐక్యవేది ఆధ్వర్యంలో పసుపు రైతులు మంగళవారం రోడ్డెక్కారు. మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ నుంచి ర్యాలీగా పాత బస్టాండ్ చేరుకున్నారు. 63వ జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. పసుపునకు క్వింటాలకు పదిహేను వేల రూపాయల మద్దతు ధర ప్రకటించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఎంఐఎస్ పథకం కింద కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి నేరుగా పసుపును కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పసుపు రైతులకు మద్దతు ధర కల్పిస్తామని ఎన్నికల ముందు వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలన్నారు. సంబంధిత అధికారులు వచ్చేవరకు రాస్తారోకోను విరమించేది లేదని రైతులు భీష్మించి కూర్చున్నారు. ఆర్డీవో శ...
KTR | ఎట్లుండె తెలంగాణ.. ఎట్లాయె తెలంగాణ..! కేటీఆర్ ఆవేద‌న‌
Political

KTR | ఎట్లుండె తెలంగాణ.. ఎట్లాయె తెలంగాణ..! కేటీఆర్ ఆవేద‌న‌

KTR | కాంగ్రెస్ పాల‌న‌లో తెలంగాణ ఆగ‌మైపోతున్న‌ది.. సాగుకు స‌రిప‌డా నీళ్లు లేక‌, విద్యుత్ కోత‌ల‌తో అన్న‌దాత బోరున విల‌పిస్తున్నాడు. చేతికొచ్చిన పంటలు ఎండిపోతుంటే రైతన్న త‌ల్ల‌డిల్లిపోతున్నాడు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : కాంగ్రెస్ పాల‌న‌లో తెలంగాణ ఆగ‌మైపోతున్న‌ది.. సాగుకు స‌రిప‌డా నీళ్లు లేక‌, విద్యుత్ కోత‌ల‌తో అన్న‌దాత బోరున విల‌పిస్తున్నాడు. చేతికొచ్చిన పంటలు ఎండిపోతుంటే రైతన్న త‌ల్ల‌డిల్లిపోతున్నాడు. ఏం చేయాలో దిక్కుతోచ‌క కొంద‌రు అన్న‌దాతలు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటుంటే.. మ‌రికొంద‌రు కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. అన్న‌దాత‌ల స‌మ‌స్య‌ల‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కేసీఆర్ పాల‌న‌లో న‌డి ఎండ‌కాలంలోనూ చెరువులు మ‌త్త‌ల్లు దుంకాయ‌ని కేటీఆర్ గుర్తు చేశారు. నేడు అదే చెరువులు నీళ్లు లేక వెల‌వెల‌బోతున్నాయ‌ని మండిప‌డ్డారు. నాడు కాలువల నిండా నీ...
KCR | బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న బీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం ప్రారంభం
Latest News

KCR | బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న బీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం ప్రారంభం

KCR | బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంగళవారం మ‌ధ్యాహ్నం ఒంటి గంట స‌మ‌యంలో తెలంగాణభవన్‌లో పార్టీ శాసనసభాపక్షం సమావేశం ప్రారంభ‌మైంది. వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంగళవారం మ‌ధ్యాహ్నం ఒంటి గంట స‌మ‌యంలో తెలంగాణభవన్‌లో పార్టీ శాసనసభాపక్షం సమావేశం ప్రారంభ‌మైంది. ఈ స‌మావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజ‌ర‌య్యారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేస్తున్నారు. బడ్జెట్‌ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్లపై బిల్లులు ప్రవేశపెట్టాలని ఈ నెల 6న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో వాటిపై తీసుకున్న చర్యలపై కేసీఆర్‌ ప...