Warangalvoice

గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం


సర్పంచ్ కేతీపెళ్లి శ్రీధర్ రెడ్డి
వరంగల్ వాయిస్, దామెర:
ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా ఆదివారము దామెర మండలంలోని ఒగ్లాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్  కేతిపెల్లి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సిబ్బందినీ సన్మానించారు,అనంతరం మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బంది అంకిత భావంతో గ్రామ అభివృద్దే లక్ష్యంగా పని చేయాలని పరిసరాల పరిశుభ్రతతో గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తయారుచేసి మండలంలో నెంబర్ వన్ గ్రామంగా తీర్చిదిద్దాలని వారి సేవలు మరువలేనివని కొనియాడారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఇంజపెల్లి నరేష్,ఉపసర్పంచ్ కిన్నెర దినేష్,వార్డు సభ్యులు కుసుమాబాయి,పలకల అనూష, కనుకుంట్ల రజిత,నాగుల రాజ్ కుమార్, పసునూటి వసంత, కిన్నెర కోటి, పొరండ్ల విజయ్ కుమార్, గ్రామ పంచాయతీ సిబ్బంది రమేష్,చేరాలు,సబిత, శంకర్ గ్రామస్తులు కిన్నెర రమేష్,నరేష్,రామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *