Warangalvoice

Author: Sahith Gaddam

IAS Officer Srilakshmi: సుప్రీంలో శ్రీలక్ష్మికి చుక్కెదురు
Latest News

IAS Officer Srilakshmi: సుప్రీంలో శ్రీలక్ష్మికి చుక్కెదురు

వరంగల్ వాయిస్,  న్యూఢిల్లీ : ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి  సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓబుళాపురం అక్రమమైనింగ్ కేసులో ఆమెకు విముక్తి కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు  ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. ప్రతివాదుల వాదనలను పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టు తీర్పు ఇచ్చిందని సీబీఐ వాదనలు వినిపించింది. సీబీఐ వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. మళ్లీ శ్రీలక్ష్మి కేసును తాజాగా విచారించాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లోగా విచారణను ముగించాలని హైకోర్టును సుప్రీం ఆదేశించింది. వైఎస్సార్ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా ఓబులాపురం మైనింగ్స్‌లో అక్రమాలు జరిగాయంటూ సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితురాలిగా ఐఏఎస్‌ అధికారిణిని శ్రీలక్ష్మి అరెస్ట్ అయి కొంత కాలం జైలు జీవితం కూడా అనుభవించారు. అయితే ఈకేసులో శ్రీలక్ష్మిపై నమోదు అయిన కేసును తెలం...
CM Revanth Reddy: ఆపరేషన్ సిందూర్.. పోలీసులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు
Latest News

CM Revanth Reddy: ఆపరేషన్ సిందూర్.. పోలీసులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

వరంగల్ వాయిస్,  హైదరాబాద్: దేశ సైన్యంతో మనమంతా అండగా ఉన్నామనే సందేశం ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  తెలిపారు. ఈ సమయంలో రాజకీయాలు, పార్టీలకు తావులేదని స్పష్టం చేశారు. అత్యవసర సర్వీస్‌లు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఉద్యోగులు అంతా ప్రభుత్వానికి అందుబాటులో ఉండాలని చెప్పారు. మంత్రులు, అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఇవాళ(బుధవారం) ఉదయం 11 గంటలకు ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఆపరేషన్ సిందూర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్, డీజీపీలతో పాటు అందుబాటులో ఉన్న మిలిటరీ అధికారులు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల రక్షణకు సంబంధించి అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స...
భార‌త సైన్యానికి సెల్యూట్.. జైహింద్ : కేటీఆర్
Latest News

భార‌త సైన్యానికి సెల్యూట్.. జైహింద్ : కేటీఆర్

వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా ఉగ్ర‌వాద స్థావ‌రాల‌పై భార‌త సైన్యం మిస్సైళ్ల‌తో మెరుపు దాడి చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ అంశంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పాకిస్తాన్, పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లోని ఉగ్ర‌వాద శిబిరాల‌పై మెరుపు దాడులు చేసిన భార‌త సైన్యానికి సెల్యూల్ చేస్తున్నాన‌ని కేటీఆర్ పేర్కొన్నారు. తీవ్రవాద శిబిరాలను పూర్తిగా తుడిచిపెట్టే ప్రక్రియలో వారికి మరింత బలం చేకూరాలి… ప్రతి ఒక్కరం భారత సైన్యానికి అండగా ఉందాం అని అన్నారు. చివ‌ర‌గా జైహింద్ అని కేటీఆర్ పేర్కొన్నారు....
KCR | భార‌త సైన్యం ప్ర‌ద‌ర్శించిన సైనిక పాట‌వానికి భార‌తీయుడిగా గ‌ర్వ‌ప‌డుతున్నా : కేసీఆర్
Latest News

KCR | భార‌త సైన్యం ప్ర‌ద‌ర్శించిన సైనిక పాట‌వానికి భార‌తీయుడిగా గ‌ర్వ‌ప‌డుతున్నా : కేసీఆర్

వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : భారత సైన్యం ప్రదర్శించిన తన సైనిక పాటవానికి ఒక భారతీయుడుగా తాను గ‌ర్వ‌పడుతున్నాని బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఉగ్రవాదం, ఉన్మాదం ఏరూపంలో ఉన్నా.. ఏ దేశంలో వున్నా.. ప్రపంచ మానవాళికి నష్టం కలిగించేదే తప్ప లాభం చేకూర్చేదికాదు. ఉగ్రవాదం అంతం కావాల్సిందే అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఈ విషయంలో పాజిటివ్‌గా ఆలోచించే ప్రపంచ శక్తులన్నీ ఏకమై, ఉగ్రవాదాన్ని అంతమొందిస్తేనే శాంతి సామరస్యాలు నెలకొంటాయి. భారత సైన్యం ఎంత విరోచితంగా దాడులు చేసిందో అంతే అప్రమత్తంగా వుండి దేశరక్షణలో మేమెవరికి తీసిపోము అన్నట్టుగా వారికి శక్తి సామర్థ్యాలుండాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు....
Jagadish Reddy | రాష్ట్ర ఆదాయాన్ని లూటీ చేసి ఢిల్లీకి మూటలుగా మోస్తున్నారు.. సీఎంపై జగదీష్‌ రెడ్డి ఫైర్‌
Latest News

Jagadish Reddy | రాష్ట్ర ఆదాయాన్ని లూటీ చేసి ఢిల్లీకి మూటలుగా మోస్తున్నారు.. సీఎంపై జగదీష్‌ రెడ్డి ఫైర్‌

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి. సీఎం వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పాలన చేతగాని అసమర్థ సీఎం రేవంత్‌ అని మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి (Jagadish Reddy) వ్యాఖ్యానించారు. ఒక్క క్షణం కూడా సీఎంగా ఉండే అర్హత ఆయనకు లేదన్నారు. వెంటనే రాజీనామా చేసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘మొదటి నుంచి బీఆర్‌ఎస్‌ చెప్తున్న మాటలు నేడు నిజమని తేలిపోయాయి. ఓనమాలు రాని వాడు పదో తరగతి చదివనట్లుంది రేవంత్ తీరు. తెలంగాణ ఆర్థిక పరిస్థితికి ఎటువంటి ఢోకా లేదు. రేవంత్‌కి పరిపాలన చేతకావట్లేదనేది ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. అప్పులతో ఏర్పడిన తెలంగాణను కేసీఆర్ రెండున్నర లక్షల కోట్ల ఆదాయానికి తెచ్చారు. రాష్ట్ర ఆదాయం తగ్గి మంత్రుల ఆదాయం పెరగడంతోనే అసలు సమస్య వస్తోంది. మాఫియాలా ర...
KTR | దొంగ‌ను దొంగ‌లాగే చూస్తారు రేవంత్ రెడ్డి.. కేటీఆర్ ధ్వ‌జం
Latest News

KTR | దొంగ‌ను దొంగ‌లాగే చూస్తారు రేవంత్ రెడ్డి.. కేటీఆర్ ధ్వ‌జం

వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : నోట్ల క‌ట్ట‌ల‌తో దొరికిపోయిన దొంగ‌ను దొంగే అంటారు.. దొంగ‌ను దొంగలాగే చూస్తారు రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. ఎంతో మంది త్యాగాల ఫ‌లితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అవ‌మాన‌ప‌రిచేలా మాట్లాడిన రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడారు. వ్య‌క్తిగ‌తంగా ఎన్ని దూష‌ణాలు, తిట్లైనా తింటాం.. అవ‌మానాలు స‌హిస్తాం కానీ గ‌త ఏడాదిన్న‌ర కాలంగా మ‌మ్మ‌ల్ని నోటికొచ్చిన బూతులు మాట్లాడినా చివ‌రికి మా నాయ‌కుడి చావును కోరుకుంటూ నికృష్ట‌పు రోత మాట‌లు మాట్లాడినా మేం భ‌రించాం. స‌హించాం. కోపాన్ని పంటి బిగువును దాచుకున్నాం. మ‌మ్మ‌ల్ని ఎన్ని తిట్టినా ప‌డుతాం కానీ.. వేల మంది త్యాగాల‌తో, ద‌శాబ్దాల పోరాట‌ల ఫ‌లితంగా.. టీఎన్జీవోలు, బుద్దిజీవుల నేతృత్వంలో రాజ‌కీయ నాయ‌కులు మేల్కొక ముందే....
KTR | పీఆర్సీ, డీఏలు అడిగితే.. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను విల‌న్లుగా చిత్రీక‌రిస్తారా..? రేవంత్ రెడ్డిపై మండిప‌డ్డ కేటీఆర్
Latest News

KTR | పీఆర్సీ, డీఏలు అడిగితే.. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను విల‌న్లుగా చిత్రీక‌రిస్తారా..? రేవంత్ రెడ్డిపై మండిప‌డ్డ కేటీఆర్

వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేర‌కు పీఆర్సీ, డీఏలు అడిగితే.. రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను ప్ర‌జ‌ల‌ను ముందు విలన్లుగా చిత్రీక‌రిస్తారా..? అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. త‌మ డిమాండ్ల‌ను నెర‌వేర్చాల‌ని అడిగిన ఉద్యోగుల‌పై రేవంత్ రెడ్డి నోరుపారేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు రేవంత్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ ఏ ఒక్క హామీ ఇప్ప‌టి వ‌ర‌కు నెర‌వేర‌లేదు. తెలంగాణ కోసం వారు చేసిన త్యాగం గురించి రేవంత్ రెడ్డికి ఇసుమంతైనా తెలియ‌దు. ఫ్రీ జోన్ హైద‌రాబాద్ అని తీర్పు వ‌స్తే తెలంగాణ ఉద్యోగులు తిర‌స్క‌రించారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఎన్జీవోలు ఎంతో గొప్ప ఉద్య‌మం చేశారు అని కేటీ...
Bandi Sanjay | కరీంనగర్‌ హైవేను జాతీయ రహదారిగా విస్తరిస్తాం.. కేంద్రమంత్రి బండి సంజయ్‌ కీలక ప్రకటన
Latest News

Bandi Sanjay | కరీంనగర్‌ హైవేను జాతీయ రహదారిగా విస్తరిస్తాం.. కేంద్రమంత్రి బండి సంజయ్‌ కీలక ప్రకటన

హైదరాబాద్-కరీంనగర్ -మంచిర్యాల రాజీవ్ రహదారి నాగుపాములా అధ్వాన్నంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. క్వాలిటీ లేకుండా పనులు చేయడంవల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని తెలిపారు. రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ మేరకు నితిన్ గడ్కరీ హామీ కూడా ఇచ్చారని తెలిపారు. అయితే ఆ రోడ్డుకు సంబంధించి కొన్ని సమస్యలున్నాయని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సదరు కాంట్రాక్టర్‌తో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఈ విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవ చూపాలని సూచించారు. కొమరం భీం జిల్లాలో రూ.6100 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన పలు రహదారులకు కేంద్ర రోడ్లు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర బొగ్గు,...
Sangareddy | భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని.. ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి
Crime

Sangareddy | భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని.. ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి

సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం మల్కపూర్‌లో దారుణం చోటుచేసుకున్నది. ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యక్తి. సుభాష్‌ అనే వ్యక్తి భార్యా పిల్లలతో కలిసి మల్కపూర్‌లో నివాసం ఉంటున్నాడు. వరంగల్ వాయిస్, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం మల్కపూర్‌లో దారుణం చోటుచేసుకున్నది. ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యక్తి. సుభాష్‌ అనే వ్యక్తి భార్యా పిల్లలతో కలిసి మల్కపూర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల అతని భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన సుభాష్‌.. తన ఇద్దరు పిల్లలు మారిన్‌ (13), ఆరాధ్య (10) ఉరివేసి చంపేశాడు. అనంతరం తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘనటా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు ...
Ponnam Prabhakar | సంస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది.. ఇలాంటి దశలో సమ్మె చేయొద్దు.. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి
Top Stories

Ponnam Prabhakar | సంస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది.. ఇలాంటి దశలో సమ్మె చేయొద్దు.. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి

ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నదని, సమస్యలు తగ్గుతున్నాయని, ఇలాంటి దశలో సమ్మె చేయవద్దని ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్‌  విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని చెప్పారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నదని, సమస్యలు తగ్గుతున్నాయని, ఇలాంటి దశలో సమ్మె చేయవద్దని ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్‌  విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని చెప్పారు. సమస్యలను ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని, వినడానికి సీఎం, తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో ఆర్టీసీ సంఘాల నేతలు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ సమస్యలపై, ఆర్టీసీ సంక్షేమం కోరే ఎవరైనా నేడు, రేపు ఎప్ప...