Warangalvoice

జనగణన పై సమీక్ష.


వరంగల్ వాయిస్ దామెర: మండల కేంద్రంలోని తహ సిల్దార్ కార్యాలయంలో సోమవారం తహసిల్దార్  జ్యోతి వరలక్ష్మి దేవి  జనగణన పై పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో ఇళ్ల గుర్తింపు, క్లస్టర్ల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.జనగణనకు సరైన సమాచారం అందించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాజేష్ కుమార్, ఆర్ఐ లు సంపత్ రావు, భాస్కర్ రెడ్డి, ఎంపిడిఓ కార్యాలయ సూపరింటెండెంట్,  పంచాయతీ కార్యదర్శులు, జిపిఓలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *