
వరంగల్ వాయిస్, దామెర: మండలంలోని దమ్మన్నపేట
గ్రామానికి చెందిన పాండవుల ఎల్లమ్మ అనారోగ్యంతో బుధవారం మృతిచెందింది. గ్రామ సర్పంచ్ దుబాసి నవీన్, స్థానిక నాయకులతో కలిసి ఎల్లమ్మ పార్ధివ దేహానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తె లియజేశారు. వారివెంట ఉపసర్పంచ్ పాండవుల రాజు, పాలకవర్గ సభ్యులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు