
వరంగల్ వాయిస్, దామెర:రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండలంలోని దమ్మన్నపేట గ్రామపంచాయతీ సిబ్బందిని మంగళవారం రోజున ఘనంగా సన్మానించారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న సిబ్బందికి గ్రామ ప్రజాప్రతినిధులు అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నవీన్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో గ్రామపంచాయతీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామ శుభ్రత, ప్రజలకు అందిస్తున్న సేవలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో వారి కృషి ప్రశంసనీయమని అన్నారు. వారి సేవలను గుర్తిస్తూ సన్మానించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి కవిత,ఉప సర్పంచ్ పాండవుల రాజు, వార్డు సభ్యులు, అనిత నాగరాజు గాలి ఉమా సత్యం గడల ఓం ప్రకాష్ రాజ్ కుమార్ సిబ్బంది కారోబార్ సాంబయ్య రాజయ్య విజయ గ్రామ నాయకులు పాండవుల రాజేందర్ పాండవుల శీను లక్కిడి దేవేందర్ రెడ్డి గడల రాజు తదితరులు పాల్గొన్నారు